‘బిగ్‌బాస్’ పథకం.. శ్రీముఖిని విన్నర్ చేయడానికేనా..!

తెలుగు బుల్లితెరపై విజయవంతంగా కొనసాగుతోన్న ‘బిగ్‌బాస్’ మూడో సీజన్ ఈ వారం ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హౌస్‌లో ఐదుగురు ఉండగా.. ఈ సీజన్‌కు టైటిల్ విన్నర్‌గా ఎవరు నిలుస్తారు అన్న దానిపై చర్చ నడుస్తోంది. అయితే ఇప్పుడు ఈ రేసులో శ్రీముఖి ముందు వరుసలో నిలిచింది. ఇటీవల పోలైన ఓట్లలో శ్రీముఖి ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. దీంతో టైటిల్ విన్నర్‌గా కూడా ఆమెనే నిలిచే అవకాశం ఉందన్న చర్చ నడుస్తోంది. అంతేకాదు మొత్తంగా బిగ్ బాస్ […]

'బిగ్‌బాస్' పథకం.. శ్రీముఖిని విన్నర్ చేయడానికేనా..!
Follow us

| Edited By:

Updated on: Oct 30, 2019 | 3:44 PM

తెలుగు బుల్లితెరపై విజయవంతంగా కొనసాగుతోన్న ‘బిగ్‌బాస్’ మూడో సీజన్ ఈ వారం ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హౌస్‌లో ఐదుగురు ఉండగా.. ఈ సీజన్‌కు టైటిల్ విన్నర్‌గా ఎవరు నిలుస్తారు అన్న దానిపై చర్చ నడుస్తోంది. అయితే ఇప్పుడు ఈ రేసులో శ్రీముఖి ముందు వరుసలో నిలిచింది. ఇటీవల పోలైన ఓట్లలో శ్రీముఖి ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. దీంతో టైటిల్ విన్నర్‌గా కూడా ఆమెనే నిలిచే అవకాశం ఉందన్న చర్చ నడుస్తోంది. అంతేకాదు మొత్తంగా బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్‌గా శ్రీముఖిని చేసేందుకు తెరవెనుక వ్యూహాలు జరుగుతున్నాయని కూడా టాక్ నడుస్తోంది.

దానికి తోడు ఇటీవల శ్రీముఖి గెలిచిన కొన్ని టాస్క్‌లు ప్రత్యేకంగా ఆమె కోసమే డిజైన్ చేశారా..? అన్నట్లు ఉన్నాయి. ఈ విషయాన్ని నెటిజన్లు కూడా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు గతంలో హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన హిమజ, మహేష్ విట్టా, హేమలు కూడా ఇలాంటి విమర్శలే చేశారు. హిమజ అయితే ఏకంగా బిగ్ బాస్ డైరెక్టర్లే శ్రీముఖి డెరెక్షన్‌లో షో నడిపిస్తున్నారని ఆరోపణలు చేసింది. హేమ కూడా ఇదే విషయంపై తాజాగా స్పందిస్తూ.. హౌస్‌లో ఎవరు ఎన్నాళ్లు ఉండాలి. ముందే ఫిక్స్ అయ్యి వచ్చారని దాని ప్రకారం ఆట జరుగుతుందని, మొత్తం బిగ్ బాస్ ఆటని శ్రీముఖి ఆడిస్తుందని ఆమె ఆటలో కంటెస్టెంట్స్ బలి అవుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాదు శ్రీముఖిని విన్నర్‌ను చేసేందుకే ఆమెకు టఫ్ కాంపిటీషన్ ఇస్తున్న హిమజ లాంటి వాళ్లను ఎలిమినేట్ చేశారని అప్పట్లో విమర్శలు కూడా వినిపించాయి.

ఇక బిగ్‌బాస్ డైరక్టర్‌ అయిన అభిషేక్ ముఖర్జీ, శ్యామ్ ఇద్దరూ.. శ్రీముఖికి చాలా క్లోజ్. దీంతో వారు కూడా శ్రీముఖినే విన్నర్ కావాలని ఇదంతా చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రచారాలన్నింటిని శ్రీముఖి ఫ్యాన్స్ కొట్టిపారేస్తున్నారు. శ్రీముఖి మొదటి నుంచి జెన్యూన్‌గానే ఆటను ఆడుతుందని వారు అంటున్నారు. మరి శ్రీముఖిని విన్నర్ చేసేందుకే నిర్వాహకులు ప్లాన్ చేశారా..? రెండు సీజన్ల రికార్డును బ్రేక్ చేసి శ్రీముఖి టైటిల్‌ను గెలుచుకుంటుందా..? అసలు బిగ్‌బాస్ 3 సీజన్ విన్నర్ ఎవరు..? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం ఈ వారాంతంలోనే తేలనుంది.

Video: ధావన్‌ని చూడగానే మైమరిచిన రోహిత్.. అదిరిపోయే స్టెప్పులు
Video: ధావన్‌ని చూడగానే మైమరిచిన రోహిత్.. అదిరిపోయే స్టెప్పులు
పడి లేచిన కెరటానికి టీ20 ప్రపంచకప్‌లో బెర్త్ కన్ఫామా..
పడి లేచిన కెరటానికి టీ20 ప్రపంచకప్‌లో బెర్త్ కన్ఫామా..
నామినేషన్ వేళ అభ్యర్థుల మార్పు.? చివరి నిమిషంలో ఈ నిర్ణయం దేనికి
నామినేషన్ వేళ అభ్యర్థుల మార్పు.? చివరి నిమిషంలో ఈ నిర్ణయం దేనికి
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రోజంతా ల్యాప్‌టాప్‌ ముందే కూర్చుంటున్నారా..?మీ ఆయుష్షు తగ్గినట్టే
రోజంతా ల్యాప్‌టాప్‌ ముందే కూర్చుంటున్నారా..?మీ ఆయుష్షు తగ్గినట్టే
మాధవీ లత వర్సెస్ అసదుద్దీన్.. హైదరాబాద్‎లో హోరెత్తుతున్న ప్రచారం
మాధవీ లత వర్సెస్ అసదుద్దీన్.. హైదరాబాద్‎లో హోరెత్తుతున్న ప్రచారం
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!
ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా..
వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా..
LSG vs RCB: బెంగళూరుతో పోరుకు ముందు లక్నోకు మొదలైన 'బెంగ'..
LSG vs RCB: బెంగళూరుతో పోరుకు ముందు లక్నోకు మొదలైన 'బెంగ'..
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా