Breaking News
  • అమరావతి: హైకోర్టును ఆశ్రయుంచిన ఆన్ -ఎయిడెడ్ స్కూల్ యాజమాన్యం. ప్రభుత్వం జారీ చేసిన 155 మెమోను సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్ పై విచారణ.. 155 మెమోను సస్పెండ్ చేయాలని కోరుతూ న్యాయవాది వాదనలు.. ప్రవేట్ స్కూల్లోని విద్యార్థుల డేటాను యాజమాన్యానికి తెలియ కుండా తొలగిస్తున్నారన్న న్యాయవాది.. పూర్తి వివరాలతో కౌoటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం.. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా..
  • హేమంత్ హత్య కేసు: ఈ కేసులో 17 మందిని అరెస్ట్ చేసాము. నిందితులు లక్ష్మ రెడ్డి,యుగేంద్రర్ రెడ్డి ని 6 రోజులపాటు కస్టడీకి అనుమతించిన కోర్టు. ఈ రోజు నిందితులను కస్టడీకి తీసుకుంటాం.
  • కరోనా వారియర్స్‌: తూ.గో: కరోనాను జయించిన ఎస్పీ అద్నన్‌ నయీం అస్మీ, ఏఎస్పీ కరణం కుమార్‌. విధుల్లో చేరేందుకు వచ్చిన వీరిపై సిబ్బంది పూలవర్షం . ఘనస్వాగతం పలికిన తోటి పోలీసులు.
  • ఉప ఎన్నికలకు పచ్చజెండా : ఢిల్లీ: కర్నాటకలో ఉప ఎన్నికలకు ఈసీ గ్రీన్‌సిగ్నల్‌. 2 కౌన్సిల్‌, 2 ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ . అక్టోబర్‌ 28న పోలింగ్‌, నవంబర్‌ 2న కౌంటింగ్‌ . గత జూన్‌ 30న ఖాళీ అయిన నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు .
  • విశాఖ: కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ వామపక్షాల నిరసన దీక్ష, పాల్గొన్న సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, వ్యవసాయాన్ని దెబ్బతీసేందుకే మోదీ చట్టాన్ని తీసుకొచ్చారని నారాయణ విమర్శలు.
  • ప్రచారంలో వాస్తవంలేదు . ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా అచ్చెన్నాయుడి పేరును లోకేష్‌ వ్యతిరేకిస్తున్నా ప్రచారంలో నిజంలేదు. అవి కేవలం సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే-టీడీపీ వర్గాలు .
  • బతుకమ్మ చీరల ప్రదర్శన : హైదరాబాద్‌: హరితప్లాజాలో బతుకమ్మ చీరల ప్రదర్శన. ప్రదర్శనను తిలకిస్తున్న మంత్రులు కేటీఆర్‌, సబిత ఇంద్రారెడ్డి, సత్యవతిరాథోడ్‌ . మరికాసేపట్లో బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభం .
  • వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ – సన్నద్దత, రబీ పంటల సాగుపై ప్రణాళిక, వ్యవసాయ సలహా కమిటీల సమావేశాల నిర్వహణపై సీఎం. ఖరీఫ్‌ పంట చేతికొస్తుంది, అక్టోబర్‌ 15 నుంచి ధ్యాసపెట్టాలి. ఆర్‌బీకేల ద్వారా మన ప్రొక్యూర్‌మెంట్‌ మరింత ఎఫెక్టివ్‌గా పనిచేయాలి. ఈ క్రాపింగ్‌ ప్రతీ పంటకు పూర్తి చేయాలి. ప్రతీ రైతు వివరాలు ఈ క్రాపింగ్‌లో పక్కాగా ఉండాలి, సోషల్‌ ఆడిట్‌ చేయాలి, మిస్‌ అయితే వెంటనే నమోదుచేయాలి. ఫామ్‌గేట్‌ అనేది ప్రతీ పంటకూ చేయాలి. కూపన్లు ఇచ్చి ఫలానా రోజు ప్రొక్యూర్‌ చేస్తామని చెప్పాలి. ఎక్కడా కూడా మ్యాన్యువల్‌ సర్టిఫికెట్‌ ఉండకూడదు, ఈ క్రాపింగ్‌ తప్పనిసరిగా జరగాలి.

బిగ్ బాస్ 4: ఒక లైలా.. ఇద్దరు మజ్నుల ప్రేమకథ.. బట్ నో లవ్!

'లవ్ ట్రైయాంగిల్' అంటూ అభిజిత్, అఖిల్ సార్దిక్, మోనాల్ గజ్జర్ మధ్య వచ్చిన ఓ ప్రోమో కూడా సేమ్ ఈ కోవకు చెందింది.

Bigg Boss 4, బిగ్ బాస్ 4: ఒక లైలా.. ఇద్దరు మజ్నుల ప్రేమకథ.. బట్ నో లవ్!

Bigg Boss 4: ఏదో ఉందని జనాలు ఊహించుకోవాలి.. కానీ అక్కడ ఏం ఉండదు.. ఇది బిగ్ బాస్ ప్రోమోల లెక్క.. అరచేతిలో వైకుంఠం చూపించడం అంటే ఇదే.. ఈ సీజన్ మాత్రమే కాదు, గత సీజన్లలో కూడా బిగ్ బాస్ ప్రోమోలు ఇలాగే ప్రేక్షకుల్లో ఒక హైప్‌ను తీసుకొచ్చాయి. కానీ చివరికి ఎపిసోడ్ చూసి అందరూ నిరాశచెందారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.! తాజాగా ‘లవ్ ట్రైయాంగిల్’ అంటూ అభిజిత్, అఖిల్ సార్దిక్, మోనాల్ గజ్జర్ మధ్య వచ్చిన ఓ ప్రోమో కూడా సేమ్ ఈ కోవకు చెందింది. నిజానికి ఆ ప్రోమోలో ఉన్నట్లు ‘లవ్ ట్రైయాంగిల్’ ఏం లేదనే చెప్పాలి.

నిన్నటి ఎపిసోడ్‌లో మోనాల్‌ని అర్థరాత్రి పిలిచి నీతో 5 నిమిషాలు మాట్లాడాలని చెప్పిన అభిజిత్.. ‘నా మీద నీకు డౌట్ ఉందా..? నన్ను పూర్తిగా నమ్ముతున్నావా?’ అంటూ అడుగుతాడు.  దానికి మోనాల్ స్పందిస్తూ.. ‘నేను నీతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నా. కానీ నీకు నాతో కంటే ప్రపంచం అంతటితో మాట్లాడడానికి టైం ఉంటుందని’ చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత మార్నింగ్ వీళ్లిద్దరిని ఒక దగ్గర చేర్చి.. కెప్టెన్ లాస్య సంధి కుదురుస్తుంది.

అలాగే అటు అఖిల్, మోనాల్ మధ్య కూడా ఏదో చిన్న విషయంలో గొడవ జరుగుతుంది. అక్కడ నుంచి ఏడుస్తూ మోనాల్ వెళ్లిపోగా.. సముదాయించడానికి అఖిల్ చాలావరకు ప్రయత్నిస్తాడు. ఎక్కడా ఛాన్స్ దొరకదు. కానీ చివరికి ఒక సందర్భంలో మాట్లాడటానికి అఖిల్.. మోనాల్‌ను పిలవగా.. మోనాల్‌ నవ్వుతూ అఖిల్ వద్దకు వెళుతుంది. ‘ఎదవ ఓవరాక్షన్ చేయకు. మూసుకుని నడువు. నువ్వు అందరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. అందరి గురించి నువ్వు ఎందుకు పట్టించుకుంటున్నావు. ఏం తెలియదా..? అంటూ కొంచెం కఠువుగా మాట్లాడతాడు. దానికి మోనాల్ సాఫ్ట్‌గా మాట్లాడమని చెబితే.. ప్రతీసారి ప్రేమగా రాదు.. కొన్నిసార్లు ఇలా కూడా తీసుకోవాలి అని చెబుతాడు. అంతేకాదు.. నువ్వు నన్ను ఇగ్నోర్ చేస్తుంటే నేను తీసుకోలేదా?’ అని అఖిల్ రివర్స్ అడుగుతాడు. చివరికి వీళ్లిద్దరి మధ్య గొడవ సద్దుమణుగుతుంది. ఆ తర్వాత మోనాల్.. ”నాకు అభితో ఏం లేదు. నీతో ఏం లేదు. కానీ నీతో టైమ్‌ స్పెండ్ చేయడం ఇష్టం” అని తన మనసులో ఉన్న ఫీలింగ్ చెబుతుంది.

ఇదంతా ఒక ఎత్తయితే.. బెడ్ రూమ్‌లో అఖిల్, అభిజిత్‌లు.. ఇదే విషయంపై డిస్కస్ చేసుకుంటారు. ‘నాకు ఒక క్లారిటీ ఉంది బ్రో. హౌస్‌లోకి ఎందుకు వచ్చాం గుర్తుపెట్టుకోవాలి. ఎవర్ని ఇంప్రెస్ చేయడానికి రాలేదు. ఒకసారి ట్రై చేయాలి.. కనెక్ట్ అయితే ఓకే.. లేదంటే లీవ్ ఇట్. ఎవరితో అయితే కలుస్తామో వాళ్ళతోనే మింగిల్ అవ్వాలి’ అని అభిజిత్ అంటాడు. దానికి అఖిల్ కూడా ‘నువ్వు కరెక్ట్ బ్రో’ అని చెబుతాడు. ఇప్పటిదాకా అయితే వీరిమధ్య సమ్‌ధింగ్.. సమ్‌ధింగ్ లేదు గానీ.. మున్ముందు సంగతి మాత్రం చెప్పలేం. కాగా, ఈ వారం నామినేట్స్‌లో గంగవ్వ, నోయల్, మోనాల్ గజ్జర్, సొహైల్, అమ్మ రాజశేఖర్, కరాటే కళ్యాణి, సాయి కుమార్,‌ దేత్తడి హారిక, అభిజిత్‌లు ఎలిమినేషన్స్‌కు నామినేట్ అయ్యారు. దీనితో బిగ్ బాస్‌లో రెండో వారం నుంచి కాస్త మజా మొదలైందని చెప్పాలి.

Also Read: బిగ్ బాస్ 4: ఈ సీజన్‌లో ఆమెదే భారీ రెమ్యునరేషన్

Related Tags