Syed Sohel : కరీంనగర్, సింగరేణిపై సినిమా తీయాలని ఉంది… బిగ్‌బాస్ ఫేం సోహెల్…

‘‘పూర్వపు కరీంనగర్‌ జిల్లాకు చెందిన నాకు కరీంనగర్‌, సింగరేణి ప్రాంతాలపై సినిమా రూపొందించాలని ఉందని, అలాంటి అవకాశం వస్తే తప్పకుండా సద్వినియోగం చేసుకుంటా’’ అని బిగ్‌బాస్‌ ఫేం సోహెల్‌ తెలిపారు.

Syed Sohel : కరీంనగర్, సింగరేణిపై సినిమా తీయాలని ఉంది... బిగ్‌బాస్ ఫేం సోహెల్...
Follow us

| Edited By:

Updated on: Jan 03, 2021 | 5:53 AM

‘‘పూర్వపు కరీంనగర్‌ జిల్లాకు చెందిన నాకు కరీంనగర్‌, సింగరేణి ప్రాంతాలపై సినిమా రూపొందించాలని ఉందని, అలాంటి అవకాశం వస్తే తప్పకుండా సద్వినియోగం చేసుకుంటా’’ అని బిగ్‌బాస్‌ ఫేం సోహెల్‌ తెలిపారు. కరీంనగర్‌లోని ఒక హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్టార్‌ మా నిర్వహించిన బిగ్‌బాస్‌ షో వల్ల తల్లిదండ్రుల విలువ తెలిసిందని, ఆ షోలో తనకు అవకాశం లభించడం గొప్ప విషయం, జీవితంలో మరిచిపోలేనిదని పేర్కొన్నారు. తనకు ఓట్‌ వేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా కరీంనగర్‌, సింగరేణి ప్రాంత అభిమానులు, స్నేహితుల సహకారం ఎంతో ఉన్నదన్నారు. బిగ్‌బాస్‌ హౌస్‌లో 100 రోజులు ఉంటే, చివరి రోజు నాగార్జున, చిరంజీవి చెప్పిన మాటలు, ఇచ్చిన సహకారం తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని తెలిపారు. ఆర్‌ఎక్స్‌ సినిమా డైరెక్టర్‌ శ్రీనివాస్‌, మరో డైరెక్టర్‌ అప్పిరెడ్డి సినిమా మొదలవ్వబోతున్నదని, ఆ వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.

Also Read:

Bigg Boss Telugu : భారీ రేటింగ్‌‌‌‌‌‌‌తో దూసుకుపోయిన బిగ్ బాస్ షో.. నాలుగో సీజన్ టీఆర్ఫీ ఎంతంటే..

Monal Gajjar : ‘అల్లుడు అదుర్స్‌’లో మోనాల్ గజ్జర్ స్పెషల్ సాంగ్..రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?