Breaking News
  • భారత్‌-అమెరికా సంబంధాలు మరింత బలపడుతున్నాయి. కరోనాపై పోరులో భారత్‌ చేయాల్సిందంతా చేస్తోంది. సాయం చేయడానికి భారత్‌ ఎప్పుడూ ముందుంటుంది. కరోనా వైరస్‌ను కలిసికట్టుగా ఎదుర్కొంటాం-ప్రధాని మోదీ.
  • ప్రధాని మోదీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రశంసలు. కరోనాపై యుద్ధంలో భారతీయుల కృషి అభినందనీయం. భారత ప్రధాని మోదీకి నా ధన్యవాదాలు-ట్రంప్‌ ట్వీట్‌.
  • కృష్ణాజిల్లా: మచిలీపట్నంలో గుండెపోటుతో వ్యక్తి మృతి. ఇటీవల కరోనాతో చనిపోయిన వ్యక్తికి సోదరుడు కావడంతో.. స్థానికుల్లో పలు అనుమానాలు. మృతదేహాన్ని మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలింపు. శాంపిల్స్‌ పరీక్షించే వరకు మృతదేహం ఇవ్వమంటున్న అధికారులు.
  • తెలంగాణలో డయల్‌ 100కు పెరుగుతున్న కాల్స్‌. లాక్‌డౌన్‌ తర్వాత డయల్‌ 100కు 13,34,330 కాల్స్‌. ఎమర్జెన్సీ కాల్స్‌-82,014. కోవిడ్‌ సస్పెక్ట్ కాల్స్‌- 2,710. లాక్‌డౌన్‌ కాల్స్‌-21,758. ఇన్‌ ఎఫెక్టివ్‌ కాల్స్‌-87,665. విచారణ కోసం చేసిన కాల్స్‌- 84,123. తగ్గిన చోరీలు, గృహ హింస, రోడ్డుప్రమాదాల కాల్స్‌.
  • తెలంగాణలో క్రైమ్‌ రేట్‌ తగ్గింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో క్రైమ్‌రేట్‌ భారీగా పడిపోయింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో క్రైమ్‌రేటు 56 శాతానికి పడిపోవడం ఊరటనిస్తోంది. లాక్‌డౌన్‌తో దొంగతనాలు పూర్తిగా తగ్గిపోయాయి.

భావోద్వేగానికి గురైన హౌస్‌మేట్స్..!! పప్పుకి సారీ చెప్పిన తమన్నా..!

Bigg Boss 3: Tamanna says sorry to Ravi, భావోద్వేగానికి గురైన హౌస్‌మేట్స్..!! పప్పుకి సారీ చెప్పిన తమన్నా..!

మరో కొన్ని గంటల్లో బిగ్‌బాస్ సీజన్ 3 ముగియనుంది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా.. మంచి రేటింగ్‌తో స్టార్ మా టీవీ ఛానెల్‌లో దూసుకెళ్తోంది బిగ్‌బాస్ 3. కాగా.. ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో.. ఉత్కంఠతో ఎదురు చూస్తోన్న సమాధానానికి.. ఆదివారం తెరపడనుంది. ఎవరా ‘టైటిల్ విన్నర్‌’ అని అటు ప్రేక్షకులతో పాటు.. ఇటు బిగ్‌బాస్ సీజన్ 1, 2 కంటెస్టెంట్స్ కూడా ఎంతో ఎగ్జైట్‌మెంట్‌తో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం హౌస్‌లో.. ఐదుగురు కంటెస్టెంట్స్‌.. బాబా మాస్టర్, ఆలీ, రాహుల్ సిప్లిగంజ్, వరుణ్ సందేశ్, శ్రీముఖిలు ఉన్నారు.

అయితే.. గత రెండు సీజన్స్‌లాగే.. ఈ సారి కూడా ఎలిమినేషన్ అయిన కంటెస్టెంట్స్‌లను తిరిగి.. హౌస్‌లోకి పంపించారు బిగ్‌బాస్. ఒకరి తర్వాత మరొకరు వస్తూ.. హౌస్‌లో ఉన్న ఐదుగురి కంటెస్టెంట్స్‌లకు షాక్ ఇచ్చారు. దీంతో.. అందరూ ఒక దగ్గరకు చేరి పాతస్మృతులను గుర్తు చేసుకున్నారు. హ్యాపీగా.. హౌస్‌లో గడిపారు. వారి వారి ఇష్టమైన హౌస్‌మేట్స్ రావడంతో.. మిగిలిన కంటెస్టెంట్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఈ టైంలోనే.. బిగ్‌బాస్ హౌస్‌మేట్స్ అందరికీ.. ఓ వీడియో చూపించారు. అందులో.. షో మొదలైన కాన్నుంచీ.. ఎండింగ్‌ వరకూ.. హౌస్‌లో జరిగిన ప్రతీ సన్నివేశాన్ని చూపించాడు బిగ్‌బాస్. దీంతో.. హౌస్‌మేట్స్ అందరూ ఒకేసారి భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా.. తమన్నా.. ఏడ్చి.. రవి అలియాస్ పప్పుకి సారీ చెప్పింది. ఇదంతా నేను కావాలని చేయలేదు.. గేమ్‌లో అది ఒక స్ట్రాటజీ.. దానికి నువ్వు బలయ్యావ్.. ఐ యామ్ వెరీ సారీ.. అంటూ.. మరింత భావోద్వేగానికి గురయ్యింది. దీంతో.. హౌస్‌మెంట్స్‌ అందరూ.. ఆమె పేరును అరుపులతో.. కేకలతో.. హోరెత్తించారు.

Bigg Boss 3: Tamanna says sorry to Ravi, భావోద్వేగానికి గురైన హౌస్‌మేట్స్..!! పప్పుకి సారీ చెప్పిన తమన్నా..!

Related Tags