బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు టూత్‌ పిక్స్‌, ఖాదీ గ్లోవ్స్‌

షెడ్యూల్‌ ప్రకారం అయితే అక్టోబర్‌-నవంబర్‌ మాసాల్లో బీహార్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగాలి. దీంతో ఎన్నికల సంఘం బీహార్‌ రాష్ట్ర ఖాదీ బోర్డుతో సంప్రదింపులు జరిపింది. ఓటర్లందరికీ ఖాదీ గ్లోవ్‌లు ఇస్తే ఎలా ఉంటుందో ఆలోచించమని చెప్పింది. అలాగే ఓటేసేటప్పుడు వేలితో కాకుండా టూత్‌ పిక్స్‌ని ఉపయోగిస్తే బాగుంటుందని సూచించింది.

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు టూత్‌ పిక్స్‌, ఖాదీ గ్లోవ్స్‌
Follow us

|

Updated on: Jul 03, 2020 | 1:55 PM

టిమీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి ప్రభుత్వాలు ఆపసోపాలు పడుతున్నాయి.. ఇలాంటి విపత్కర సమయంలోనే బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు వచ్చిపడుతున్నాయి. షెడ్యూల్‌ ప్రకారం అయితే అక్టోబర్‌-నవంబర్‌ మాసాల్లో బీహార్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగాలి.. అక్టోబర్‌ నాటికి కరోనా కనుమరుగువుతుందో.. మరింత కన్నెర్ర చేస్తుందో ఇప్పుడే చెప్పడం కష్టమే కానీ ఎన్నికలంటూ జరిగితే తీసుకోవలసిన జాగ్రత్తలపై బీహార్‌ ఎన్నికల సంఘం కసరత్తులు చేస్తోంది. భారత ఎన్నికల కమిషన్‌కు కొన్ని ప్రతిపాదనలు పంపింది కూడా! పోలింగ్‌ బూత్‌లో ఓటరు అడుగు పెట్టిన తర్వాత ఆ వ్యక్తితో భౌతికదూరం పాటించడం కుదరని పని! కనీసం మూడు చోట్ల ఓటరుతో పోలింగ్‌ సిబ్బంది కాంటాక్ట్‌ అవ్వాల్సి వస్తుంది. రిజిస్టర్‌లో ఓటర్‌ సంతకం చేయడమో, వేలిముద్ర వేయడమో చేయాలి. ఓటు వేయకముందు ఆ వ్యక్తి వేలిపై ఇంక్‌ మార్క్‌ వేయాలి. ఓటర్‌ ఓటు వేయడానికి ముందు స్లిప్‌ ఇవ్వాలి.. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని బీహార్‌ ఎన్నికల సంఘం కొన్ని ఆలోచనలు చేసింది.. బీహార్‌ రాష్ట్ర ఖాదీ బోర్డుతో సంప్రదింపులు జరిపింది. ఓటర్లందరికీ ఖాదీ గ్లోవ్‌లు ఇస్తే ఎలా ఉంటుందో ఆలోచించమని చెప్పింది.. అలాగే ఓటేసేటప్పుడు వేలితో కాకుండా టూత్‌ పిక్స్‌ని ఉపయోగిస్తే బాగుంటుందని సూచించింది. బీహార్‌లో మొత్తం 7.18 కోట్ల ఓటర్లు ఉన్నారు. 65ఏళ్లు దాటిన వారు, హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్న వారు ఎలాగూ పోస్టల్‌ బ్యాలెట్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ సంఖ్య స్వల్పంగానే ఉంటుంది.. ఇప్పుడున్న పరిస్థితులలో పోలింగ్‌ బూత్‌ల సంఖ్య 45శాతం పెంచుకోవాలి.. అంటే 1.06 పోలింగ్‌ బూత్‌ల అవసరం ఉంటుందని చెప్పారు చీఫ్‌ ఎలెక్షన్‌ కమిషనర్‌ సునీల్‌ ఆరోరా.