హౌస్‌లో జంట టబ్ రొమాన్స్ ఏంటండి బాబూ.. నాగ్ చిలిపి ప్రశ్న!

Bigg Boss 3 Telugu, హౌస్‌లో జంట టబ్ రొమాన్స్ ఏంటండి బాబూ.. నాగ్ చిలిపి ప్రశ్న!

వీకెండ్ ఎంట్రీలో అక్కినేని నాగార్జున అదిరిపోయే మాస్ సాంగ్‌కు స్టెప్‌లు వేసి అందరిని అలరించాడు. ఇక ఎప్పటిలానే హౌస్ సభ్యుల యాక్టివిటీస్‌ను మన టీవీలో చూసేదాం అంటూ ఇంటి సభ్యులతో నాగ్ స్నేహపూర్వకంగా మాట్లాడుతూ వారిని ప్రశంసలతో ముంచెత్తాడు.  హౌస్‌మేట్స్ అందరితోనూ పిల్లో గేమ్ ఆడిస్తూ.. వారి గురించి తెలుసుకుంటూ.. కొంతమంది అతి ప్రవర్తనకు క్లాస్ పీకుతూ.. సభ్యులకు నాగ్ మంచి మాటలు చెప్పాడు. మధ్యమధ్యలో రాహుల్ తన పాటలతో ఇతర హౌస్‌మేట్స్‌ను ఎంటర్టైన్ చేశాడు.

ఇది ఇలా ఉండగా నాగార్జున.. కపుల్‌గా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ సందేశ్, వితికను కొంతసేపు ఆటపట్టించాడు. బాత్రూమ్ టబ్‌లో రొమాన్స్ ఏంటని నాగ్  ప్రశ్నించగా.. థింకింగ్ టబ్ అంటూ వితిక జవాబిచ్చింది. అటు నాగార్జున.. వితిక ఇంటి నుంచి వెళ్తే బాగుంటుందని వరుణ్ ఆలోచిస్తున్నాడంటూ అతనికి షాక్ ఇచ్చాడు. దాంతో అలాంటిదేమీ లేదని వరుణ్ చెప్పాడు. ఆ తర్వాత కొత్త బంగారు లోకం సినిమా నుంచి పాట పాడి వరుణ్ అందరిని ఆకట్టుకొన్నాడు.

మరోవైపు హిమజ, పునర్నవి ఎలిమినేషన్ నుంచి బయటపడ్డారని నాగ్ చెబుతూ.. మిగిలిన నలుగురిలో ఎవరు ఎలిమినేటి అవుతారో ఇవాళ చెబుతానని ప్రేక్షకుల్లో సస్పెన్స్‌కు తెర లేపాడు. కాగా ఆ నలుగురితో పాటు సెలబ్రిటీలు అందరూ కూడా హ్యాపీగా నిద్రపోవాలంటూ సెలవిచ్చి నాగ్ ఎపిసోడ్‌ను ముగించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *