సుశాంత్ కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై నితీష్ హర్షం, న్యాయం జరగాల్సిందే

సుశాంత్ కేసులో సీబీఐ దర్యాప్తునకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల బిహార్ సీఎం నితీష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. అయితే ఇది కేవలం సుశాంత్ కుటుంబానికే చెందినది..

సుశాంత్ కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై నితీష్ హర్షం, న్యాయం జరగాల్సిందే
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 19, 2020 | 4:22 PM

సుశాంత్ కేసులో సీబీఐ దర్యాప్తునకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల బిహార్ సీఎం నితీష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. అయితే ఇది కేవలం సుశాంత్ కుటుంబానికే చెందినది కాదని, మొత్తం దేశానికంతటికీ సంబంధించినదని ఆయన అన్నారు. సీబీఐ ఇన్వెస్టిగేషన్ వల్ల న్యాయం జరుగుతుందన్న విశ్వాసం ప్రజలందరిలో కలగాలని ఆయన అన్నారు. మా రాష్ట్ర పోలీసుల దర్యాప్తు, ఇక్కడ దాఖలైన ఎఫ్ ఐ ఆర్ పూర్తిగా సముచితమేనని సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేసిందన్నారు. సుశాంత్ కుటుంబమే కాదు.. ఈ దేశమంతా న్యాయం జరగాలని కోరుతోంది.. దేశంలో ఇంకా జస్టిస్ అన్నది ఉందని సీబీఐ ఇన్వెస్టిగేషన్ వల్ల తేలాలి అని నితీష్ కుమార్ వ్యాఖ్యానించారు.

మా రాష్ట్ర పోలీసులు తమ దర్యాప్తు తాము చేస్తున్నారని, కానీ ముంబై పోలీసుల నుంచి సహకారం అందలేదని నితీష్ పేర్కొన్నారు. ముంబైలో మా పోలీసులపట్ల అక్కడి పోలీసులు ఎలా ప్రవర్తించారో అందరికీ తెలిసిందే అన్నారు.