Breaking News
  • ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీని నడపలేం-సీఎం కేసీఆర్‌. ఆర్టీసీకి ఇప్పటికే రూ.5 వేల కోట్ల అప్పులున్నాయి. తక్షణం చెల్లించాల్సిన అప్పులు, బకాయిలు దాదాపు రూ.2 వేల కోట్లు. ప్రస్తుతం ఆర్టీసీని నడపాలంటే నెలకు రూ.640 కోట్లు కావాలి. ఆర్టీసీకి ఆర్థిక భారం మోసే శక్తి లేదు. ఆర్థిక మాంద్యం కారణంగా ప్రభుత్వం కూడా భరించే పరిస్థితి లేదు. ఆర్టీసీకి ఉన్న ఒకే ఒక మార్గం బస్సు చార్జీలు పెంచడం. చార్జీలు ఎక్కువైతే ప్రజలు బస్సులు ఎక్కని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఆర్టీసీని యధావిధిగా నడపడం సాధ్యం కాదు. హైకోర్టు తీర్పు తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటాం-కేసీఆర్‌
  • హైదరాబాద్‌: నేడు రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ. హైకోర్టు తీర్పుపై ఆర్టీసీ కార్మికుల్లో ఉత్కంఠ
  • చంద్రయాన్‌-2 ప్రయోగం విఫలమైందనడం సమంజసం కాదు. ఇలాంటి ప్రయోగాల్లో చిన్న సమస్యలు తలెత్తే అవకాశం సాధారణం. అంతమాత్రాన చంద్రయాన్‌-2 విఫలమైందనడం సరికాదు -కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌
  • ఎస్‌పీజీ సెక్యూరిటీ ఉపసంహరణపై ప్రియాంకాగాంధీ స్పందన. రాజకీయాల్లో భాగంగానే సెక్యూరిటీ తొలగించారు. ఇకపై ఈ తరహా ఘటనలు జరుగుతూనే ఉంటాయి-ప్రియాంక
  • తాజ్‌మహల్‌ పరిసరాల్లో డ్రోన్లు ఎగరేసిన విదేశీ యాత్రికులు. రష్యాకు చెందిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • దేశంలో ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొనేందుకు.. పెట్టుబడుల ఉపసంహరణ సరైన పరిష్కారం కాదు-మమతాబెనర్జీ. ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయం తాత్కాలిక ఉపశమనమే. ఇలాంటి చర్యలు ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి దోహదం చేయవు-మమత
  • సియాచిన్‌పై పాకిస్తాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు. సియాచిన్‌ వివాదాస్పద ప్రాంతం. అలాంటి ప్రాంతంలో భారత్‌ పర్యాటకాన్ని ఎలా ప్రారంభిస్తుంది. భారత్‌ నుంచి ఎలాంటి మంచిని ఆశించడంలేదన్న పాక్‌
  • ఈశాన్య రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు. గౌహతి, షిల్లాంగ్‌లో కంపించిన భూమి. భయంతో ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీసిన జనం

బిగ్ బాస్ బిగ్ షాక్.. ఎలిమినేషన్‌లో అనుకోని ఉత్కంఠ!

Is Mahesh Vitta Eliminated From Bigg Boss House In 12th Week, బిగ్ బాస్ బిగ్ షాక్.. ఎలిమినేషన్‌లో అనుకోని ఉత్కంఠ!

కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 విజయవంతంగా 12 వారాలు పూర్తి చేసుకుని 13వ వారంలోకి అడుగుపెట్టబోతోంది. ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క మాదిరిగా హౌస్‌లో అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఉండటంతో టైటిల్ వేటలో ఎంపికయ్యే నలుగురు ఎవరనే దానిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇక ఈ వారం ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన సభ్యులు ముగ్గురు. ఇందులో కొసమెరుపు ఏంటంటే ముగ్గురూ కూడా స్ట్రాంగ్ కంటెంస్టెంట్లు.. బిగ్ బాస్ ఇచ్చే టాస్కుల్లో నువ్వా- నేనా అన్నట్లుగా పోటీపడి మరీ ఆడుతున్నారు. 12వ వారం ఇంటి నుంచి బయటి వెళ్లే వాళ్ళల్లో వరుణ్ సందేశ్, మహేష్ విట్టా, రాహుల్ సిప్లిగంజ్‌లు నామినేట్ అయ్యారు.

ఇది ఇలా ఉండగా సోషల్ మీడియాలో నడుస్తున్న ట్రెండ్‌ను బట్టి ఇప్పటికే మహేష్ విట్టా ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. హీరో ఇమేజ్‌తో వరుణ్ సందేశ్, పునర్నవి ఫ్యాన్స్‌ ఓటింగ్‌తో రాహుల్ సిప్లిగంజ్ సేఫ్ జోన్‌లో ఉన్నారని సమాచారం. అయితే ఈ అంచనాలు తారుమారు అయ్యే అవకాశాలు లేకపోలేదని కొందరి భావన.

మహేష్ విట్టాను ఈ వారం సేవ్ చేయడానికి అతని ఫ్యాన్స్ వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని వినికిడి. అంతేకాకుండా బిగ్ బాస్ టైటిల్‌ వేటలో మహేష్ ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. మరి ఈ వారం మహేష్ హౌస్ నుంచి బయటికి వెళ్తున్నాడో.. లేక మిత్రుల్లో ఒకరు ఎగ్జిట్ అవుతారో వేచి చూడాలి.