Breaking News
  • 46వ రోజుకు చేరుకున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె
  • నేడు ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్ష నేతల సమావేశం
  • సమ్మెపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం
  • గుంటూరు: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆఫీస్‌లో చోరీ
  • రూ.10 లక్షల నగదు అపహరణ, కేసు నమోదు చేసిన పోలీసులు
  • తెలిసిన వారే చోరీకి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్న పోలీసులు
  • శ్రీనగర్‌: సియాచిన్‌లో మంచుతుఫాన్‌. 18 వేల అడుగుల ఎత్తులో మంచుతుఫాన్‌. మంచుకింద చిక్కుకున్న 8 మంది సైనికులు. నలుగురు సైనికులు సహా ఇద్దరు సహాయకులు మృతి. మరో ఇద్దరు సైనికులకు గాయాలు.

బిగ్ బాస్: టైటిల్ రేసులో ఉన్నది ‘ఆ ఒక్కడే’..

Baba Bhaskar Will Win Bigg Boss 3 Telugu Title, బిగ్ బాస్: టైటిల్ రేసులో ఉన్నది ‘ఆ ఒక్కడే’..

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ విజయవంతంగా 90 రోజులు పూర్తి చేసుకుంది. ‘బిగ్ బాస్ హోటల్ టాస్క్‌’ను కంటెస్టెంట్లు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయడంతో ఒక్కో కంటెస్టెంట్‌కి 200 చెప్పున ఏడుగురుకి 14 వందల పాయింట్స్ ఇచ్చారు బిగ్ బాస్. కానీ డ్రిల్స్  విషయంలో నియమాలను పాటించని కారణంగా లగ్జరీ బడ్జెట్‌లో కోత విధించాడు బిగ్ బాస్. ఇదిలా ఉంటే షో చివరి దశకు చేరుకునే సరికి ఫైనల్ విజేతగా ఎవరు నిలుస్తారనే దానిపై ప్రేక్షకుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇప్పటికే వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, శ్రీముఖి, అలీ రెజా, రాహుల్ సిప్లిగంజ్‌లు ఫైనల్ లిస్ట్‌లో ఉన్నట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఇక వీరందరూ కూడా టాస్కుల్లో విపరీతంగా కష్టపడుతూ.. టైటిల్‌ రేస్‌‌‌‌లో ముందుకు సాగుతున్నారు. కొందరు వరుణ్ సందేశ్ విజేతగా నిలుస్తాడని అంటుంటే.. మరికొందరు శ్రీముఖి అని.. ఇంకొందరు రాహుల్ సిప్లిగంజ్ అని చెబుతున్నారు.

అయితే వీరందరిలో కంటే బాబా భాస్కర్‌కే గెలిచే ఛాన్స్‌లు ఎక్కువ ఉన్నాయని ఇన్‌సైడ్ టాక్ నడుస్తోంది. ‘రేలంగి మావయ్య’గా బిగ్ బాస్ హౌస్‌లో పేరు తెచ్చుకున్న బాబా మాస్టర్.. ఇప్పటివరకు ఎవరితోనూ గొడవ పడలేదు. అంతేకాక ప్రతి కంటెస్టెంట్‌తో కూడా స్నేహపూర్వకంగా మెలుగుతూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. అటు ఈ వారం భార్యను కాపాడే ప్రయత్నంలో వరుణ్ సందేశ్ తనకున్న ఇమేజ్‌ను తగ్గించుకోవడం జరిగింది. ఇది కూడా బాబా మాస్టర్‌కు ప్లస్ అయింది.

మరోవైపు బిగ్ బాస్‌ను ఓ సెంటిమెంట్ వెంటాడుతోంది. మొదటి సీజన్‌ను ఒకసారి పరిశీలిస్తే.. షో చివరి దశకు చేరుకునే టప్పటికీ హరితేజకు ఎక్కువ మార్కులు పడ్డాయి. ఆమెకు టైటిల్ రావడం ఖాయమని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా శివబాలాజీ విజేతగా నిలిచాడు. ఇక అతడు టైటిల్ గెలవడంలో పవన్ ఫ్యాన్స్ హస్తం ఉందని వార్తలు వచ్చాయి కూడా. ఇప్పుడు అదే సీన్ రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది.

వరుణ్ సందేశ్ విజేతగా నిలుస్తాడని వార్తలు వస్తున్నా.. బాబా భాస్కర్ టైటిల్ గెలవడం ఫిక్స్ అని చాలామంది నెటిజన్లు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అతడు తమిళియన్ అన్న విషయం తప్పితే.. హౌస్‌లో పొరపాట్లు చేసిన దాఖలాలు లేవని వారు అంటున్నారు.