బిగ్‌బాస్ 3: రేపే వైల్డ్‌కార్డ్ ఎంట్రీ..? శ్రద్ధా, హెబ్బా కాదు.. లిస్ట్‌లో తెలుగమ్మాయి..!

Telugu Actress Eesha Rebba wild card entry in house?, బిగ్‌బాస్ 3: రేపే వైల్డ్‌కార్డ్ ఎంట్రీ..? శ్రద్ధా, హెబ్బా కాదు.. లిస్ట్‌లో తెలుగమ్మాయి..!

బుల్లితెరపై బిగ్‌బాస్ 3 హవా కొనసాగుతోంది. బిగ్‌బాస్‌ ఇచ్చే టాస్క్‌లు, హౌస్‌లో కంటెస్టెంట్‌ల మధ్య గొడవలు, ఫన్నీ మెమొరీస్‌తో ప్రేక్షకులను ఈ షో కట్టిపడేస్తుంది. ఇదిలా ఉంటే ఈ సారి ఎలిమినేషన్‌లో ఎవరు ఉంటారన్నది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎలిమినేషన్‌లో రాహుల్, హిమజ, మహేష్ విట్టా, అషు రెడ్డి, పునర్నవి, శివ జ్యోతి, బాబా భాస్కర్ మాస్టర్ ఉండగా.. వారిలో బిగ్‌బాస్ ఎవరిని ఇంటికి పంపుతారన్నది ఇప్పటికీ హాట్ టాపిక్‌గా నడుస్తుంది.

ఇదిలా ఉంటే ఈసారి మరో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఉండబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక ఈ లిస్ట్‌లో ఇదివరకు హెబా పటేల్, శ్రద్ధా దాస్ పేర్లు వినిపించగా.. తాజాగా మరో హీరోయిన్‌ పేరు వినిపిస్తోంది. అంతకుముందు ఆ తరువాత, అమీ తుమీ, అరవింద సమేత, ఆ! తదితర చిత్రాల్లో నటించిన ఈషా రెబ్బా బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈషా హౌస్‌లోకి ఎంటర్ అయితే బిగ్‌బాస్ మరింత హాట్‌గా మారే అవకాశం ఉందని నిర్వాహకులు భావిస్తున్నారట. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే.

Telugu Actress Eesha Rebba wild card entry in house?, బిగ్‌బాస్ 3: రేపే వైల్డ్‌కార్డ్ ఎంట్రీ..? శ్రద్ధా, హెబ్బా కాదు.. లిస్ట్‌లో తెలుగమ్మాయి..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *