Breaking News
  • భారత్ లో కరోనా కల్లోలం. 8 లక్షల 78 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 878254. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 301609. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 553471. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 23174. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • భవిష్యవాణి లో స్వర్ణలత. భక్తులు 5వారాల పాటు శాఖ పోయాలి. పప్పు బెల్లాలతో ప్రతి గడప నుండి నాకు పూజ చేయాలి. నాకు ఈ ఏడు సంతోశమ్ లేదు. ఎవరు చేసుకుంది వారు అనుభవించాల్సిందే. నా ప్రజలని నేను కాపాడత.
  • తూర్పుగోదావరి జిల్లా : జగ్గంపేట నియోజకవర్గం కాపుసోదరులకు మాజీ మంత్రి ముద్రగడ బహిరంగ లేఖ. కాపు ఉద్యమం నుండి తప్పుకోవాలని నిర్ణయించు కొన్నా.. ముద్రగడ . ఇటీవల కొంతమంది సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ల నాపై దాడులు చేస్తున్నారు... ముద్రగడ . నన్ను కులద్రోహి గజదొంగ వంటి మాటలతో విమర్శిస్తున్నారు.. ముద్రగడ . నేను ఉద్యమం లో వసూలు చేసిననిధులు వారికి పంచలేదనా ఆ దాడులు... ముద్రగడ .
  • కరోనా వైరస్ నేపద్యంలో జైల్ లో ఉన్న ఖైదీలను విడుదల చేయాలని హైకోర్టు లో పిల్ . రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జైల్లో ఖైదీలను పెరోల్ పై విడుదల చేయాలంటూ పిల్ లో పేర్కొన్న పిటిషనర్ లింగయ్య . ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పెరోల్ పై విడుదల చేస్తున్నారని, తెలంగాణలో కూడా విడుదల చేసేలా . ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్న పిటిషనర్ . మరి కొద్ది సేపటిలో విచారణ చేయున్న హైకోర్టు.
  • గాంధీలో నాలుగో రోజు కొనసాగుతున్న నర్సుల సమ్మె. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చర్చలతో ఏకీభవించని నర్సులు. విధులు బహిష్కరించిన 200 మంది నర్సులు. ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా అవుట్ సోర్సింగ్ ద్వారా హెడ్ నర్స్ పదోన్నతి పై మండిపాటు.
  • బాలీవుడ్‌లో మరో విషాదం. ముంబై: బాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మోడల్, నటి, గాయని దివ్య చోక్సీ (29) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె ఆదివారం తుది శ్వాస విడిచారు. దివ్య అకాల మరణంపై పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.

బిగ్‌బాస్ 3: రాహుల్‌ కంటే ఆ ఇద్దరికే ఎక్కువ డబ్బులొచ్చాయా..!

two contestants got more amount than Rahul Sipligunj, బిగ్‌బాస్ 3: రాహుల్‌ కంటే ఆ ఇద్దరికే ఎక్కువ డబ్బులొచ్చాయా..!

తెలుగు బుల్లితెరపై సంచలనాలు సృష్టించిన బిగ్‌బాస్ మూడో సీజన్ ఇటీవలే ముగిసింది. ప్రేక్షకుల నుంచి ఎక్కువ ఓట్లు సాధించిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ సీజన్‌కు విన్నర్‌గా గెలవగా.. యాంకర్ శ్రీముఖి రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి విజేత రాహుల్‌కు రూ.50లక్షలతో పాటు ట్రోపీని అందించారు. ఇక మిగిలిన రెమ్యునరేషన్‌తో కలిపి రాహుల్‌కు బిగ్‌బాస్ నుంచి రూ.80వరకు ముట్టినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే విజేతలుగా నిలవనప్పటికీ.. ఈ సీజన్‌లో ఇద్దరికి మాత్రం రాహుల్ కంటే ఎక్కువ అమౌంట్ ముట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాహుల్‌తో పాటు ఫైనల్ వరకు ఉన్న వరుణ్ సందేశ్, శ్రీముఖిలకు అత్యధిక పారితోషికం అందినట్లు టాక్.

two contestants got more amount than Rahul Sipligunj, బిగ్‌బాస్ 3: రాహుల్‌ కంటే ఆ ఇద్దరికే ఎక్కువ డబ్బులొచ్చాయా..!

యాంకర్‌గా శ్రీముఖికి క్రేజ్ చాలా ఉంది. పలు ఛానెల్‌లలో ఆమె కొన్ని ప్రోగ్రామ్‌లకు హోస్ట్‌గా చేసేది. అలాగే సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రల్లో నటించేది. ఇక వాటన్నింటిని వదులుకొని వంద రోజులకు పైగా హౌస్‌లో ఉన్న శ్రీముఖికి రన్నరప్ అమౌంట్ రూ.15లక్షలు, డైలీ రెమ్యునరేషన్‌తో కలుపుకొని దాదాపు రూ.కోటి దాకా ముట్టినట్లు టాక్. అలాగే వరుణ్ సందేశ్‌కు కూడా ఎక్కువ డబ్బులు ముట్టినట్లు తెలుస్తోంది. తన భార్య వితికాతో కలిసి వరుణ్ ఈ సీజన్‌లో పాల్గొన్నాడు. భార్య అమౌంట్‌ను పక్కన పెడితే.. వరుణ్‌కు కూడా కోటి దాకా బిగ్‌బాస్ ద్వారా వచ్చినట్లు సమాచారం. మొత్తానికి విన్నర్‌లుగా నిలవనప్పటికీ.. ఈ ఇద్దరు విజేతకు వచ్చిన ప్రైజ్ మనీ కంటే ఎక్కువనే తమ ఖాతాలో వేసుకున్నారని ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇదే విధంగానే గత సీజన్‌లో కూడా విన్నర్ కౌశల్ కంటే రన్నరప్‌ గీతామాధురికే ఎక్కువ అమౌంట్ వచ్చినట్లు పుకార్లు వినిపించిన విషయం తెలిసిందే.

Related Tags