బిగ్ బాస్: వాళ్లిద్దరూ కాంప్లికేటెడ్‌ ఫ్రెండ్స్ అట.!

Punarnavi Bhupalam Reveals Her Relationship With Rahul, బిగ్ బాస్: వాళ్లిద్దరూ కాంప్లికేటెడ్‌ ఫ్రెండ్స్ అట.!

అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 విజయవంతంగా ఎనిమిది వారాలు పూర్తి చేసుకుని.. తొమ్మిదో వారంలోకి అడుగుపెట్టింది. మొదటి రెండు రోజుల్లో ఉత్కంఠభరితమైన నామినేషన్స్ పూర్తి చేసుకుని.. ప్రస్తుతం సరదా టాస్కులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక బిగ్ బాస్.. ఇంటి సభ్యులకు ఇచ్చిన క్రేజీ స్కూల్ టాస్క్.. కొంచెం ఫన్నీగా.. ఇంకొంచెం ఎమోషనల్‌గా సాగుతూ ఫ్యాన్స్‌ను రక్తికట్టించింది. రాహుల్, బాబా భాస్కర్ అందరి ముందు శివజ్యోతిని కామెంట్ చేయడంతో ఆమె ఏడుపు లంకించుకోగా.. ఆ తర్వాత జోక్‌గా అన్నానని రాహుల్.. నువ్వు బాగుండాలనే ఉద్దేశంతోనే చెప్పానని బాబా మాస్టర్ సర్ది చెప్పారు. ఇక టాస్క్‌లో భాగంగా వరుణ్, వితిక, బాబా భాస్కర్‌లు టీచర్లుగా వ్యవహరించి.. మిగతా ఇంటి సభ్యులకు పరీక్షలు నిర్వహించారు.

అనంతరం టీచర్ వితిక క్లాస్ తీసుకుంటూ.. తాను విన్న గాసిప్‌లపై విద్యార్థులను ప్రశ్నించింది. ఇందులో భాగంగా పునర్నవిని.. రాహుల్‌తో తనకు ఉన్న రిలేషన్‌షిప్ గురించి వితిక అడగ్గా.. తాము ఫ్రెండ్స్ కాదు.. లవర్స్ అంతకంటే కాదు.. మేము జస్ట్ కాంప్లికేటెడ్‌ ఫ్రెండ్స్ అంటూ ఆన్సర్ చెప్పి పున్ను తెలివిగా తప్పించుకుంది. ఆ తర్వాత ఇంటి సభ్యులు జంటలుగా వచ్చీ రాని డాన్స్ పెర్ఫార్మన్స్‌లు ఇచ్చి.. హౌస్‌లో నవ్వులు పూయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *