బిగ్ బాస్ 4 తెలుగు : ఒక్క ఎపిసోడ్‌తో సీన్ రివర్స్, చివర్లో ఉన్న అతడు దూసుకుంటూ పైకి వచ్చాడు !

బిగ్ బాస్ సీజన్ 4 ఎండింగ్‌కి వచ్చిన నేపథ్యంలో రసవత్తరంగా మారింది. 13వ వారానికి సంబంధించి జరిగిన నామినేషన్ ప్రక్రియలో ప్రతి కంటెస్టెంట్ కలర్ నింపిన ట్యూబ్‌లను మెడలో ధరించాలి.

బిగ్ బాస్ 4 తెలుగు : ఒక్క ఎపిసోడ్‌తో సీన్ రివర్స్, చివర్లో ఉన్న అతడు దూసుకుంటూ పైకి వచ్చాడు !
Follow us

| Edited By: Team Veegam

Updated on: Dec 04, 2020 | 3:30 PM

బిగ్ బాస్ సీజన్ 4 ఎండింగ్‌కి వచ్చిన నేపథ్యంలో రసవత్తరంగా మారింది. 13వ వారానికి సంబంధించి జరిగిన నామినేషన్ ప్రక్రియలో ప్రతి కంటెస్టెంట్ కలర్ నింపిన ట్యూబ్‌లను మెడలో ధరించాలి. ఆ తర్వాత ఒక ఇంటి సభ్యుడు నామినేట్ చేయాలనుకున్న ఇద్దరు సభ్యుల కంటైనర్లలో కలర్ వాటర్ పోయాలి. ఎవరి కంటైనర్‌లో ఎక్కువ కలర్ వాటర్ ఉంటే వాళ్లు నామినేట్ అయినట్లుగా భావించాలి. ఈ లిస్ట్‌లో అభిజీత్, అవినాష్, మోనాల్, అఖిల్‌లు నామినేట్ అయ్యారు. నామినేషన్ ప్రక్రియకు సంబంధించిన ఎపిసోడ్ పూర్తయిన వెంటనే ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆరోజు రాత్రితో పాటు తర్వాత రోజు జరిగిన పోలింగ్‌లో ఎటువంటి సంచలనం లేకుండా యధావిధిగా అభిజీత్ టాప్ ప్లేసులో నిలిచాడు. ఆ తర్వాతి ప్లేసులో హారిక నిలిచింది. మూడు నాలుగు ప్లేసుల్లో మోనాల్ గజ్జర్, అఖిల్ సార్థక్ ఉన్నారు. ఇక, తక్కువ ఓట్లతో లాస్ట్ ప్లేసులో ఉన్నాడు జబర్ధస్త్ అవినాష్

రేస్ టు ఫినాలే టాస్క్ నామినేషన్ ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాతి రోజు.. బిగ్ బాస్ హౌస్‌లో ‘రేస్ టు ఫినాలే’ టాస్క్ స్టార్టవుతుంది. మూడు రౌండ్లలో జరిగే ఈ టాస్కులో విన్నర్ అయిన ఇంటి సభ్యుడు నేరుగా ఫినాలేకు వెళ్తాడు. అయితే, సదరు కంటెస్టెంట్ ఈ వారం ఎలిమినేషన్ గండాన్ని దాటి వెళ్లాలి. ‘రేస్ టు ఫినాలే’ మొదటి లెవెల్‌లో… గార్డెన్ ఏరియాలో ఉన్న ఆవు నుంచి వచ్చే పాలను తమ దగ్గర ఉన్న పాత్రల్లో నింపుకోవాలి కంటెస్టెంట్లు. ఈ టాస్కులో భాగంగా అవినాష్‌ను మోనాల్ గజ్జర్ కాలితో తన్నింది. అంతేకాదు, అఖిల్.. సోహెల్ మిగిలిన కంటెస్టెంట్లకు మభ్యపెట్టి కలిసి గేమ్ ఆడారు. ఈ పరిణామాలు ఓటింగ్‌పై ప్రభావం చూపించాయి.

తాజాగా అందుతోన్న గణాంకాల ప్రకారం.. ‘రేస్ టు ఫినాలే’ టాస్క్ ముందు వరకూ నాలుగో స్థానంలో ఉన్న మోనాల్ గజ్జర్.. ఆ తర్వాత లాస్ట్ ప్లేసుకు పడిపోయిందట. అలాగే దేత్తడి హారిక సైతం నాలుగో స్థానానికి కోసం పోటి పడుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో అభిజీత్ మాత్రం నంబర్ వన్ ప్లేసులో కొనసాగుతున్నాడు. అలాగే, అఖిల్ సార్థక్ సెకండ్ ప్లేసుకు చేరుకున్నాడని సమాచారం. ఓటింగ్ ప్రారంభం అయిన రెండు రోజులూ చివరి స్థానంలో ప్రమాదపు అంచున నిలిచిన అవినాష్..తాజాగా మూడో స్థానానికి చేరుకున్నాడని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ‘రేస్ టు ఫినాలే’లో అతడిని కార్నర్ చెయ్యడం.. మోనాల్ గజ్జర్ కాలితో తన్నడం వంటి అంశాలు అతడికి ప్లస్ అయ్యాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

గ్రేటర్ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్‌డేట్ కోసం దిగువ లింక్ క్లిక్ చెయ్యండి :

GHMC Election Result 2020 Live Update : కొనసాగుతోన్న ఓట్ల లెక్కింపు, పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ ఆధిక్యం

GHMC Election Results 2020: Full list of winning candidates : గ్రేటర్ ఎన్నికల్లో విజేతలు వీరే

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రభస.. ఐదవ రోజూ కొనసాగిన సస్పెన్షన్ల పర్వం.. 10 మంది టీడీపీ సభ్యులపై వేటు.. 

నేడు రైతులతో కేంద్రం 4వ విడత చర్చలు, సహనాన్ని, బలహీనతగా తీసుకోవద్దని సంఘాల వార్నింగ్

మూడో టీ20కి స్టేడియం నిండా ప్రేక్షకులు, నిబంధనలు సడలించిన న్యూసౌత్ వేల్స్ గవర్నమెంట్ !

ఇండియాలో అమ్మే 77 శాతం తేనెలు కల్తీవే, సీఎస్‌ఈ పరిశోధనల్లో సంచలన విషయాలు వెల్లడి

బిగ్ బాస్ 4 తెలుగు : అరియానాపై విరుచుకుపడ్డ అవినాష్, ఆగం ఆగం అవుతున్నావ్ ఎందుకు బాస్ !