Breaking News
  • సచివాలయంలోని పశుసంవర్ధక శాఖ లో పనిచేస్తున్న సెక్షన్ అఫిసర్ కు కరోనా పాజిటివ్ గుర్తింపు.. ఇటీవల ఢిల్లీ వెళ్లాడని తెలిసి కరోనా టెస్టులు... టెస్టు చేసిన అనంతరం పాజిటివ్ గా వచ్చినట్లు గుర్తింపు.. గాంధీ ఆస్పత్రి కి తరలించిన అధికారులు.. బిఆర్కే భవనం మొత్తం షానిటైజేషన్ చేస్తున్న అధికారులు.
  • మర్కజ్ ఘటనపై వివరాలు సేకరించిన కేంద్ర హోంశాఖ. దేశంలోని వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి తబ్లీజ్ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇండోనేషియా, మలేషియా, థాయ్ లాండ్, నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, కజకిస్తాన్ నుంచి ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
  • దేశవ్యాప్తంగా మొత్తం 1418 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు. ఈ రోజే 167 పాజిటివ్ కేసులు నమోదు. దేశ వ్యాప్తంగా కరోనా తో 45 మంది మృతి. ఈ ఒక్క రోజే 13 మంది కరోనా తో మృతి చెందినట్లు వెల్లడి. కరోనా నుంచి 123 మంది డిశ్చార్జి. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిత్వ శాఖ.
  • ఉక్రెయిన్​లో చిక్కుకున్న 300 మంది తెలుగు విద్యార్థులు. తిండి లేక ఆకలితోనే గడుపుతున్న విద్యార్థులు. చేతిలో చిల్లి గవ్వ లేక ఎన్నో ఇబ్బందులు. కరోనా రక్కసి మింగేస్తుందేమోననే భయంతో బిక్కుబిక్కుమంటున్న విద్యార్థులు.
  • తెలంగాణ లో ఇప్పటి వరకు 97 కేసులు నమోదు. ప్రస్తుతం 77 మంది వివిధ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితులు. ఈ ఒక్క రోజు 15 పాజిటివ్ కేసులు నమోదు. 14 మంది డిశ్చార్జ్,6 మృతి...

49 మంది సెలబ్రిటీలపై రాజద్రోహం కేసు క్లోజ్.. అయితే..?

bihar police closes false sedition case against celebrities, 49 మంది సెలబ్రిటీలపై రాజద్రోహం కేసు క్లోజ్.. అయితే..?

దేశంలో మూకదాడులను అరికట్టాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాసిన దాదాపు 49 మంది సెలబ్రిటీలు, మేధావులు, రచయితలపై రాజద్రోహం కేసు క్లోజయింది. ఈ మేరకు బీహార్ పోలీసులకు ఆదేశాలు అందాయి. మణిరత్నం, శ్యామ్ బెనెగల్, అనురాగ్ కశ్యప్, రామచంద్ర గుహ సహా ఈ నలభై తొమ్మిదిమందీ మోదీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. వీరి లేఖకు మద్దతు తెలుపుతూ బాలీవుడ్ కు చెందిన 180 మంది సెలబ్రిటీలు, ప్రముఖులు కూడా మరో బహిరంగ లేఖను విడుదల చేశారు. నసీరుద్దీన్ షా, కంగనా రనౌత్, మధుర్ భండార్కర్, వివేక్ అగ్నిహోత్రి, రొమిలా థాపర్ వంటి వారంతా ఈ లిస్టులో ఉన్నారు. దేశంలో జరుగుతున్న మూకదాడులను అరికట్టే విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ లేఖ రాయడంలో తప్పేం ఉందని వీరు ప్రశ్నించారు. ‘ మా నోళ్లు నొక్కకండి ‘ అంటూ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ లాంటి ప్రతిపక్షాలు కూడా వీరిని సమర్థించాయి. దేశంలో ఇదో పెద్ద సంచలనమైంది. దీంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఈ 49 మందిపై కేసు మూసివేయాలని తమకు ఆదేశాలు అందినట్టు ముజఫర్ పూర్ పోలీసులు తెలిపారు.

క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని 156(3) సెక్షన్ కింద చీఫ్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు మొదట కేసు నమోదయింది. కానీ తాజాగా ఇది ఉన్నత స్థాయి రాజకీయరంగు సంతరించుకోవడంతో.. ‘ ఎందుకొచ్చిన గొడవ ‘ అనుకుంటూ ‘ కథ క్లోజయ్యింది. అసలు ఈ వ్యవహారంలో వీరిపై ఫిర్యాదు చేసిన వ్యక్తిపైనే కేసు రిజిస్టర్ కావడం విశేషం. సుధీర్ కుమార్ ఓఝా అనే ఈ ఫిర్యాదుదారుడు లాయర్ కూడా. సెలబ్రిటీల లేఖకు సంబంధించి ఆయన ఎలాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్లను గానీ, సాక్ష్యాధారాలను గానీ చూపలేకపోయారని పోలీసు అధికారులు పేర్కొన్నారు. అసలు ఈ మేధావులు రాసినట్టు చెబుతున్న లేఖలోని సంతకాలు వారివేనా అన్న విషయాన్ని కూడా ఓఝా నిరూపించలేకపోయారన్నారు. ఈ పరిస్థితుల్లో ఇది తప్పుడు కేసు అని, ఉద్దేశపూర్వకంగానే ఫిర్యాదుదారుడు ఇలా చేశాడని అర్థమవుతోందన్నారు.

ఐపీసీలోని 182, 211 సెక్షన్ల కింద అతనిపై కేసు పెట్టినట్టు పోలీసులు తెలిపారు. (గత జులై 23 న ఓఝా తన ఫిర్యాదును పోలీసులకు అందజేశారు). దాంతో సదర్ పోలీసు స్టేషన్ లో ఎఫ్ ఐ ఆర్ నమోదయింది. ఈ వ్యవహారంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ జోక్యం చేసుకోవాలని ఆయన మాజీ సహచరుడు, ఆర్జేడీ జాతీయ ఉపాధ్యక్షుడు శివానంద్ తివారీ ఇటీవలే ఆయనను కోరారు. నిజానికి నిందితుల్లో ఒకరిగా పోలీసులు పేర్కొంటున్న మేధావి రామచంద్ర గుహ.. ఒకప్పుడు మీ నాయకత్వాన్ని ప్రశంసించిన వారే అన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దీంతో డిప్యూటీ సీఎం, బీజేపీ నేత కూడా అయినా సుశీల్ కుమార్ మోడీ ఇరకాటంలో పడ్డారు.

ఈ కేసుతో తమ పార్టీకి గానీ, సంఘ్ పరివార్ తో గానీ ఎలాంటి సంబంధం లేదని ఆయన ప్రకటించారు. పైగా-సెలబ్రిటీలపై తప్పుడు కేసు పెట్టిన ఓఝా కు ఇలాంటి అలవాటు ఎప్పటినుంచో ఉందని.. కొన్నేళ్లుగా ఈ విధమైన కేసులు వేస్తున్నాడని సుశీల్ కుమార్ మోడీ అన్నారు. కానీ..ఓఝా మాత్రం నిబ్బరంగా ఉండడమే విశేషం. తన ఫిర్యాదు ఆధారంగా ఎన్నో పిటిషన్లు దాఖలయ్యాయని, గతంలో కూడా పదేళ్లుగా ఇలాంటివి కోర్టుల్లో పెండింగులో ఉంటూ వచ్చాయని ఆయన చెప్పాడు. అసలు ఇప్పుడు నేను పోలీసులపైనే కేసు వేస్తా అంటూ ఓఝా కౌంటరివ్వడం కొసమెరుపు.

Related Tags