Breaking News
  • ఏడు నెలల పాలనలో జగన్‌ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
  • ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
  • కృష్ణాజిల్లా: కీసర టోల్‌ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్‌. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్‌ కౌంటర్ల ద్వారా టోల్‌ వసూలు చేస్తున్న సిబ్బంది.
  • చిత్తూరు టూటౌన్‌ పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
  • చెన్నై వన్డేలో టాస్‌గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌. భారత్‌-విండీస్‌ మధ్య తొలివన్డే.
  • తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
  • విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.

బిగ్ బాస్: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

Vithika And Shivajyothi To Be Eliminated In Bigg Boss Telugu, బిగ్ బాస్: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

బిగ్ బాస్ చివరి వారంలోకి అడుగుపెట్టబోతోంది. ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు కంటెస్టెంట్లు ఉండగా.. ఈ వారం అందరూ కూడా ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. వరుణ్ సందేశ్, రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి.. ఇలా ఇంటి సభ్యులందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లు కావడంతో ఫైనల్‌కు ఎవరు చేరుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. బిగ్ బాస్ ఇచ్చిన నెంబర్ టాస్క్‌లో అందరూ కూడా తమకు ఇచ్చిన నెంబర్లను సెలెక్ట్ చేసుకోవడంలో విఫలం కావడంతో బిగ్ బాస్ అందరిని నామినేట్ చేయడం జరిగింది.

ఈ వారం వరుణ్ సందేశ్ భార్య వితిక షేరు హౌస్ నుంచి ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. హౌస్‌లోకి వీక్ కంటెస్టెంట్‌గా ప్రవేశించిన ఆమె పలుసార్లు నామినేట్ అయినా అదృష్టం కలిసొచ్చి అవరోధాలన్నింటి దాటుకుని చివరి వరకు చేరుకుంది. ఇక తాజాగా షో చివరి దశకు చేరుకోవడం.. పైగా కొద్దిరోజులుగా ఆమె ప్రవర్తనలో మార్పు రావడంతో ప్రేక్షకులు ఆమెను ఇంటికి సాగనంపాలని అనుకుంటున్నారు. అంతేకాక పలు అనధికారిక పోల్స్‌ను పరిశీలిస్తే.. వితిక ఓటింగ్‌లో చాలా దారుణంగా వెనకబడి ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకాలం వరుణ్ సందేశ్, రాహుల్, పునర్నవిలతో కలిసి ఉండటం వల్ల తప్పించుకుంది గానీ ఇప్పుడు షో చివరికి చేరుకోవడంతో ఎలిమినేషన్ తప్పేలా కనిపించట్లేదు.

మరోవైపు ఈ వారం వితికను కాపాడే క్రమంలో వరుణ్ సందేశ్‌ కూడా గెలిచే అవకాశాలను చేజేతులా కోల్పోయాడని చెప్పొచ్చు. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్‌కు ఈ వారం ఛాన్స్ ఉంటే వితికతో పాటు శివజ్యోతి కూడా ఎలిమినేట్ అవుతుందని ప్రచారం జరుగుతోంది.