బిగ్‌బాస్ 3: రాహుల్ విజయం వెనుక ‘ఆ ముగ్గురు’ మహిళలు ఎవరంటే..!

పలు వివాదాల మధ్య ఈ ఏడాది జూన్ 21న ప్రారంభమైన బిగ్‌బాస్ మూడో సీజన్ తాజాగా ముగిసింది. 15మంది(ఇద్దరు వైల్డ్ కార్డు ఎంట్రీ) కంటెస్టెంట్‌లతో ప్రారంభమై.. 106 రోజుల పాటు జరిగిన ఈ షోలో సింగర్ రాహుల్ సింప్లిగంజ్ టైటిల్ విన్నర్‌గా నిలిచాడు. ప్రేక్షకుల నుంచి అత్యధిక ఓట్లు రాహుల్‌కే పడ్డాయి. ఆదివారం జరిగిన బిగ్‌బాస్ 3 గ్రాండ్ ఫినాలేలో హోస్ట్ నాగార్జున రాహుల్‌ను విన్నర్‌గా ప్రకటించగా.. మెగాస్టార్ చిరంజీవి అతడికి ట్రోఫీతో పాటు రూ.50లక్షల నగదు […]

బిగ్‌బాస్ 3: రాహుల్ విజయం వెనుక 'ఆ ముగ్గురు' మహిళలు ఎవరంటే..!
Follow us

| Edited By:

Updated on: Nov 04, 2019 | 4:50 PM

పలు వివాదాల మధ్య ఈ ఏడాది జూన్ 21న ప్రారంభమైన బిగ్‌బాస్ మూడో సీజన్ తాజాగా ముగిసింది. 15మంది(ఇద్దరు వైల్డ్ కార్డు ఎంట్రీ) కంటెస్టెంట్‌లతో ప్రారంభమై.. 106 రోజుల పాటు జరిగిన ఈ షోలో సింగర్ రాహుల్ సింప్లిగంజ్ టైటిల్ విన్నర్‌గా నిలిచాడు. ప్రేక్షకుల నుంచి అత్యధిక ఓట్లు రాహుల్‌కే పడ్డాయి. ఆదివారం జరిగిన బిగ్‌బాస్ 3 గ్రాండ్ ఫినాలేలో హోస్ట్ నాగార్జున రాహుల్‌ను విన్నర్‌గా ప్రకటించగా.. మెగాస్టార్ చిరంజీవి అతడికి ట్రోఫీతో పాటు రూ.50లక్షల నగదు బహుమతిని అందజేశారు. ఇక షో మొదటి నుంచి అందరికీ గట్టి పోటీ ఇచ్చిన బుల్లితెర రాములమ్మ శ్రీముఖి.. రన్నరప్‌గా నిలిచింది. దీంతో బయట రాహుల్ అభిమానులు సంబరాలు జరుపుకున్నారు.

అయితే హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి రాహుల్  టాస్క్‌ల విషయంలో అంత ఉత్సాహంగా లేకుండా.. బద్ధకరత్న అని పేరు తెచ్చుకున్నాడు. దీంతో నెటిజన్లు కూడా రాహుల్‌పై పలు రకాల కామెంట్లు వేశారు. ఎప్పుడు తిని పడుకోవడం తప్ప రాహుల్‌ టాస్క్‌లు ఆడలేదు. ఏదో పునర్నవి హౌస్‌లో ఉంది కాబట్టి.. అతడిని ఇంతవరకు హౌస్‌లో ఉంచారు. లేదంటే ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాల్సింది. పునర్నవితో పులిహోర కలపడానికే రాహుల్‌ బిగ్‌బాస్ హౌస్‌కు వచ్చాడు. అతడికి మహిళలంటే అసలు గౌరవం లేదు అంటూ రకరకాల కామెంట్లు వినిపించాయి. దీంతో ఒక్కసారి, రెండు సార్లు కాదు.. ఏకంగా 14 వారాల్లో 11 సార్లు నామినేషన్‌లోకి వెళ్లాడు రాహుల్. అయితే ప్రతిసారి సేఫ్ అయ్యి.. అందరికంటే ముందే సెమీస్‌లోకి బెర్త్ సాధించి.. చివరకు విజేతగా నిలిచాడు. కాగా ఫైనల్‌లో బాబా భాస్కర్, శ్రీముఖి, వరుణ్ సందేశ్, అలీ రెజా‌ను కాదని రాహుల్‌కే ప్రేక్షకులు పట్టం కట్టడానికి చాలా కారణాలే ఉన్నాయి. అవేంటంటే..!

రాహుల్ విజయంలో మొదట కీలక పాత్ర పోషించింది శ్రీముఖితో ఉన్న వైరం. బిగ్‌బాస్‌లోకి వెళ్లకముందు ఈ ఇద్దరు మంచి స్నేహితులు అయినప్పటికీ.. హౌస్‌లోకి వెళ్లిన తరువాత మాత్రం బద్ద శత్రువులుగా మారారు. ఇక సీజన్ ప్రారంభమైన కొన్ని రోజులకే బిగ్‌బాస్ 3 విన్నర్ శ్రీముఖినే అంటూ ప్రచారం జరిగింది. శ్రీముఖిని విజేతను చేసేందుకు బిగ్‌బాస్ నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారంటూ వచ్చిన పుకార్లు ప్రేక్షకుల్లోకి బాగా చొచ్చుకుపోయాయి. అయితే ఆమె వ్యతిరేక వర్గానికి ఈ ప్రచారం నచ్చకపోగా.. శ్రీముఖికి శత్రువుగా ఉన్న వారు  రాహుల్‌ వైపు మొగ్గుచూపారు. ఈ క్రమంలోనే అతడికి ఎక్కువ ఓట్లు పడ్డట్లు తెలిస్తోంది.

ఇక రాహుల్ విజయంలో మరో కీలక పాత్ర పోషించింది పునర్నవి అనడంలో ఎలాంటి సందేహం ఉండదు. పునర్నవి హౌస్‌లో ఉన్నన్ని రోజులు.. పులిహోర కలిపే పనిలో ఉండే రాహుల్.. ఆమె ఎలిమినేట్ అయిన తరువాత మాత్రం చాలా మారిపోయాడు.  ఆ తరువాత అతడి గ్రాఫ్ అనూహ్యంగా పెరిగిందని కూడా చెప్పొచ్చు. టాస్క్‌లో యాక్టివ్‌గా పాల్గొన్నాడు. ఇక తల్లి ఇచ్చిన ప్రోత్సహాంతో మరింత ఉత్సాహాన్ని తెచ్చుకున్న రాహుల్.. చివరకు టైటిల్ విన్నర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ఫైనల్‌లో రాహుల్‌కు పునర్నవి ఫ్యాన్స్ సపోర్ట్ కూడా వచ్చింది. ఇలా ఈ ముగ్గురు మహిళలు రాహుల్ విజయం వెనుక ముఖ్య పాత్ర పోషించారు.

వారితో పాటు 11 సార్లు ఎలిమినేషన్‌ను నామినేట్ అవ్వడం కూడా అతడికి కలిసొచ్చింది. కావాలనే రాహుల్‌ను నామినేట్ చేస్తున్నారంటూ బయట ప్రేక్షకుల్లో ఓ సింపథీ ఏర్పడింది. దీంతో రాహుల్‌కు ఓట్లు పెరిగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఫైనల్ సమీపిస్తోన్న నేపథ్యంలో అతడికి చెందిన ఓ పాత వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. అందులో బిగ్‌బాస్‌ షోపై, అమ్మాయిలపై రాహుల్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఇదంతా శ్రీముఖి టీమ్ చేస్తుందని భావించిన కొందరు.. ఆమెను ఓడించేందుకు రాహుల్‌కు ఓటు వేసినట్లు కూడా టాక్. వీటన్నింటితో పాటు బిగ్‌బాస్ 2 రన్నరప్ గీతా మాధురి, రాపర్ నోయెల్‌లు రాహుల్ విజయం కోసం బయట ప్రచారాన్ని చేశారు. ఈ క్యాంపైన్ కూడా అతడికి కలిసొచ్చి.. మొత్తానికి టైటిల్‌ను గెలిచేందుకు సహాయం చేసింది. ఇదిలా ఉంటే బిగ్‌బాస్ షో ద్వారా వచ్చిన డబ్బులతో ఓ బార్బర్ షాప్ పెట్టుకుంటానని.. తనకు తన వృత్తి అంటే చాలా గౌరవమని అతడు ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. మరి ఇప్పుడు విన్నర్‌గా నిలిచాడు కాబట్టి.. ఆ డబ్బులతో బార్బర్ షాప్ పెట్టుకుంటాడో..? లేదో..? చూడాలనుకుంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!