బిగ్‌బాస్‌లో నెక్ట్స్ ఎలిమినేట్ కాబోయేది ఆమెనేనా..!

Bigg boss 3: Telugu who's getting Eliminated from Bigg boss House in 2nd week, బిగ్‌బాస్‌లో నెక్ట్స్ ఎలిమినేట్ కాబోయేది ఆమెనేనా..!

బిగ్‌బాస్ హౌస్.. ఇక్కడ ఏమైనా జరుగుతుంది.. అనుకున్నదానికి భిన్నంగా ప్రేక్షకుల తీర్పుతో.. బిగ్‌బాస్‌ హౌస్‌ అక్క నటి హేమ.. ఊహకి అందని విధంగా మొదటి వారంలో‌నే ఎలిమినేట్ అయ్యింది. దీంతో.. బయటకు వచ్చిన హేమ.. ఘాటు విమర్శలు కూడా చేసింది.. ఆ విషయం పక్కన పెడితే.. ఇక రెండోవారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేదే అందరిలో ఆసక్తికర చర్చ మొదలైంది. కొన్నిసార్లు మనం ఊహించిన వాళ్లే బయటికి వెళ్తుంటారు.. ఒక్కోసారే ఆ అద్భుతాలు జరుగుతూంటాయి. మరి ఈ వారం ఏం జరగబోతోంది..? బిగ్‌బాస్-3పై ఓ లుక్కేద్దామా..!

రెండో వారంలో.. శ్రీముఖి, హిమజ, పునర్నవి, వితిక, జాఫర్, మహేశ్ విట్టా, సింగర్ రాహుల్, వరుణ్ సందేశ్‌లు ఎలిమినేషన్‌లో ఉన్నారు. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలుసుకుందామా..!

తమన్నా ఎంట్రీతోనే తన టార్గెట్ ఎవరో చెప్పేసింది. మహేశ్ విట్టాతో గొడవ పెట్టుకోవడం ఇష్టం లేదంటూ.. వితిక-వరుణ్‌లే తన టార్గెట్ అంటూ మనసులోని మాట చెప్పేసింది. దీంతో.. వితిక, వరుణ్‌లపై కాస్త నెగిటివ్ ఇంప్రెషన్ పడినట్టే తెలుస్తోంది.

ఆ నెక్ట్స్.. శ్రీముఖి ఎలిమినేషన్‌లో ఉంది కానీ.. డేంజర్ జోన్‌లో లేదనే విషయం.. కింగ్ నాగ్ ఆమెకు స్వయం చెప్పారు.. సో దీనిబట్టి శ్రీముఖీ కూడా రెండవ ఎలిమేషన్‌లో ఉండదనే అనుకోవాలి. ఇక హిమజ.. మంచి ఫామ్‌లో ఉంది.. ప్రేక్షకులు కూడా బాగానే ఓట్లు వేస్తున్నారు. పునర్నవి కూడా గేమ్ బాగా ఆడుతుంది. అలాగే.. అందాల ఆరబోతకు కొదవే లేదు. దీంతో.. ఆమెని కొన్నిరోజులు హౌస్‌లోనే ఉంచుతాని సమాచారం.

ఇక జాఫర్.. బయటకు వెళ్లిపోతాను అంటూనే.. ఎంతో చాకచక్యంగా గేమ్ ఆడుతున్నాడు. సో.. ఇప్పుడప్పుడే జాఫర్ బయటకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదనే చెప్పాలి. ఇంక.. రాహుల్ సఫ్లిగంజ్ కూడా సేఫ్ అయ్యేలా కనిపిస్తున్నాడు. ఇంట్లో కాంట్రవర్సీ కింగ్‌గా మారుతున్నాడు.. కాబట్టి.. ఖచ్చితంగా రాహుల్ ఇంటలోనే ఉంటాడని చెప్పవచ్చు. మహేశ్ విట్టా కూడా వరుణ్, వితికలు గొడవతో.. ఆయనపై ప్రేక్షకుల్లో కాస్త.. సాఫ్ట్ కార్నర్ ఉంది. సో.. రెండొవ వారం ఎలిమినేషన్ రౌండ్ కాస్త ఆసక్తిగానే మారుంతోంది. ఎవరు వెళ్తారో.. ఎవరు ఉంటారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *