‘జైల్లో ఉండి ఆయన ఎన్డీయే ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారు’, లాలూ ప్రసాద్ యాదవ్ పై సుశీల్ మోడీ ఫైర్

ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ పై బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ నిప్పులు కురిపించారు. (పశుగ్రాసం కుంభకోణం కేసులో లాలూ యాదవ్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

  • Umakanth Rao
  • Publish Date - 11:22 am, Wed, 25 November 20
'జైల్లో ఉండి ఆయన ఎన్డీయే ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారు', లాలూ ప్రసాద్ యాదవ్ పై సుశీల్ మోడీ ఫైర్

ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ పై బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ నిప్పులు కురిపించారు. (పశుగ్రాసం కుంభకోణం కేసులో లాలూ యాదవ్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఓ కేసులో బెయిల్ లభించినప్పటికీ, మరో కేసులో లభించక రాంచీలోని సెంట్రల్ జైల్లో గడుపుతున్నారు. ప్రస్తుతం ఆరోగ్య కారణాలపై ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు). బీహార్ లో నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని పడగొట్టి ఆర్జేడీ అధికారంలోకి రావడానికి లాలూ కుట్ర పన్నుతున్నారని, ఎన్డీయే ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతున్నారని సుశీల్ కుమార్ మోడీ ఆరోపించారు. మహాఘట్ బంధన్ కి పరోక్షంగా తోడ్పడుతున్నారని అంటూ ఇందుకు నిదర్శనంగా ఓ మొబైల్ నెంబరును కూడా ఆయన తన ట్విటర్ లో పేర్కొన్నారు. ఈ నెంబర్ ద్వారా లాలూ ఎన్డీయే ఎమ్మెల్యేలతో బేరసారాలాడుతున్నారని, మీకు మంత్రి పదవులు ఇస్తామంటూ ఆశ పెడుతున్నారని ఆయన అన్నారు. ఈ నెంబరుకు తాను ఫోన్ చేయగా ఏకంగా లాలూయే రిసీవ్ చేసుకున్నారని సుశీల్ మోడీ తెలిపారు. అయితే జైల్లో ఉంటూ ఇలా మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలించబోవని, చెత్త రాజకీయాలు చేయవద్దని సలహా  ఇచ్చారు.   నితీష్ ప్రభుత్వాన్ని పడగొడితే సహించేది లేదని హెచ్చరించారు.