చదువు ఫస్ట్.. ‘సైక్లింగ్ ఫెడరేషన్‌’ ఆఫర్‌పై స్పందించిన జ్యోతి..!

జ్యోతి కుమారి.. బీహార్‌లోని సిర్‌హుల్లీకి చెందిన ఈ 15 ఏళ్ల బాలికపై ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. యాక్సిడెంట్‌కు గురైన తన తండ్రిని

చదువు ఫస్ట్.. 'సైక్లింగ్ ఫెడరేషన్‌' ఆఫర్‌పై స్పందించిన జ్యోతి..!
Follow us

| Edited By:

Updated on: May 25, 2020 | 2:07 PM

జ్యోతి కుమారి.. బీహార్‌లోని సిర్‌హుల్లీకి చెందిన ఈ 15 ఏళ్ల బాలికపై ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. యాక్సిడెంట్‌కు గురైన తన తండ్రిని సైకిల్‌పై కూర్చోబెట్టుకొని 1200కు పైగా కిలోమీటర్లు ప్రయాణించి తమ స్వగ్రామానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె ఖ్యాతి ఖండాతరాలుగా వ్యాపించింది. ఇవాంకా ట్రంప్‌ సైతం సోషల్ మీడియాలో జ్యోతిపై ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉంటే జ్యోతి సాహసాన్ని గుర్తించిన సైక్లింగ్ ఫెడరేషన్‌ ఆఫ్ ఇండియా ఆ అమ్మాయికి బంపరాఫర్ ఇచ్చింది. సైక్లింగ్‌ పోటీల్లో పాల్గొనేందుకు ఆహ్వానించడంతో పాటు ఉచితంగా శిక్షణ ఇస్తామని తెలిపింది.

అయితే సైక్లింగ్ ఫెడరేషన్‌ ఇచ్చిన ఆఫర్‌ను జ్యోతి సున్నితంగా పక్కకు పెట్టింది. దీనికి సంబంధించిన ఆమె బలమైన కారణం కూడా చెప్పుకొచ్చింది. ‘నేను ముందు నా చదువును పూర్తి చేయాలి. అందులోనూ ఆ ప్రయాణం తరువాత నేను చాలా వీక్‌గా అయిపోయా’ అని తెలిపింది. ‘ఇంట్లో ఆర్థిక సమస్యల కారణంగా నా చదువును కొనసాగించలేకపోయా. కానీ ఇప్పుడు నా పదోతరగతిని పూర్తి చేయాలనుకుంటున్నా’ అని జ్యోతి పేర్కొంది. ఇక ఈ విషయం తెలిసిన లోక్‌ జనశక్తి పార్టీ ప్రెసిడెంట్‌.. జ్యోతి చదువుకు అయ్యే ఖర్చును తాను భరిస్తానని హామీ ఇచ్చారు.

మరోవైపు సైక్లింగ్ ఫెడరేషన్‌ ఆఫర్‌పై మాట్లాడిన జ్యోతి తండ్రి మోహన్ పాశ్వాన్‌.. ”లాక్‌డౌన్ ఎత్తేసిన తరువాత జ్యోతిని ట్రయల్స్ కోసం పంపుతాము. నిన్ననే తొమ్మిదో తరగతిలో చేరేందుకు ఆమె పేరును నమోదు చేసుకుంది. ఇప్పుడైతే జ్యోతి మెట్రిక్యులేషన్‌ పూర్తి చేయాలని కోరుకుంటున్నాము” అని పేర్కొన్నారు. కాగా పిందరూచ్‌ హైస్కూల్‌లో తొమ్మిది తరగతి కోసం ఆమె పేరును జిల్లా మెజిస్ట్రేట్ నమోదు చేయించారు. ఈ సందర్భంగా ఓ కొత్త సైకిల్, స్కూల్ యూనిఫామ్, షూస్‌ను జ్యోతికి ఇచ్చారు.

Read This Story Also: మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో విబేధాలు.. ఆగిన రవితేజ మూవీ..!