బిగ్ బాస్: ఎటూ తేలని ‘రీ ఎంట్రీ’.. ఎలిమినేషన్స్‌పై అదే సస్పెన్స్!

Bigg Boss 3 Telugu Eliminations, బిగ్ బాస్: ఎటూ తేలని ‘రీ ఎంట్రీ’.. ఎలిమినేషన్స్‌పై అదే సస్పెన్స్!

ఎన్నో మలుపులు.. ఆపై మరెన్నో ట్విస్టులతో బిగ్ బాస్ చివరి అంకంకు చేరుకుంది. హౌస్ నుంచి బయటికి వచ్చేసిన కంటెస్టెంట్లు మళ్ళీ రీ-ఎంట్రీ ఇస్తారని నెట్టింట్లో ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఇప్పుడు వాటికీ బ్రేక్ పడినట్లు అయింది. ఈ వారం రీ-ఎంట్రీ ఉంటుందని అందరూ ఊహించారు. కానీ అవన్నీ వట్టి బ్రమలుగా మిగిల్చాడు బిగ్ బాస్. ఇది ఇలా ఉండగా ముందు నుంచి సోషల్ మీడియాలో వస్తున్న లీకులు అన్ని కూడా నిజమవుతూ వచ్చాయి. కంటెస్టెంట్ల దగ్గర నుంచి ఎలిమినేషన్స్ వరకూ సస్పెన్స్ అనేది లేకుండా అన్ని విషయాలూ సోషల్ మీడియాలో తెలిసిపోయాయి. అయితే ఈ వారం ఎలిమినేషన్స్ ప్రక్రియ ఆలస్యం కావడంతో హౌస్‌ నుంచి బయటకు వచ్చిన సభ్యులు మళ్ళీ రీ-ఎంట్రీ ఇస్తారనే ఊహాగానాలు మరింతగా రెట్టింపయ్యాయి. ఇక నెటిజన్లు హౌస్‌లోకి ఎంట్రీకి ఎవరికి ఛాన్స్ ఇస్తారనే దానిపై చర్చ మొదలుపెట్టారు.

ఈ తరుణంలో బిగ్ బాస్ సాధారణ ఎలిమినేషన్ పెట్టి.. రీ-ఎంట్రీపై అదే సస్పెన్స్ కొనసాగిస్తూ అందరిని షాక్‌కు గురి చేశాడు. ఈ వారం మహేష్ విట్టా, రాహుల్ సిప్లిగంజ్, హిమజ ఎలిమినేషన్స్‌లో ఉన్నారు. అటు ఈ వారం రీ-ఎంట్రీ లేకపోవడంతో తర్వాతైనా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎవరు వస్తారనే దానిపై అందరిలోనూ ఉత్కంఠ మొదలైంది. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పేరుగాంచిన అలీ రెజా మరోసారి హౌస్‌లోకి రీ-ఎంట్రీ ఇచ్చేలా ఉన్నాడని ఇన్‌సైడ్ టాక్. అటు ఈ వారం ఎలిమినేషన్స్‌లో హిమజ ఇప్పటికే సేఫ్ జోన్‌లో ఉందని.. మహేష్ విట్టా ఎలిమినేషన్‌కు గురయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి బిగ్ బాస్ ఈ వారం ఎవరిని బయటకు పంపించి.. వైల్డ్ కార్డుతో లోపలికి ఎవరిని తీసుకొస్తాడో అన్నది వేచి చూడాలి.?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *