బిగ్ బాస్ 4 ఓటింగ్: అగ్రస్థానంలో అరియానా.. రెండో స్థానంలో అభిజిత్.? అసలు కారణమిదేనా.!

మరో నాలుగు రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ ఎవరన్నది తేలిపోతుంది. ఈ క్రమంలోనే ఏ కంటెస్టెంట్ విజేతగా నిలుస్తారన్న దానిపై పలు సోషల్ మీడియా..

బిగ్ బాస్ 4 ఓటింగ్: అగ్రస్థానంలో అరియానా.. రెండో స్థానంలో అభిజిత్.? అసలు కారణమిదేనా.!
Ravi Kiran

|

Dec 16, 2020 | 10:50 PM

Bigg Boss 4: మరో నాలుగు రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ ఎవరన్నది తేలిపోతుంది. ఈ క్రమంలోనే ఏ కంటెస్టెంట్ విజేతగా నిలుస్తారన్న దానిపై పలు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో అనధికారిక పోల్స్ నిర్వహిస్తున్నారు. ఇక ఈ పోల్స్‌లో ఎక్కువ శాతం ఓట్లు అభిజిత్‌కే పడుతున్నాయి. దాదాపు 50 శాతం ఓటింగ్ అతని ఖాతాలో పడుతోందని చెప్పొచ్చు. ఆ తర్వాత టామ్ అండ్ జెర్రీలు సోహైల్, అరియానా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఆ తర్వాత అఖిల్, హారిక వరుసగా ఉన్నారు.

ఇదిలా ఉంటే తాజాగా అరియానా రెండు స్థానాలు ఎగబాకి అగ్రస్థానంలో నిలిచినట్లు పలు పోల్స్ చూపిస్తున్నాయి. అసలు ఇది ఎంతవరకు నిజమో తెలియదు గానీ.. ఇప్పటిదాకా 50 శాతం ఓటింగ్‌తో దూసుకుపోతున్న అభిజిత్‌ రెండో స్థానంలో.. అరియానా మొదటి స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. చివరి టాస్క్‌లో అమ్మాయిలను టైటిల్‌కు అనర్హులు అని చెప్పడం.. అంతేకాకుండా అందరూ అరియానాను టార్గెట్ చేయడం వంటి అంశాలు ఇందుకు కారణం అని కొందరి భావన. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. అయితే అభి ఫ్యాన్స్ మాత్రం ఇందుకు ఏమాత్రం ఛాన్స్ లేదని అంటున్నారు. మరికొందరు అయితే రోజురోజుకూ అనేక మార్పులు చోటు చేసుకునే ఈ ఓటింగ్ పోల్స్ నమ్మలేమని చెబుతున్నారు. ఏది ఏమైనా నెట్టింట్లో నడుస్తున్న టాక్ బట్టి.. అభిజిత్ బిగ్ బాస్ టైటిల్‌ను ఎగరేసుకుపోయే అవకాశం ఉందని తెలుస్తోంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu