హౌస్‌లో చాయ్‌పే చర్చా .. లవ్ యాంగిల్‌లో కపుల్!

Rahul Sipligunj And Punarnavi Bhupalam Love Track In Bigg Boss 3

‘బిగ్ బాస్’ సీజన్ 3‌లో ముద్దు ముద్దు మాటలతో.. అక్కడక్కడ కొంచెం గ్లామర్ టచ్ ఇస్తూ హాట్ బ్యూటీగా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్న పునర్నవి భూపాలంతో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ లవ్ గేమ్ స్టార్ట్ చేసినట్లు కనిపిస్తోంది. గత ఎపిసోడ్స్‌లో వీరిద్దరి మధ్య లవ్ అండ్ డేటింగ్ గురించి ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఆ తర్వాత నాగార్జున చేతిలో ఉన్న పండు బొమ్మ.. రాహుల్ డేటింగ్ చేస్తున్నాడని చెప్పడం.. హౌస్‌లో ఉన్న మిగిలిన కంటెస్టెంట్లు పునర్నవి పేరు చెప్పడం జరిగింది.

ఇది ఇలా ఉండగా మళ్ళీ రెండు రోజుల క్రితం ఎపిసోడ్‌లో రాహుల్ పునర్నవితో పులిహోర కలుపుతూ కనిపిస్తాడు. సేమ్ డేటింగ్ విషయంలోనే ఇద్దరి మధ్య సంభాషణ జరగడం అదీ కూడా అన్ టోల్డ్ స్టోరీస్‌లో చూపించారు. ఇలా పలుమార్లు ఇద్దరూ కూడా కెమెరాకు దొరికారు. సరిగ్గా ఇలాగే మరోసారి ఈ జంట ప్రేమ కబుర్లు చెప్పుకుంటూ.. టీను షేర్ చేసుకుంటూ కనిపించారు. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

Video Credits: HotStar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *