Breaking News
  • తూ.గో: పెద్దాపురంలో దారుణం. యర్రా శివశంకర్‌ అనే వ్యక్తిపై నగేష్‌ కత్తితో దాడి. పరిస్థితి విషమం, కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలింపు.
  • అమరావతి: ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేశారు. ప్రలోభాలకు లొంగలేదనే మండలి రద్దు తీర్మానం చేశారు. సెలెక్ట్‌ కమిటీ అంటే జగన్‌కు ఎందుకంత భయం. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ఎందుకు విచారణ జరపలేదు -ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు.
  • మద్దాల గిరిని ఆర్థికంగా బెదిరించి పార్టీలోకి లాక్కున్నారు.
  • 11 మంది భారతీయ మత్స్యకారులను బంధించిన శ్రీలంక. ఒక పడవను స్వాధీనం చేసుకున్న శ్రీలంక నేవీ సిబ్బంది.
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 8 గంటల సమయం. 16 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు. ఈ రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.02 కోట్లు. ఈ రోజు శ్రీవారిని దర్శించుకున్న 44,366 మంది భక్తులు.
  • సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌ బదిలీ. అమోయ్‌ కుమార్‌ను రంగారెడ్డి జిల్లాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు. నేరేడుచర్ల ఇంచార్జి కమిషనర్‌ మహేందర్‌రెడ్డి సస్పెన్షన్‌. తహశీల్దార్‌ రాంరెడ్డికి ఇంచార్జి బాధ్యతలు. కేవీపీ ఓటు విషయంలో అధికారుల తీరుపై ప్రభుత్వం చర్యలు.

దాడుల్ని ప్రశ్నించారని కాంగ్రెస్‌ నేత రాజీనామా

, దాడుల్ని ప్రశ్నించారని కాంగ్రెస్‌ నేత రాజీనామా

పాట్నా: బీహార్ లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బాలాకోట్‌ దాడులపై కాంగ్రెస్ పార్టీ సందేహాలు వ్యక్తం చేయడం పట్ల ఆ పార్టీకి చెందిన నేతలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ సీనియర్‌ నేత, అధికార ప్రతినిధి వినోద్‌ శర్మ పార్టీకి రాజీనామా చేసి షాక్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ రాశారు. వైమానిక దళ దాడులను ప్రశ్నించడం వల్ల క్షేత్రస్థాయిలో ఎంతో మంది కార్యకర్తలు నిరాశకు గురయ్యారన్నారు. ఈ విషయంపై గత నెల రోజులుగా రాహుల్‌కు లేఖలు పంపినట్లు ఆయన తెలిపారు. అయినా తమ విన్నపాన్ని ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నాను. వైమానిక దాడులకు ఆధారాలు అడగడం పట్ల నేను మనస్తాపానికి గురయ్యాను. కాంగ్రెస్‌ వైఖరిపై నిరాశతో ఉన్నాను. దేశ రక్షణలో భాగంగా భద్రతా బలగాలు చేపట్టే ప్రతి చర్యని మనం సమర్థించాలి. దాడులను రాజకీయం చేయోద్దు అని వినోద్‌ శర్మ అన్నారు

పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం పాకిస్థాన్‌లోని జైష్‌ ఎ మహ్మద్‌ ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసిన విషయం తెలిసిందే. దీనిపై విపక్షాలు పలు అనుమానాలు లేవనెత్తడంతో రాజకీయ దుమారం చెలరేగింది. దాడులకు సంబంధించిన ఆధారాలను బహిర్గతం చేయాలని కొందరు నేతలు డిమాండ్‌ చేశారు. అలాగే దాడుల్లో మరణించిన ఉగ్రవాదుల సంఖ్యను కూడా తెలపాలని కోరారు. దీంతో దాడుల్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని అధికార, విపక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న విషయం తెలిసిందే.