“బిగ్ బాస్3” నుంచి రోహిణీ ఎలిమినేటెడ్

Bigg Boss telugu Season 3 : Rohini Eliminated from the House in Fourth Week, “బిగ్ బాస్3” నుంచి రోహిణీ ఎలిమినేటెడ్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో నాలుగోవారం రోహిణి ఔట్ అయిపోయింది. నాలుగో వారంలో శివజ్యోతి, వరుణ్‌ సందేశ్‌, బాబా భాస్కర్‌, శ్రీముఖి, రవికృష్ణ, రాహుల్‌, రోహిణి ఎలిమినేషన్‌ నామినేషన్స్‌లో ఉండగా.. శివజ్యోతి సేఫ్‌లో ఉన్నట్లు శనివారమే నాగార్జున ప్రకటించాడు. దీంతో ఎలిమినేషన్ నామినేషన్ నుంచి శివ జ్యోతి సేఫ్ జోన్‌లో పడింది. ఇక ఈరోజు జరిగిన షోలో ఒక్కొక్కరిని సేఫ్ చేశాడు నాగ్. చివర్లో ఎలిమినేషన్‌లో రోహిణి, రాహుల్ సిప్లిగంజ్ ఇద్దరు మిగిలారు. అయితే, చివరకు రోహిణి ఎలిమినేట్ అయిపోతున్నట్టు నాగార్జున ప్రకటించాడు. దీంతో హౌస్ నుంచి బ్యాగ్ సర్దుకుని రోహిణి బయటకు వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *