Breaking News
  • అమరావతి: హైకోర్టును ఆశ్రయుంచిన ఆన్ -ఎయిడెడ్ స్కూల్ యాజమాన్యం. ప్రభుత్వం జారీ చేసిన 155 మెమోను సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్ పై విచారణ.. 155 మెమోను సస్పెండ్ చేయాలని కోరుతూ న్యాయవాది వాదనలు.. ప్రవేట్ స్కూల్లోని విద్యార్థుల డేటాను యాజమాన్యానికి తెలియ కుండా తొలగిస్తున్నారన్న న్యాయవాది.. పూర్తి వివరాలతో కౌoటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం.. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా..
  • హేమంత్ హత్య కేసు: ఈ కేసులో 17 మందిని అరెస్ట్ చేసాము. నిందితులు లక్ష్మ రెడ్డి,యుగేంద్రర్ రెడ్డి ని 6 రోజులపాటు కస్టడీకి అనుమతించిన కోర్టు. ఈ రోజు నిందితులను కస్టడీకి తీసుకుంటాం.
  • కరోనా వారియర్స్‌: తూ.గో: కరోనాను జయించిన ఎస్పీ అద్నన్‌ నయీం అస్మీ, ఏఎస్పీ కరణం కుమార్‌. విధుల్లో చేరేందుకు వచ్చిన వీరిపై సిబ్బంది పూలవర్షం . ఘనస్వాగతం పలికిన తోటి పోలీసులు.
  • ఉప ఎన్నికలకు పచ్చజెండా : ఢిల్లీ: కర్నాటకలో ఉప ఎన్నికలకు ఈసీ గ్రీన్‌సిగ్నల్‌. 2 కౌన్సిల్‌, 2 ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ . అక్టోబర్‌ 28న పోలింగ్‌, నవంబర్‌ 2న కౌంటింగ్‌ . గత జూన్‌ 30న ఖాళీ అయిన నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు .
  • విశాఖ: కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ వామపక్షాల నిరసన దీక్ష, పాల్గొన్న సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, వ్యవసాయాన్ని దెబ్బతీసేందుకే మోదీ చట్టాన్ని తీసుకొచ్చారని నారాయణ విమర్శలు.
  • ప్రచారంలో వాస్తవంలేదు . ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా అచ్చెన్నాయుడి పేరును లోకేష్‌ వ్యతిరేకిస్తున్నా ప్రచారంలో నిజంలేదు. అవి కేవలం సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే-టీడీపీ వర్గాలు .
  • బతుకమ్మ చీరల ప్రదర్శన : హైదరాబాద్‌: హరితప్లాజాలో బతుకమ్మ చీరల ప్రదర్శన. ప్రదర్శనను తిలకిస్తున్న మంత్రులు కేటీఆర్‌, సబిత ఇంద్రారెడ్డి, సత్యవతిరాథోడ్‌ . మరికాసేపట్లో బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభం .
  • వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ – సన్నద్దత, రబీ పంటల సాగుపై ప్రణాళిక, వ్యవసాయ సలహా కమిటీల సమావేశాల నిర్వహణపై సీఎం. ఖరీఫ్‌ పంట చేతికొస్తుంది, అక్టోబర్‌ 15 నుంచి ధ్యాసపెట్టాలి. ఆర్‌బీకేల ద్వారా మన ప్రొక్యూర్‌మెంట్‌ మరింత ఎఫెక్టివ్‌గా పనిచేయాలి. ఈ క్రాపింగ్‌ ప్రతీ పంటకు పూర్తి చేయాలి. ప్రతీ రైతు వివరాలు ఈ క్రాపింగ్‌లో పక్కాగా ఉండాలి, సోషల్‌ ఆడిట్‌ చేయాలి, మిస్‌ అయితే వెంటనే నమోదుచేయాలి. ఫామ్‌గేట్‌ అనేది ప్రతీ పంటకూ చేయాలి. కూపన్లు ఇచ్చి ఫలానా రోజు ప్రొక్యూర్‌ చేస్తామని చెప్పాలి. ఎక్కడా కూడా మ్యాన్యువల్‌ సర్టిఫికెట్‌ ఉండకూడదు, ఈ క్రాపింగ్‌ తప్పనిసరిగా జరగాలి.

మోదీ అభయం.. నితీష్ కుమార్ హర్షామోదం

నవంబరులో జరిగే ఛాత్ పూజ వరకు దేశంలోని పేదలకు ఉచిత రేషన్ ఇస్తామంటూ ప్రధాని మోదీ చేసిన ప్రకటన పట్ల బిహార్ సీఎం నితీష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో..

Bihar Cm Nitish Kumar, మోదీ అభయం.. నితీష్ కుమార్ హర్షామోదం

నవంబరులో జరిగే ఛాత్ పూజ వరకు దేశంలోని పేదలకు ఉచిత రేషన్ ఇస్తామంటూ ప్రధాని మోదీ చేసిన ప్రకటన పట్ల బిహార్ సీఎం నితీష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని హామీ పాలక ఎన్డీయే విజయావకాశాలను పెంచుతుందని ఆయన అన్నారు. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద మరో అయిదు నెలలపాటు ఫ్రీ రేషన్ ఇస్తామన్న మోదీకి కృతజ్ఞతలని ఆయన ట్వీట్ చేశారు. ఈ పథకాన్ని మరో మూడు నెలల పాటు పొడిగించాలని డిమాండ్ చేసిన డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ.. కేంద్రం ఇప్పటికే 5,057 కోట్ల విలువైన ఆహార ధాన్యాలను పంపిణీ చేసిందన్నారు. రాష్ట్రంలోని వలస కార్మికులకు ప్రధాని ప్రకటన వరమని ఆయన అభివర్ణించారు.   .బిహార్ లో ఛాత్ పూజ అతి పెద్ద పండుగ అని, మోదీ ఇఛ్చిన హామీతో వారు సంతోషంగా ఈ పండుగ జరుపుకోగలరని సుశీల్ మోడీ పేర్కొన్నారు.

కాగా- మోదీ ప్రత్యేకంగా ఈ ఛాత్ పూజ గురించి ప్రస్తావించడం కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకునేఅని, కానీ రాష్ట్రంలోని ఇతర సమస్యలను తాము ప్రస్తావించి.. ఎన్నికల్లో తమ విజయావకాశాల మెరుగుదలకు వ్యూహాలు పన్నుతామని విపక్షాలు అంటున్నాయి. వలస కార్మికులను ఆదుకునేందుకు తాము కూడా యత్నిస్తున్నట్టు కాంగ్రెస్ నేతలు ప్రకటించారు.

 

Related Tags