నా భార్యనే తిడతావా..మహేష్‌కు వరుణ్ వార్నింగ్.. బిగ్ బాస్‌లో వార్!

Bigg Boss Season 3 Telugu Latest Episode Highlights, నా భార్యనే తిడతావా..మహేష్‌కు వరుణ్ వార్నింగ్.. బిగ్ బాస్‌లో వార్!

‘బిగ్ బాస్’ సీజన్ 3 మొదలై నాలుగు రోజులు కాకముందే హౌస్‌లో కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు మాటల యుద్ధం, గొడవలు, వాగ్వాదం చేసుకోవడం మొదలు పెట్టేశారు. బాబా భాస్కర్, జాఫర్, అలీ.. ఇంకో ముగ్గురు మినహా మిగిలిన వారందరూ డిష్యుం…డిష్యుం వరకు వెళ్లిపోయారు.

అటు బిగ్ బాస్ కూడా కంటెస్టెంట్ల మధ్య గొడవలు జరిగే టాస్క్‌లు ఇవ్వడం గమనార్హం. మొదటి రోజే మోనిటర్ హేమ, ఇతర ఇంటి సభ్యుల మధ్య గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. అలాగే నిన్నటి ఎపిసోడ్‌లో పునర్వి.. ‘నా చపాతిని ఎవరో తినేశారు..’ అంటూ గొడవకు దిగగా.. సోషల్ మీడియాలో దీనిపై కామెడీ మేమెస్ కూడా వైరల్ అయ్యాయి. అటు మహేష్ విట్టాను.. రవికృష్ణ కర్రోడా అని అనగా..  నువ్వు చదువుకున్నవాడివేనా అంటూ మహేష్ ఫైర్ అయ్యాడు.

ఇక ఎపిసోడ్ చివరిలో వరుణ్ సందేశ్ భార్య వితికతో మహేష్ అమర్యాదగా మాట్లాడగా.. వరుణ్ సీన్‌లోకి ప్రవేశించి ‘నా భార్యకు రెస్పక్ట్‌ ఇచ్చి మాట్లాడు’ అని వార్నింగ్ ఇచ్చాడు. ‘ఏంటి వేలు చూపిస్తున్నావ్‌’ అంటూ మహేష్‌ అనడంతో.. కొడతావా? ‘సిగ్గులేనోడా’ అంటూ వరుణ్‌ సందేశ్‌ .. మహేష్‌ వైపు వెళ్లాడు. మిగతా సభ్యులు తలదూర్చి.. వరుణ్‌ను కూల్ చేశారు. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ అంతా గొడవలతోనే జరిగిందని చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *