బిగ్‌బాస్ 3: షాకింగ్.. ఈ సారి ఎలిమినేట్ అయ్యేది ఆమేనా..!

Rohini may eliminated from house, బిగ్‌బాస్ 3: షాకింగ్.. ఈ సారి ఎలిమినేట్ అయ్యేది ఆమేనా..!

తెలుగు బుల్లితెర మీద బిగ్‌బాస్ 3 హవా కొనసాగుతోంది. కంటెస్టెంట్‌ల మధ్య వార్, ప్రేమాయణాలు, బిగ్‌బాస్ టాస్క్‌లు.. ఇలా పలు విషయాలు ప్రేక్షకలను షోకు అతుక్కుపోయేలా చేస్తున్నాయి. కాగా నాలుగోవారం ఎలిమినేషన్ సమయం దగ్గరపడింది. ఈ నేపథ్యంలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే అంతటా ఉత్కంఠ కొనసాగుతోంది.

నాలుగో వారంలో ఆరుగురు నామినేషన్‌లో ఉండగా.. అందులో శివజ్యోతి, వరుణ్ సేఫ్ అయ్యారు. మిగిలిన నలుగురు ఎలిమినేషన్‌కు ఉన్నారు. కాగా అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ వారం రోహిణి ఎలిమినేట్ కావడం ఖాయమని తెలుస్తోంది. ఇక ఈ విషయం అధికారికంగా తెలుసుకోవాలనుకుంటే కొన్ని గంటలు ఆగాల్సిందే. ఇదిలా ఉంటే శనివారం జరిగిన ఎపిసోడ్‌లో అందరి ముసుగులు తీసేసిన నాగార్జున.. వారి తీరును బట్టి రకరకాల అవార్డులు ఇచ్చిన విషయం తెలిసిందే.

Rohini may eliminated from house, బిగ్‌బాస్ 3: షాకింగ్.. ఈ సారి ఎలిమినేట్ అయ్యేది ఆమేనా..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *