Breaking News
  • భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 24,248 కేసులు, 425 మంది మృతి. దేశవ్యాప్తంగా 6,97,413 కేసులు,19,693 మంది మృతి. దేశ వ్యాప్తంగా 2,53,287 యాక్టీవ్ కేసులు,4,24,433 మంది డిశ్చార్జ్. దేశంలో 60.77 శాతానికి చేరిన కరోనా రికవరీ రేటు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • అమరావతి: రైతు భరోసా కేంద్రాలకు వైయస్ రాజశేఖర రెడ్డి పేరును పెడుతూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం. ఇకపై రైతు భరోసా కేంద్రాలను డాక్టర్ వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు గా వ్యవహరించనున్న ప్రభుత్వం. రైతులకు మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలకు గుర్తుగా అయన పేరును ఖరారు చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రభుత్వం.
  • ఈరోజు తూర్పు, ఉత్తర తెలంగాణా జిల్లాల్లో భారీ వర్షాలు. ఐదు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు. రుతుపవనాల కు తోడైన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం. ఆగ్నేయ జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం. 7.6 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. వాతావరణ శాఖ సీనియర్ సైంటిస్ట్. రాజారావు
  • ప్రకాశం: ఒంగోలు రిమ్స్‌ దగ్గర ల్యాబ్‌ టెక్నీషియన్ల ఆందోళన... ట్రూనాట్‌ ల్యాబుల్లో టెక్నీషియన్లకు శెలవులు ఇవ్వకుండా పనిచేస్తున్నారంటూ ఆరోపణ... వెంటనే శెలవులు ఇవ్వాలని డిమాండ్‌... ఒంగోలులో ఓ ల్యాబ్‌ టెక్నీషియన్‌కు పాజిటివ్‌, మార్కాపురంలో మరో ల్యాబ్‌ టెక్నీషియన్‌ కరోనాతో మృతి చెందడంతో ఆందోళనలో ల్యాబ్‌ టెక్నీషియన్లు.
  • అమరావతి : ఏపీ పాఠశాలల నిర్వహణలో సాంకేతికను జోడిస్తూ మార్పులు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పనిదినాలు కుదించిన విద్యాశాఖ . ఈ నెల 13వ తేదీ నుంచి ప్రాథమిక పాఠశాలలు వారానికో ఒకరోజు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు వారానికి రెండ్రోజులు పనిచేసేలా సర్క్యులర్ జారీ చేసిన పాఠశాల విద్యా శాఖ .
  • గుంటూరు: ఇంజనీరింగ్ విద్యార్దిని అశ్లీల వీడియోల చిత్రీకరణ కేసులో మరికొందరిని అదుపులోకి తీసుకొన్న పోలీసులు. వీడియోలు చూసిన వారిని లింక్ లు ఓపెన్ చేసిన వారిని కూడ గుర్తించిన పోలీసులు. మరో ఇద్దరు పోలీసులు అదుపులో. ఈ రోజు మీడియా ముందు ప్రవేశ పెట్టే అవకాశం.

బిగ్‌‌‌‌‌‌‌‌‌‌బాస్ 3: శివజ్యోతి మైనస్‌లే శ్రీముఖి ప్లస్‌లా..!

Siva Jyothi Vs Sreemukhi, బిగ్‌‌‌‌‌‌‌‌‌‌బాస్ 3: శివజ్యోతి మైనస్‌లే శ్రీముఖి ప్లస్‌లా..!

బుల్లితెర సంచలనం బిగ్‌బాస్ మూడో సీజన్‌ ఈ వారంతో ముగియనుంది. ఇక ఆదివారం జరిగిన ఎలిమినేషన్‌లో శివజ్యోతి హౌస్‌ నుంచి బయటకు వచ్చేయగా.. రాహుల్, శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్, అలీ రెజా టాప్ 5లో ఉన్నారు. వీరిలో ఎవరు టైటిల్‌ గెలుస్తారు..? ఎవరు రన్నరప్‌గా మిగులుతారు..? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే గతవారం హౌస్‌లో పర్‌ఫార్మెన్స్‌ల దృష్ట్యా అలీ రెజా ఎలిమినేట్ అవుతాడని చాలా మంది భావించారు. కానీ హోస్ట్ నాగార్జున అనూహ్యంగా శివజ్యోతి పేరును ప్రకటించడంతో.. ఆమె కూడా కొంత అసహనానికి గురైంది. ఆ తరువాత బయటకు వచ్చి ఎమోషనల్ కూడా అయ్యింది.

ఇదంతా పక్కనపెడితే హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి శివజ్యోతి అందరికీ మంచి ఫైట్ ఇచ్చింది. ముఖ్యంగా తోటి కంటెస్టెంట్‌లు ఆమె గురించి నెగిటివ్‌గా మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. తన జెన్యూనిటీతో అందరినీ ఆకట్టుకున్న శివజ్యోతి.. ఒక విషయంలో మాత్రం ప్రేక్షకులకు కాస్త విసుగు తెప్పించింది. అదేంటంటే.. కాస్త సెన్సిటివ్ అయిన శివజ్యోతి.. ఇతర కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయినప్పుడు మాత్రం భావోద్వేగానికి గురైంది. ఇక అలీ రెజా మొదటిసారి ఎలిమినేట్ అయినప్పుడు ఆమె ఏడ్చిన తీరుకు బయట ఓరేంజ్‌లో ట్రోలింగ్ కూడా జరిగింది. కానీ అది ఆమెకు పెద్ద నెగిటివ్‌ అని ఎవ్వరూ చెప్పలేరు.

ఇక శ్రీముఖి విషయానికొస్తే.. ఆమెకు బయట ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. హౌస్‌లోకి వెళ్లినప్పటి నుంచి పలుమార్లు నామినేషన్‌లోకి వచ్చినా.. ఆమె సేవ్‌ అవుతూ వస్తోంది. కానీ గడిచిన రెండు వారాల్లో శ్రీముఖి మీద కాస్త నెగిటివ్ పెరుగుతూ వచ్చింది. దీంతో ఆమె టాప్ 5కు చేరే అవకాశాలు కాస్త తగ్గుతూ వచ్చాయి. కానీ ఉన్నట్లుండి ఈ వారం ఎలిమినేషన్ నుంచి సేవ్ అవ్వడంతో పాటు.. ఇప్పుడు ర్యాంకింగ్‌లో టాప్‌లోకి వెళ్లిపోయింది శ్రీముఖి. కాగా గత సీజన్‌లోనూ కౌశల్ విషయంలో ఇలాగే జరిగింది. ఫైనల్ దగ్గరపడుతున్న సమయంలో కౌశల్‌పై నెగిటివిటీ బాగా పెరిగిపోయింది. హౌస్‌లోని సభ్యులందరూ కూడా అతడికి నెగిటివ్‌ అయ్యారు. కానీ ఇలా టార్గెట్ అవ్వడంతో.. బయట అతడికి భారీ మద్దతు లభించింది. ఇప్పుడు శ్రీముఖికి కూడా బయట ఫ్యాన్స్ నుంచి ఇలాంటి సపోర్ట్ ఉండటం వల్లనే టాప్‌లో కొనసాగుతున్నదని కొందరి అభిప్రాయం. ముఖ్యంగా బిగ్‌బాస్ 3 రాహుల్ వర్సెస్ శ్రీముఖిగా మారగా.. రాహుల్‌కు నెగిటివ్‌గా ఉన్న వాళ్లు శ్రీముఖికి సపోర్ట్ చేస్తున్నట్లు టాక్. ఇక శ్రీముఖితో పోలిస్తే శివజ్యోతికి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. మిగిలిన వారి మద్దతు ఆమెకు లభించింది కూడా చాలా తక్కువ. అదే ఆమెకు పెద్ద మైనస్‌గా మారి.. ఇప్పుడు ఎలిమినేట్ అయ్యిందని కొందరి అభిప్రాయం. ఏదేమైనా ఇప్పుడు ఫైనల్లో నలుగురితో పోటీ పడుతోన్న శ్రీముఖి.. టైటిల్‌ను గెలిచి.. మొదటి రెండు సీజన్ల రికార్డును బ్రేక్ చేస్తుందేమో చూడాలి.

Related Tags