Breaking News
  • మహబూబ్‌నగర్‌లో టెండర్‌ ఓటు నమోదు. 41వ వార్డులో 198వ పోలింగ్‌ కేంద్రంలో టెండర్‌ ఓటు నమోదు. ఘటనపై జిల్లా ఎన్నికల అధికారుల ఆగ్రహం. ఐదుగురు ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు. రీపోలింగ్‌ నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి ఆదేశం.
  • ల్యాండ్‌ పూలింగ్‌ సమయంలో చంద్రబాబు అనుచరులు భూములు కొన్నారు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి-అంబటి. చట్టప్రకారం వాళ్లమీద యాక్షన్‌ తీసుకుంటాం-అంబటి. లోకేష్‌, చంద్రబాబు తాబేదారులు భూములు కొన్నారు-అంబటి.
  • కడప: ప్రొద్దుటూరులో ముగ్గురు క్రికెట్‌ బుకీల అరెస్ట్‌. రూ.2,68 లక్షలు స్వాధీనం.
  • ఏపీ హైకోర్టులో ఉత్కంఠ. సీఆర్‌డీఏ రద్దు, రాజధాని తరలింపు పిటిషన్ల కీలక విచారణ. వాదోపవాదాలు తెలుసుకోవటం కోసం వచ్చిన.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ ఎంపీ కేశినేని నాని. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించనున్న.. మాజీ అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహిత్గి.
  • ఎవరైనా చట్టాలకు లోబడే పనిచేయాలి. మండలిలో జరిగేది ప్రజలకు తెలియకూడదనే ప్రసారాలు నిలిపేశారు. మండలిలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా చట్టం ప్రకారమే నడవాలి. మండలి చైర్మన్‌కు అధికార పార్టీ నేతలు నరకం చూపించారు. బిల్లును హడావుడిగా ఆమోదించుకోవాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు. బెయిల్‌పై ఉన్న విజయసాయిరెడ్డికి కౌన్సిల్‌లో ఏం పని. -ఎమ్మెల్సీలు అశోక్‌బాబు, దీపక్‌, బచ్చులఅర్జునుడు, సత్యనారాయణరాజు.

శివాత్మికతో సిప్లిగంజ్.. కేరాఫ్ ‘రంగమార్తాండ’

Bigg Boss 3 Winner Rahul Sipligunj Grabs A Movie Chance, శివాత్మికతో సిప్లిగంజ్.. కేరాఫ్ ‘రంగమార్తాండ’

బిగ్ బాస్ తెలుగు విన్నర్‌గా నిలిచి రాహుల్ సిప్లిగంజ్ మంచి ప్రాచూర్యం తెచ్చుకున్నాడు. అంతకుముందు మనోడు చాలా మంచి పాటలు పాడినా కూడా పెద్దగా ఫేమ్ రాలేదు. బిగ్ బాస్ హౌజ్‌లో రాహుల్ బిహేవియర్‌కు, పునర్నవితో నడిపిన లవ్ ట్రాక్..అందరూ కనెక్టయ్యారు.

బయటకు వచ్చాక ఈ సింగర్ తెగ బిజీ అయ్యాడు.  అలవైకుంఠపురం, 90 ఎంఎల్ చిత్రాల్లో మంచి పాటలు పాడాడు. పలు టీవీ షోస్‌లో గెస్ట్‌గా కూడా అలరిస్తున్నాడు. ఈలోపులోనే మనోడికి  క్రేజీ ఆఫర్ వచ్చింది. టాలీవుడ్ క్రియేటీవ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న ‘రంగమార్తండ’  సినిమాలో నటించే ఛాన్స్ పట్టేశాడు రాహుల్ సిప్లిగంజ్. కృష్ణవంశీ సినిమా అంటే అందులో ప్రతి పాత్రకు చాలా ప్రముఖ్యత ఉంది. ఈ మూవీలో రాహుల్‌కి దక్కిన రోల్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉన్నదిగా తెలుస్తోంది. మరాఠి సినిమా ‘నటసామ్రాట్‌’ రీమేక్‌‌గా రంగమార్తాండ తెరకెక్కుతుంది. ప్రకాశ్ రాజ్, రమ్య ‌కృష్ణ బ్రహ్మనందంలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇక రాహుల్, ఎవరికి జోడిగా నటించబోతున్నాడో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం.  సినిమాలో మరో కీ రోల్ పోషిస్తోన్న జీవితా రాజశేఖర్ కూతురు శివాత్మికతో స్కీన్ షేర్ చేసుకోబోతున్నాడట ఈ క్రేజీ సింగర్. వీరిద్దరి మధ్య ఇప్పుటికే కొన్ని సీన్లు తెరకెక్కించట్టు తెలుస్తోంది. డైరెక్టర్ క్రిష్ణవంశీతో దిగిన ఫొటోని షేర్ చేసిన రాహుల్.. ఆయన దర్శకత్వంలో పనిచేయడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. ఇక బిగ్ బాస్‌ హౌజ్‌లో రాహుల్‌తో పోటీ పడిన  అలీ రెజా కూడా ‘రంగమార్తాండ’ లో నటిస్తున్నాడు.