Breaking News
  • సిద్దిపేట: దేశానికి ఆదర్శంగా గజ్వేల్‌ నిలువబోతోంది. గజ్వేల్‌లో సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి. రూ.కోట్లతో నిర్మించిన కార్యాలయాలను సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారు-హరీష్‌రావు.
  • ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై కార్యదర్శి జలీల్‌ ప్రెస్‌మీట్‌. అధిక పరీక్ష ఫీజులు వసూలు చేసిన మూడు కాలేజీలు దసరాసెలవుల్లో తరగతులు నిర్వహించిన కాలేజీలకు నోటీసులు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. హాల్‌ టికెట్లపై ఏ సమస్య ఉన్నా భయపడొద్దు. ఏదైనా సమస్య ఉంటే బోర్డును సంప్రదించాలి. Tsbie.gov.inలో విద్యార్థులు తమ వివరాలు చెక్‌చేసుకోవచ్చ -ఇంటర్‌ బోర్డ్‌ కార్యదర్శి ఉమర్‌ జలీల్‌
  • రేపు ఏపీ వ్యాప్తంగా టీడీపీ నిరసనలు. పెరిగిన ఆర్టీసీ చార్జీలకు నిరసనగా ఆందోళనలు. ఆర్టీసీ డిపోల ఎదుట నిరసనలకు పిలుపు నిచ్చిన టీడీపీ
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం శ్రీవారి ఉచిత దర్శనానికి 7 గంటల సమయం. ఈ రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.73 కోట్లు.
  • విశాఖ: రైల్వే ఈ-టికెట్లు బ్లాక్‌ చేస్తున్న ముఠా గుట్టురట్టు. దువ్వాడ, తాటిచెట్లపాలెంలో ఆర్పీఎఫ్‌ దాడులు ఈ-టికెట్లు బ్లాక్‌ చేస్తున్న ఇద్దరు అరెస్ట్‌. రూ.14.89 లక్షల విలువైన ఈ-టికెట్లు సీజ్‌. కటక్‌కు చెందిన సమీర్‌కుమార్‌ ప్రధాన్‌, దుర్గారావు అరెస్ట్‌. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేస్తున్న నిందితులు ల్యాప్‌టాప్‌, డాక్యుమెంట్లు సీజ్‌చేసిన ఆర్పీఎఫ్‌
  • కర్నూలు: నంద్యాలలో మందుబాబుల వీరంగం. పబ్లిక్‌గా మద్యం సేవిస్తున్న యువకులు. అడ్డుచెప్పిన మస్తాన్‌ వలీ అనే వ్యక్తిపై రాళ్లదాడి మస్తాన్‌వలీకి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
  • వరంగల్‌: హన్మకొండలో గుంతలరోడ్డుకు యువతి బలి. హంటర్‌రోడ్డులో గుంతలో పడి విద్యార్థిని బైక్‌ బోల్తా. రాంపూర్‌కు చెందిన విద్యార్థిని బ్లెస్సీ అక్కడికక్కడే మృతి.

బిగ్‌బాస్ 3: హాట్ టాపిక్‌గా రాహుల్-పునర్నవి కిస్ సీన్

Punarnavi kisses Rahul in Bigg Boss, బిగ్‌బాస్ 3: హాట్ టాపిక్‌గా రాహుల్-పునర్నవి కిస్ సీన్

తెలుగు బుల్లితెరపై సంచలనాలు సృష్టిస్తూ బిగ్‌బాస్‌ మూడో సీజన్ విజయవంతంగా కొనసాగుతోంది. ఇక గత రెండు సీజన్‌లతో పోలీస్తే ఈ సీజన్‌లో లవ్ మసాలా కూడా బాగా పెరిగింది. ఈ సారి హౌజ్‌లో రియల్ కపుల్ వరుణ్-వితిక ఉన్నప్పటికీ.. వారి కంటే రాహుల్-పునర్నవి మధ్య కెమిస్ట్రీ రోజురోజుకు పెరిగిపోతోంది. తాజా ఎపిసోడ్‌లో పునర్నవి రాహుల్‌ను హగ్‌ చేసుకోవడం, ముద్దు పెట్టుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు ఈ సీన్‌పై సోషల్‌ మీడియాలో లెక్కలేనన్ని మీమ్స్‌, కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి.

తాజా ఎపిసోడ్‌లో పునర్నవి కోసం ఇరవై గ్లాసుల కాకరకాయ జ్యూస్‌ను తాగమని బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చాడు. దీంతో అన్ని గ్లాసుల కాకరకాయ జ్యూస్‌ను విజయవంతంగా తాగి పునర్నవి అనుమానాలు పటాపంచలు చేశాడు రాహుల్. మొదట కాస్త కష్టంగానే అనిపించినా.. ఆ టాస్క్‌ను అతడు పూర్తి చేసేశాడు. దీంతో పునర్నవికి ఎక్కడ లేని ఆనందం వచ్చేసింది. వెంటనే అంతుపట్టని సంతోషంతో.. రాహుల్‌ను హగ్‌ చేసుకుని, ముద్దు పెట్టింది. దీంతో రాహుల్‌ సోషల్‌ మీడియాలో హీరో అయ్యాడు.

అయితే హౌస్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఒకరిపై మరొకరు ప్రేమను చూపిస్తూ పలుమార్లు కెమెరాకు చిక్కారు. అయితే ఇటీవల జరిగిన ఓ ఎపిసోడ్‌లో కెప్టెన్సీ టాస్క్‌లో రాహుల్‌పై పునర్నవి కామెంట్లు చేసింది. వితికాను ఎత్తుకుని పరిగెత్తే విషయమై.. వారంతా చర్చించుకుంటూ ఉంటే.. చేయి నొప్పి, కాలు నొప్పి అంటావ్‌ టాస్క్‌ నీకవసరమా? అంటూ రాహుల్‌ను ఉద్దేశించి పునర్నవి కామెంట్లు చేసింది. దీంతో వారిద్దరి మధ్య దూరం రాగా.. వీకెండ్‌ ఎపిసోడ్‌లో అది ఇంకాస్త పెరిగింది. ఈ దూరాన్ని తగ్గించేందుకే బిగ్‌బాస్ ఈ టాస్క్‌ను ఇచ్చాడని సోషల్ మీడియాలో పలువురు ట్వీట్లు పెడుతున్నారు.