ఇండిగో ఎయిర్ పోర్ట్ మేనేజర్ హత్యలో అసలైన సూత్రధారులను వదిలేస్తున్నారు, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆరోపణ

పాట్నాలో ఇటీవల ఇండిగో ఎయిర్ పోర్టు మేనేజర్ రూపేష్ కుమార్ సింగ్ హత్యకు పాల్పడినవారిలో అసలైన సూత్రధారులను వదిలేసి వారిని రక్షించేందుకు..

ఇండిగో ఎయిర్ పోర్ట్ మేనేజర్ హత్యలో అసలైన సూత్రధారులను వదిలేస్తున్నారు, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆరోపణ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 20, 2021 | 4:25 PM

పాట్నాలో ఇటీవల ఇండిగో ఎయిర్ పోర్టు మేనేజర్ రూపేష్ కుమార్ సింగ్ హత్యకు పాల్పడినవారిలో అసలైన సూత్రధారులను వదిలేసి వారిని రక్షించేందుకు పోలీసులు ఓ బలిపశువును వెదుకుతున్నారని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆరోపించారు. పాట్నాలోని ఎయిర్ పోర్టు పార్కింగ్ కాంట్రాక్ట్ వివాదానికి, రూపేష్ మర్డర్ కు లింక్ ఉందని డీజీపీ ఎస్.కె.సింఘాల్ చేసిన వ్యాఖ్యలను ఆయన అపహాస్యం చేశారు. హోమ్ శాఖను కూడా చూస్తున్న సీఎం నితీష్ కుమార్.. ఈ నేరంలో అసలైనవారిని కాపాడేందుకు ప్రభుత్వంలో ఉన్నత పదవుల నియామకాల కోసం టెండర్లు పిలవడం విడ్డూరంగా ఉందని తేజస్వి యాదవ్ అన్నారు. ఇక లోక్ జనశక్తి  పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ కూడా బీహార్ పోలీసులపై మండిపడ్డారు. రూపేష్ హత్యకు సంబంధించి వివరాలు తెలుసుకునేందుకు తను డీజీపీకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా రిసీవ్ చేసుకోలేదని ఆయన ఆరోపించారు. నేను రూపేష్ సొంత గ్రామానికి వెళ్లి అయన కుటుంబసభ్యులను పరామర్శించి వచ్చాను అని తెలిపారు.  రూపేష్ కు ఎవరైనా శత్రువులు ఉన్నారా లేరా అన్న విషయాన్ని వారు కూడా చెప్పలేకపోయారన్నారు.

కాగా రూపేష్ మర్డర్ కు ఎయిర్ పోర్టు పార్కింగ్ వివాదమే కారణమై ఉంటుందని, కుట్రదారులు ఆయనను అంతమొందించేందుకు బయటి రాష్ట్రాల నుంచి కిరాయి హంతకులను పిలిపించి ఉండవచ్ఛునని డీజీపీ సింఘాల్ అంటున్నారు.