Breaking News
  • సీఎం జగన్‌ సైకో ఇజం చూపిస్తున్నారు-నారా లోకేష్‌. టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారు. డీజీపీ ఆఫీస్‌ నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి కేసులు పెట్టిస్తున్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి-నారా లోకేష్‌.
  • ప.గో: జీలుగుమిల్లి మండలం తాటియకులగూడెంలో విషాదం. చెరువులో మునిగిపోతున్న కుమారుడిని కాపాడబోయి తండ్రి గల్లంతు. తండ్రి కృష్ణ, కుమారుడు దుర్గాప్రసాద్‌ మృతి.
  • అనంతపురం: అగలి మండలం నరసంభూదిలో భూవివాదం. పరస్పరం కత్తితో దాడి చేసుకునేందుకు అన్నదమ్ముల యత్నం. అడ్డుకునేందుకు యత్నించిన బీజేపీ నేత చంద్రశేఖర్‌కు గాయాలు. హిందూపురం ఆస్పత్రికి తరలింపు.
  • రంగారెడ్డి: తక్కుగూడ దగ్గర రోడ్డు ప్రమాదం. డివైడర్‌ను ఢీకొన్న మార్బుల్‌ లోడ్‌తో వెళ్తున్న లారీ. ఒకరు మృతి, ముగ్గురు కార్మికులకు తీవ్రగాయాలు. ఇద్దరి పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు. బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతోనే డివైడర్‌ను ఢీకొన్న లారీ.
  • పార్టీ మారతారన్న వార్తలపై స్పందించిన మంత్రి ఈటల. నేను పార్టీ మారను-మంత్రి ఈటల. గాలి వార్తలపై నేను స్పందించను. చెప్పే వాళ్లు ఎన్నైనా చెప్తారు-మంత్రి ఈటల.
  • సుజనాచౌదరి వ్యాఖ్యలకు మంత్రి మోపిదేవి కౌంటర్‌. గోడ దూకే ఎంపీలెవరూ వైసీపీలో లేరు. జగన్‌పై ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంపూర్ణ విశ్వాసం ఉంది. తిరుమలను ఆర్ధిక వనరుగా భావించే ఆలోచన ప్రభుత్వానికి లేదు -మంత్రి మోపిదేవి వెంకటరమణ.

బిగ్ బాస్: ఫ్రెండ్స్ మధ్య లొల్లి.. శ్రీముఖి ఫుల్ ఖుషీ!

War Between Varun Sandesh And Rahul Sipligunj, బిగ్ బాస్: ఫ్రెండ్స్ మధ్య లొల్లి.. శ్రీముఖి ఫుల్ ఖుషీ!

పదో వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా హౌస్‌మేట్స్ మధ్య దూరం పెరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే శ్రీముఖి తాను ఒంటరినని ఫీల్ అవుతూ టాస్కులకు దూరంగా ఉంటోంది. అటు పునర్నవి రవికృష్ణపై వీరలెవల్లో సీరియస్ కావడం గమనార్హం. వాడో పెద్ద వెధవ అంటూ తిట్టిపోసింది. ఇలా ఇంటి సభ్యులందరూ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ గుర్రుగా ఉండటంతో బిగ్ బాస్ వారందరికి ఫన్నీ టాస్క్ ఇచ్చాడు. ఇందులో అత్యుత్తమ పెర్ఫార్మన్స్ ఇచ్చినవారు కెప్టెన్సీ టాస్క్‌కు అర్హులని ప్రకటించాడు.

ఇక ఈ టాస్క్ మొదట సరదాగా సాగినా.. మధ్యకు వచ్చేసరికి కంటెస్టెంట్ల మధ్య వైరం మొదలైంది. ఈసారి బెస్ట్ ఫ్రెండ్స్ అయిన వరుణ్ సందేశ్- రాహుల్ సిప్లిగంజ్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఏంటి? కొడతావా.. అంటూ వరుణ్‌ సీరియస్‌ అవగా రాహుల్‌ కూడా తన నోటికి పని చెప్పాడు. ఇక వీరిద్దరిని ఆపడానికి వితిక బాగా ప్రయత్నించింది. అయితే ప్రోమోలో కొండంతగా కనిపించే ఈ విషయం ఎపిసోడ్‌లోకి వచ్చేసరికి గోరంత ఉంటుందని ప్రేక్షకులకు ఇప్పటికే అర్ధం చేసుకున్నారు. మరి అసలు విషయం ఏంటో తెలియాలంటే కొద్దిగంటలు ఆగాల్సిందే.