బడ్డూ! గుడ్డుని సేవ్ చేయలేకపోయావ్! వితిక పంచ్

Bigg Boss 3 Latest Episode Highlights

అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3.. ముచ్చటగా మూడో వారం ముగించుకుని నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. ఇక ఈ వారంలో ఏకంగా ఏడుగురు కంటెస్టెంట్లు ఎలిమినేషన్స్‌లో ఉన్నారు. ఇది ఇలా ఉంటే నిన్నటి ఎపిసోడ్‌లో హౌస్‌మేట్స్ మధ్య బిగ్ బాస్ పెట్టిన టాస్క్ భలే రంజుగా సాగింది.

కంటెస్టెంట్లను రెండు టీమ్స్‌గా విభజించి విక్రమ పురి, సింహపురి అని రెండు రాజ్యాలుగా పేర్లు పెట్టి గుడ్ల కోసం కొట్లాట పెట్టాడు బిగ్ బాస్. రెడ్ టీంకి శ్రీముఖి లీడర్‌గా, బ్లూ టీంకి హిమజ లీడర్‌గా వ్యవహరించారు. ఇక రెండు రాజ్యాలకు బ్లూ, రెడ్ జెండాలు ఇచ్చి ఏ రాజ్యంలో ఎక్కువ జెండాలు ఉంటే వాళ్లే విజేతలని.. ఇక గేమ్‌లో ఉన్న గుడ్లను సాధించిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందంటూ గేమ్ మొదలు పెట్టించాడు బిగ్ బాస్.

ఇంకేముంది జెండాలు, గుడ్ల కోసం కంటెస్టెంట్లందరూ ఒకరి మీద ఒకరు పడి ఫైట్లు చేసుకున్నారు. ఇక ఈ గేమ్‌లో చాలామంది గాయాలు కాగా.. అందరూ సిల్లీగా తీసుకోవడంతో పెద్దగా రచ్చ జరగలేదు. ఇవన్నీ పక్కన పెడితే.. ఈ టాస్క్‌లో మెయిన్ యట్రాక్షన్‌గా మరోసారి వరుణ్ సందేశ్ నిలిచాడు.

గతంలో కెప్టెన్‌గా ఉన్న సమయంలో నమ్మదస్తుడిగా వ్యవహరించి అందరితోనూ గొడవ పడకుండా మెలిగిన వరుణ్.. నిన్నటి టాస్క్‌లో కూడా అలాగే బిహేవ్ చేసి బోల్తా పడ్డాడు. కొంతమంది కంటెస్టెంట్లు వరుణ్ దగ్గర సాఫ్ట్ గేమ్ ఆడి గుడ్డు దొంగలించారు. దీంతో పక్కనే ఉన్న అతడి భార్య వితిక అది చూసి.. ‘నువ్వు పెద్ద ఫ్రూట్‌వి గుడ్డు కూడా కాపాడుకోలేకపోయావు’ అంటూ పంచ్ వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *