Bigg Boss 4: నోయల్‌కి సూచన.. కరాటే కళ్యాణిపై ఫైర్‌

తెలుగు బుల్లితెరపై బిగ్‌బాస్ నాలుగో సీజన్‌ ప్రారంభమై ఏడు రోజులు అయ్యింది. మొదటి ఆరు రోజులు ఈ షో సోసోగానే సాగినప్పటికీ

Bigg Boss 4: నోయల్‌కి సూచన.. కరాటే కళ్యాణిపై ఫైర్‌
Follow us

| Edited By:

Updated on: Sep 13, 2020 | 9:42 AM

Bigg Boss 4 Telugu: తెలుగు బుల్లితెరపై బిగ్‌బాస్ నాలుగో సీజన్‌ ప్రారంభమై ఏడు రోజులు అయ్యింది. మొదటి ఆరు రోజులు ఈ షో సోసోగానే సాగినప్పటికీ.. శనివారం హోస్ట్‌ నాగార్జున ఎంట్రీతో కాస్త ఆసక్తికరంగా మారింది. ఈ ఎపిసోడ్‌లో 16 మంది కంటెస్టెంట్‌లను పేరు పేరునా పలకరించిన నాగార్జున.. పలువురికి క్లాస్‌ కూడా పీకారు. నైబర్ హౌజ్‌తో నోయల్ మాట్లాడిన తీరు బావుందని.. అయితే అతడికి ఓవర్ థింకింగ్ ఎక్కువగా ఉందని అన్నారు. ఆ లక్షణంతోనే తన మీద ఎక్కువగా కట్టప్ప స్టాంపులు వేసుకున్నాడని, అది కాస్త తగ్గించుకుంటే కింగ్ అయిపోతాడని నాగార్జున ఎంకరేజ్ చేశారు. ఇక నోయల్‌కి ఓవర్ థింకింగ్‌ ఎక్కువ అన్న విషయానికి పలువురు కంటెస్టెంట్‌లు అవునంటూ చేతులు ఎత్తడం గమనర్హం. ఆ తరువాత సోహైల్‌ మీద అరియానాను కూర్చోబెట్టి బస్కీలు తీయించారు నాగార్జున.

ఇక అఖిల్‌, గంగవ్వను చూసుకొనే తీరు చాలా బావుందని నాగార్జున కొనియాడారు. కానీ అఖిల్‌ కన్నీళ్లు పెట్టుకుంటే బాలేదని తెలిపారు. ఏమైనా అఖిల్‌కి చెమటలు పడితే చూసుకునే వాళ్లు ఉన్నారంటూ మోనాల్‌ని ఉద్దేశించి మాట్లాడారు నాగార్జున. మరోవైపు ప్రతిదానికి ఎమోషనల్ అవుతున్న మోనాల్ గుజ్జార్‌పై నాగార్జున సెటైర్లు వేశారు. మోనాల్ ఏడుపు నర్మదా నది లాంటిదని, దానికి డ్యామ్ వేయాలని అన్నారు. ఇక పరిశుభ్రత దగ్గర మోనాల్‌ కోపం తగ్గించుకోవాలని, వడ్డించేటప్పుడు ఎదుటివారిపై కోప్పడకూడదని నాగార్జున సూచించారు. ఇక ఈ వారం నేర్చుకున్న తెలుగు పదాల గురించి అడిగిన నాగార్జున, బిగ్‌బాస్ అయ్యే లోపు కచ్చితంగా తెలుగు నేర్చుకోవాలని అన్నారు.

ఇక యాంకర్ లాస్య గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తోందని, అభిజిత్ కోపం తగ్గించుకోవాలని నాగార్జున అన్నారు. ఇక దేత్తడి హారిక, అభిజిత్‌ ఒకరినొకరు కనెక్ట్ అయ్యామని చెప్పారు. ఇదంతా అయిన తరువాత ఈ హౌజ్‌లో కట్టప్ప ఎవరో చెప్తానని కాస్త బ్రేక్ ఇచ్చారు నాగార్జున. ఈ క్రమంలో కట్టప్ప ఎవరో చెప్పండి సార్ అంటూ నోయల్ ఆధ్వర్యంలో ర్యాప్ సాంగ్‌ని పాడారు హౌజ్‌మేట్స్‌. ఆ ర్యాప్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక పరిశుభ్రత గురించి మోనాల్‌ అడగడంపై అమ్మ రాజశేఖర్‌ అరవడాన్ని నాగార్జున ప్రశ్నించారు. ఆ తప్పును సరిదిద్దుకుంటానని రాజశేఖర్ హామీ ఇచ్చారు. ఇక హౌజ్‌మేట్స్‌ అందరిపై సూర్య కిరణ్ అరస్తూ ఉండటంపై ప్రశ్నించిన నాగార్జున.. అరిస్తే నీ గొంతే పోతుందంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చారు.

ఇక హౌజ్‌లో అందరికంటే కరాటే కళ్యాణిపై ఎక్కువగా మండిపడ్డారు నాగార్జున. ‘కరాటే నీ ఇంటి పేరా అమ్మా.. లేకపోతే నీ తీరా’ అంటూ స్టార్ట్ చేసిన నాగార్జున.. ‘‘మిమ్మల్ని ట్రాన్స్‌లేట్ చేయమని మోనాల్ అడిగితే చెప్పింది చెప్పినట్టు చెప్పాలి తప్ప మధ్యలో కల్పించి చెప్పడం ఏంటని ప్రశ్నించారు. అలా చెప్పడం వల్ల అపార్థాలు వస్తాయని.. అక్కడిది ఇక్కడ.. అక్కడిది ఇక్కడ చెప్పడం కరెక్ట్ కాదని నాగార్జున అన్నారు. ఎక్కువగా ఆలోచిస్తూ అనవసరంగా ఫీలవుతున్నావని, వేరే వాళ్లు మాట్లాడితే మాట్లాడనివ్వవని, వాళ్ల మీద ఎక్కేస్తావని క్లాస్ పీకారు.

ఇక మొదటి ఎలిమినేషన్‌లో మొత్తం ఏడుగురు నామినేట్ కాగా.. వారిలో అభిజిత్‌, జోర్దార్ సుజాత, గంగవ్వ సేఫ్ అయ్యారు. మిగిలిన నలుగురిలో ఎలిమినేట్ అయ్యే ఒక్కరి పేరు ఇవాళ చెబుతానంటూ సస్పెన్స్ మెయింటెన్‌ చేశారు నాగార్జున. ఇదిలా ఉంటే కట్టప్ప ఎవరు అన్న క్యూరియాసిటీని బిగ్‌బాస్‌ క్రియేట్ చేయగా.. చివరికి ఇంట్లో కట్టప్పే లేరని చెప్పాడు. ఈ పోటీలో ఎక్కువగా ఓట్లు సాధించి కట్టప్పగా ఎన్నికైన లాస్యను తొలి హౌజ్‌ కెప్టెన్‌గా చేశారు నాగార్జున. ఆమె కెప్టెన్ అవ్వడాన్ని హౌజ్‌మేట్స్ కూడా స్వాగతించారు.

Read More:

మళ్లీ ఎయిమ్స్‌లో చేరిన కేంద్ర మంత్రి అమిత్‌ షా

ప్రైవేట్ బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేశారో.. రవాణాశాఖ హెచ్చరిక

తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..