బిగ్‌బాస్‌లో నాగార్జున బిగ్ షాక్.. హౌస్ లో అంతా పరేషాన్

బిగ్ బాస్.. రాను రాను మరింత ఉత్కంఠగా మారుతోంది. ఈ రోజుతో పదోవారం గడుస్తోంది. అయితే ఈ వారంలో జరిగిన బిగ్‌బాస్ హౌస్‌‌లోని ఇంటి సభ్యుల గొడవలపై హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాగార్జున కాస్త గట్టిగానే క్లాస్ తీసుకున్నాడు. అంతేకాదు.. సభ్యుల మధ్య జరిగిన గొడవలకు ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు. రాహుల్‌-వరుణ్‌‌ల మధ్య జరిగిన గొడవను నాగ్‌ సద్దుమణిగేలా చేశాడు. ఈ సందర్భంగా వరుణ్ క్షమాపణలు కూడా చెప్పాడు. పాత విషయాలను తవ్వడం తన తప్పేనన్నాడు. అటు […]

బిగ్‌బాస్‌లో నాగార్జున బిగ్ షాక్.. హౌస్ లో అంతా పరేషాన్
Follow us

| Edited By:

Updated on: Sep 29, 2019 | 10:12 AM

బిగ్ బాస్.. రాను రాను మరింత ఉత్కంఠగా మారుతోంది. ఈ రోజుతో పదోవారం గడుస్తోంది. అయితే ఈ వారంలో జరిగిన బిగ్‌బాస్ హౌస్‌‌లోని ఇంటి సభ్యుల గొడవలపై హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాగార్జున కాస్త గట్టిగానే క్లాస్ తీసుకున్నాడు. అంతేకాదు.. సభ్యుల మధ్య జరిగిన గొడవలకు ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు. రాహుల్‌-వరుణ్‌‌ల మధ్య జరిగిన గొడవను నాగ్‌ సద్దుమణిగేలా చేశాడు. ఈ సందర్భంగా వరుణ్ క్షమాపణలు కూడా చెప్పాడు. పాత విషయాలను తవ్వడం తన తప్పేనన్నాడు. అటు రాహుల్ కూడా తనది కూడా తప్పేనంటూ సారీ చెప్పాడు. అయితే వీరిద్దరి గొడవకి ఎండ్ కార్డ్ ఇస్తూ.. పునర్ణవికి చురకలంటించాడు. గొడవ జరుగుతూ ఉంటే.. చూస్తూ కూర్చున్నావ్‌.. టాస్క్‌ ఆడలేదని ఎంపైర్‌లా పక్కన ఉన్నావన్నాడు. రాహుల్‌-పున్నులు మాట్లాడకపోయే సరికి వరుణ్‌‌ నీతో ఉన్నాడంటూ శ్రీముఖితో వితికా చెప్పిన మాటలను ప్రస్తావించాడు. పునర్నవి గురించి బాబా, శ్రీముఖి దగ్గర చెప్పడం తప్పు కదా అని వితికాను కూడా మందలించాడు.

అంతేకాదు.. హౌస్‌లో పునర్నవి తిట్లదండకానికి సంబంధించిన వీడియోను ప్లే చేస్తూ.. తనదైన శైలిలో నాగ్ పంచ్‌లు వేశాడు. షో నుంచి బయటకి వెళ్లాక.. తిట్ల కోచింగ్ సెంటర్ పెట్టుకోవచ్చంటూ సెటైర్ వేశారు. బాబా భాస్కర్‌ మాస్క్‌ తీసేశాడని, శ్రీముఖి, వరుణ్‌తో జరిపిన సంభాషణలకు సంబంధించిన వీడియోలను చూపించాడు. నామినేషన్‌ విషయంలో పునర్నవితో మాట్లాడిన విధానంపైనా ఫైర్‌ అయ్యాడు. బాబా బాస్కర్ ప్రతీది కామెడీ చేస్తున్నాడంటూ నాగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక రాహుల్‌-వరుణ్‌ మధ్య వచ్చిన గొడవను.. శ్రీముఖి వాడుకుంటోందంటూ పరోక్షంగా అన్నాడు.

బ్రోకెన్‌ హార్ట్‌ టాస్క్..

అయితే నాగ్ అందరికీ ఓ వెరైటీ టాస్క్ ఇచ్చాడు. హౌస్‌మేట్స్ అందరికీ హార్ట్‌‌ షేప్‌ థర్మకోల్‌‌ షీట్‌లను అందించాడు. ఆ తర్వాత వాటిని విరగొట్టాలని చెప్పాడు. అయితే దానికి ఓ కండిషన్ పెట్టాడు. హౌస్‌మేట్స్‌‌లో ఎవరి వల్ల హార్ట్‌ బ్రేక్‌ అయిందని భావిస్తున్నారో.. వారి వద్దకు వెళ్లి.. ఆ హార్ట్‌ను విరగొట్టాలని అన్నాడు. అంతేకాదు దానికి సంబంధించిన కారణం కూడా చెప్పాలనే టాస్క్‌ ఇచ్చాడు. దీనిలో భాగంగా మహేష్‌ మొదటగా ఆటను ప్రారంభించాడు. బాబా భాస్కర్‌ వల్ల తన హార్ట్‌ బ్రేక్‌ అయిందని బాబా ఎదుటకు వెళ్లి థర్మకోల్‌ హార్ట్‌ షేప్‌ను మహేష్ విరగొట్టాడు. ఇక రాహుల్‌కు శివజ్యోతి వల్ల, శివజ్యోతికి రాహుల్‌ వల్ల, రవి, వితికాలకు పున్ను వల్ల, బాబాకు మహేష్‌ వల్ల, శ్రీముఖికి బాబా వల్ల, అలీకి బాబా వల్ల, పున్నుకు వరుణ్‌ వల్ల హార్ట్‌ బ్రేక్‌ అయినట్లు తెలిపారు. ఇక నామినేషన్‌లో ఉన్న శ్రీముఖి, బాబా భాస్కర్‌, వరుణ్‌, రవిలోంచి వరుణ్‌ సేఫ్ జోన్‌లో ఉన్నట్లు నాగ్‌ ప్రకటించేశాడు. అయితే ఈ వారం రవి ఎలిమినేట్‌ అయినట్లు ఇప్పటికే సోషల్‌ మీడియాలో వార్తలు వైరల్‌గా మారాయి. మరి రవి ఎలిమినేషన్‌ ఇక లాంచనమేనా.. లేక మరెవరైనా ఎలిమినేట్ అవుతారా అన్నది వేచిచూడాల్సిందే.