ఫైనల్‌కు చేరిన రాహుల్.. శ్రీముఖికి బిగ్‌బాస్ షాక్
బుల్లితెర మీద సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోన్న బిగ్‌బాస్ 3 రియాల్టీ షో క్లైమాక్స్‌కు చేరుకుంది. ఈ సారి బిగ్‌బాస్ విన్నర్ ఎవరో తెలుసుకునేందుకు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో బిగ్ బాస్ హౌస్‌లో టాస్క్‌లు, సభ్యుల ఆటలు రసవత్తరంగా మారాయి. ఇక మరో రెండు వారాల్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ నేపథ్యంలో టికెట్ టు ఫినాలే గెలిచేందుకు ఇంట్లో ఉన్న ఆరుగురు సభ్యులకు.. బ్యాటరీ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ టాస్క్‌లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ […]
బుల్లితెర మీద సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోన్న బిగ్‌బాస్ 3 రియాల్టీ షో క్లైమాక్స్‌కు చేరుకుంది. ఈ సారి బిగ్‌బాస్ విన్నర్ ఎవరో తెలుసుకునేందుకు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో బిగ్ బాస్ హౌస్‌లో టాస్క్‌లు, సభ్యుల ఆటలు రసవత్తరంగా మారాయి. ఇక మరో రెండు వారాల్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ నేపథ్యంలో టికెట్ టు ఫినాలే గెలిచేందుకు ఇంట్లో ఉన్న ఆరుగురు సభ్యులకు.. బ్యాటరీ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ టాస్క్‌లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విజయం సాధించాడు. దీంతో అతడు నేరుగా ఫినాలేకు చేరుకున్నాడు. ఈ సందర్భంగా రాహుల్‌ని అభినందించిన బిగ్ బాస్ ఫైనల్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు.
దీంతో శ్రీముఖికి షాక్ తగిలినట్లైంది. అయితే బయట మంచి స్నేహితులైన రాహుల్, శ్రీముఖిలు హౌస్‌లోకి వెళ్లిన తరువాత శత్రువులుగా మారారు. దీంతో బయట వారి వారి అభిమానులు ఒకరినొకరు ఫైనల్ రాకూడదని ప్రయత్నాలు చేశారు. ఇక ఇప్పుడు రాహుల్ డైరక్ట్‌గా ఫైనల్‌కు వెళ్లడంతో అతడు ఎలిమినేషన్ నామినేషన్లో ఉండడు. ఇది ఒక రకంగా ఆమెకు పెద్ద షాక్ లాంటిదే. కాగా మిగిలిన సభ్యులైన వరుణ్ సందేశ్, అలీ రెజా, బాబా భాస్కర్, శివజ్యోతిలతో పాటు శ్రీముఖి కూడా ఈ వారం ఎలిమినేషన్లో ఉంది. ఇవాళ ఇదిలా ఉంటే ఈ వారంలో ఇద్దరు సభ్యులు ఎలిమినేట్ అవుతారని.. మిగిలిన వారిలో ముగ్గురు సభ్యులు ఫైనల్‌కు వెళ్తారని ప్రచారం జరుగుతోంది. అందులో నిజమెంతో తెలియాలంటే మూడు రోజులు ఆగాల్సిందే.