Breaking News
  • అమరావతి: ప్రధానిమోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం జగన్ మోహన్ రెడ్డి. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించాల్సిన నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ లో ముందు మాట్లాడేందుకు అనుమతి ఇచ్చినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన సీఎం జగన్ మోహన్ రెడ్డి. కరోన నివారణకు కేంద్రం ఇస్తున్న అన్ని మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నాం. మోదీ నాయకత్వంలో కరోనను పటిష్టంగా ఎదుర్కొన్నాం.
  • భద్రాద్రి: పాల్వంచ అటవీప్రాంతంలో కూంబింగ్‌. తప్పించుకున్న మావోయిస్టులు. ఒక తుపాకీ, కిట్‌ బ్యాగులు, సోలార్‌లైట్‌ స్వాధీనం. మావోయిస్టుల కోసం కొనసాగుతున్న గాలింపు. జిల్లా ఎస్పీ సునీల్‌ దత్‌ నేతృత్వంలో కూంబింగ్‌.
  • టీవీ9 తో సిటీ ED వెంకటేశ్వర రావు. సిటీ బస్సుల కు సంబంధించి ఎలాంటి నిర్ణయం జరగలేదు. తక్కువ సంఖ్యలో బస్సులు నడుపుతామని వార్తలు వొస్తున్నాయి అందులో వాస్తవమ్ లేదు. సిటీ చివరలో 290 సర్వీసులను ఈరోజు నుండి నడుపుతున్నాం. సిటీ కి సంబంధించి చర్చ మాత్రమే జరుగుతుంది ఎలాంటి నిర్ణయం రాలేదు. మేము మాత్రం అన్ని డిపోలలో బస్సుల ను సిద్ధం చేసి ఉంచాం. కోవిడ్ నిబంధనలకు అనుకూలంగా ఏర్పాట్లు కూడా చేసాం. ప్రభుత్వ ఆదేశాల కోసం చూస్తున్నాం.
  • కృష్ణా జిల్లా : సీఎంఆర్ఎఫ్ నకిలీ చెక్కుల కేసులో దూకుడు పెంచిన ఏసీబీ. కృష్ణా జిల్లా విసన్నపేట, కొండపల్లి ఇండియాన్ బ్యాంకులలో ఏసీబీ సోదాలు. గోప్యంగా దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులు. 2020 జూన్ 29న హైమావతి, రమ్య శ్రీ అనే మహిళలకు సీఎంఆర్ఎఫ్ నుంచి ఆర్థిక సహాయం అందించిన సీఆర్ఎంఎఫ్ అధికారులు. అవే చెక్కులు ఫోర్జరీకి గురికావడంతో హైమావతి, రమ్యశ్రీ ని విచారించిన ఏసీబీ అధికారులు. ఇండియన్ బ్యాంక్ అధికారులను సైతం విచారించిన అధికారులు. చెక్ నెంబర్లు ఎలా దుండగులు సేకరించి ఫేక్ చెక్కులు ఎలా తయారు చేసారన్న అంశాలపై కూపీ గాలుగుతున్న ఏసీబీ.
  • ప.గో: భీమవరంలో చిట్టీల పేరిట మోసం. సుమారు 100 మంది నుంచి చిట్టీలు కట్టించుకున్న అమ్మాజీ. రూ.2 కోట్లు వసూలు చేసి పరారైన చిట్టీల వ్యాపారి అమ్మాజీ. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ని ఆశ్రయించిన బాధితులు. కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించిన ఎమ్మెల్యే.
  • ఇప్పటివరకు దేశంలో “కరోనా” వల్ల ముగ్గురు ఎమ్.పి లు, ఒక కేంద్ర మంత్రి మృతి. 1) బల్లి దుర్గా ప్రసాద్ ( AP) 2) హెచ్. వసంత్ కుమార్ ( TN) 3) అశోక్ గస్తీ ( Ktk) ——— 4) సురేష్ అంగాడీ ( KTK) ( కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి.
  • తిరుమల: తిరుమలకు చేరుకున్న కర్ణాటక సీఎం యడియూరప్ప. కర్ణాటక సీఎంకు స్వాగతం పలికిన టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, టీటీడీ అడిషనల్ ఈఓ ధర్మారెడ్డి. రేపు ఉదయం ఏపీ సీఎం జగన్ తో కలిసి శ్రీవారిని దర్శించుకోనున్న యడియూరప్ప. దర్శనానంతరం ఉదయం 7 గంటలకు నాదనీరాజనం వేదికపై సుందరకాండ పారాయణంలో పాల్గొననున్న ముఖ్యమంత్రులు. అనంతరం బ్యాటరీ వాహనం ద్వారా మాడవీధుల్లో ప్రయాణించి పడమర మాడవీధిలోని కర్ణాటక సత్రాల వద్దకు చేరుకోనున్న సీఎంలు. ఉదయం 8.10 గంటలకు కర్ణాటక సత్రాల నూతన సముదాయ నిర్మాణానికి భూమిపూజ చేయనున్న ముఖ్యమంత్రులు. పద్మావతి గెస్ట్ హౌస్ లో అల్పాహారం స్వీకరించి తిరుగు ప్రయాణమవ్వనున్న ముఖ్యమంత్రులు.

బిగ్ బాస్ 4: మరో వైల్డ్ కార్డు ఎంట్రీ.. ‘జోకర్’ అంటూ వస్తోన్న కమెడియన్.!

బిగ్ బాస్ హౌస్‌లో అసలు మజా మొదలైంది. మొదటి వారం సోసోగానే గడిచినా.. రెండో వారంలో మాత్రం టాస్కులు, పెర్ఫార్మన్స్‌లతో కంటెస్టెంట్లు దుమ్ముదులిపేశారు.
Bigg Boss 4 Telugu, బిగ్ బాస్ 4: మరో వైల్డ్ కార్డు ఎంట్రీ.. ‘జోకర్’ అంటూ వస్తోన్న కమెడియన్.!

బిగ్ బాస్ హౌస్‌లో అసలు మజా మొదలైంది. మొదటి వారం సోసోగానే గడిచినా.. రెండో వారంలో మాత్రం టాస్కులు, పెర్ఫార్మన్స్‌లతో కంటెస్టెంట్లు దుమ్ముదులిపేశారు. అంతేకాదు మోనాల్-అభిజిత్-అఖిల్ లవ్ స్టోరీ కూడా కొంచెం ఇంటరెస్టింగ్‌గానే సాగుతోంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ ఇచ్చిన ‘బీబీ టాలెంట్ షో’ టాస్క్ నిన్న కూడా కంటిన్యూ అయింది. దీనికి అరియానా యాంకర్‌గా ఉంటే.. లాస్య‌, నోయ‌ల్ జ‌డ్జిలుగా వ్యవహరించారు.

అమ్మ రాజశేఖర్ సోలో డాన్స్ పెర్ఫార్మన్స్, దేవి, క‌ళ్యాణి, అభిజిత్‌, అఖిల్‌ బ‌మ్‌చిక్ ఫ్యాన్‌కు ఇచ్చిన ప్రచారం ఆకట్టుకోగా.. “వానా వానా వెల్లువాయే” సాంగ్‌కు ఇస్మార్ట్ సోహైల్‌, మోనాల్ వేసిన స్టెప్‌లు హైలైట్‌గా నిలిచాయి. అటు మెహ‌బూబ్‌, హారికలు అయితే డాన్సులతో దుమ్మురేపి ‘స్టార్ ప‌ర్ఫార్మ‌ర్ ఆఫ్ ది షో’ అవార్డులు గెలుచుకున్నారు. ఆ తర్వాత గంగవ్వ పెర్ఫార్మన్స్, చివరిగా అందరి ఇంటి స‌భ్యులు క‌లిసి డ్యాన్స్ చేయడంతో ఈ కార్యక్రమం ముగిసింది.(Bigg Boss 4 Telugu)

కాగా, ఈ వారం బిగ్ బాస్ రెండో వైల్డ్ కార్డు ఎంట్రీని సిద్దం చేశాడు. ‘జోకర్ వెనుక జీవిత‌మే ఉందంటూ’ వస్తోన్న బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో.. కొత్త కంటెస్టెంట్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక అతను ఖచ్చితంగా ముక్కు అవినాష్ అని నెటిజన్లు భావిస్తున్నారు. మరి అతనెవరో ఈరోజు ఎపిసోడ్‌లో తేలిపోనుంది.

Also Read:

బిగ్ బాస్ 4: గంగవ్వను బయటికి పంపే ప్లాన్.. అందుకే టార్గెట్ చేస్తున్నారా.!

బిగ్ బాస్ 4: ఈ సీజన్‌లో ఆమెదే భారీ రెమ్యునరేషన్

బిగ్ బాస్ హౌస్‌లోకి రామ్‌చరణ్ హీరోయిన్..!

సచివాలయ పరీక్షలకు సర్వం సిద్ధం.. వారికి ఐసోలేషన్ రూంలో ఎగ్జామ్!

ఏపీ వాహనదారులకు అలెర్ట్.. లైట్ తీసుకుంటే ఇక అంతే!

Related Tags