Breaking News
  • కర్నూలు: సీఎం జగన్‌, ఎంపీ టీజీ వెంకటేష్‌ మధ్య ఆకసక్తికర చర్చ. మాకు రావాల్సిన హైకోర్టు ఎంతవరకు వచ్చిందన్న టీజీ వెంకటేష్‌. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు కేంద్రం అనుమతి కోరాం. నివేదిక కూడా పంపించామన్న సీఎం జగన్‌. త్వరలోనే సానుకూల ప్రకటన రావచ్చన్న టీజీ వెంకటేష్‌. హైకోర్టు ప్రకటనపై జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన టీజీ వెంకటేష్‌.
  • ప్రజలను కలిసేందుకు చంద్రబాబు వెళ్తుంటే పోలీసుల ఆంక్షలేంటి. చంద్రబాబు పర్యటనతో వైసీపీ ఉలిక్కి పడుతోంది-కూన రవికుమార్‌. మంత్రి బొత్స నోటిని అదుపులో పెట్టుకోవాలి-కూన రవికుమార్‌. విశాఖలో దళితుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారు. జగన్‌ను విశాఖ ప్రజలు తరిమికొట్టాలి-టీడీపీ నేత కూన రవికుమార్‌.
  • గోపన్‌పల్లి అక్రమ భూమ్యుటేషన్లపై విచారణకు ఆదేశం. విచారణాధికారిగా రాజేంద్రనగర్‌ ఆర్డీవో చంద్రకళ నియామకం. సర్వే నెంబర్‌ 127, 128లో రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి భూదందాపై.. విచారణ చేయనున్న రాజేంద్రనగర్‌ ఆర్డీవో చంద్రకళ. బాధితులను విచారణకు హాజరుకావాలని ఆదేశాలు. అక్రమ భూమ్యుటేషన్ల వ్యవహారంలో మరో ఇద్దరి పాత్ర. రిటైర్డ్ తహశీల్దార్లు సుబ్బారావు, రాజేశ్వర్‌రెడ్డి పాత్ర ఉన్నట్టు గుర్తింపు. ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి లేఖ రాసిన కలెక్టర్‌.
  • ఢిల్లీ: పూసాలో భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి వార్షిక సమావేశం. పాల్గొన్న కేంద్రమంత్రులు నరేంద్రసింగ్‌ తోమర్‌, పీయూష్‌గోయల్‌. తెలంగాణ నుంచి హాజరైన మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి 2019-20 వార్షిక నివేదిక విడుదల.
  • హైదరాబాద్‌: హిమాయత్‌నగర్‌లో సీపీఐ ఆధ్వర్యంలో ర్యాలీ. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ర్యాలీ. అడ్డుకున్న పోలీసులు, సీపీఐ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట. నారాయణ, చాడ వెంకట్‌రెడ్డిని అరెస్ట్‌. నారాయణగూడ పీఎస్‌కు తరలించిన పోలీసులు.

బిగ్‌బాస్3: నాగార్జునపై అప్పుడే మొదలైన విమర్శలు

Bigg Boss 3: Nagarjuna Akkineni, బిగ్‌బాస్3: నాగార్జునపై అప్పుడే మొదలైన విమర్శలు

తెలుగు బుల్లితెరపై సంచలనం రేపిన బిగ్‌‌బాస్ మూడో సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సీజన్‌కు హోస్ట్‌గా నాగార్జునను ఖరారు చేసేశారు నిర్వాహకులు. దానికి సంబంధించిన ప్రోమో కూడా ఇటీవలే విడుదలైంది. అయితే ఈ షో ఇంకా ప్రారంభం అవ్వకముందే నాగార్జునను ఓ ఆటాడేసుకుంటున్నారు నెటిజన్లు. దీనికి కారణం గతంలో ఆయన చేసిన కామెంట్లే.

అసలు విషయానికొస్తే.. గత ఏడాది ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాగార్జున బిగ్‌బాస్ షో గురించి స్పందించాడు. బిగ్‌బాస్ కాన్సెప్ట్ తనకు నచ్చలేదని, ఒకరు ఏం చూస్తున్నారో అని తొంగిచూడటం తనకు ఎప్పుడూ నచ్చదని పేర్కొన్నాడు. ఇక తాజాగా బిగ్‌బాస్ హోస్ట్‌గా చేయడంపై స్పందించిన నాగ్.. ‘‘ప్రయోగాలు చేయడానికి నేను ఎప్పుడు ముందుంటాను. బుల్లితెర నాకు కొత్త కానప్పటికీ.. బిగ్‌బాస్ చేయడం నాకు సరికొత్త అనుభూతి. ఇందులో భాగస్వామ్యం అయినందుకు నాకు చాలా ఎగ్జైటింగ్‌గా’’ ఉందని పేర్కొన్నారు. దీంతో పాత వీడియోను, కొత్త వీడియోను షేర్ చేస్తోన్న నెటిజన్లు..‘‘బిగ్‌బాస్ షోను చేసేందుకు ఇప్పుడు నాగార్జున గారు ఎందుకు ఒప్పుకున్నారో’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి దీనిపై ఆయన ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.

కాగా బిగ్‌బాస్ 3 ఈ నెల 21నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. మొత్తం 14మంది కంటెస్టెంట్‌లతో వంద రోజుల పాటు ఈ షోను నిర్వహించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ షోను అన్నపూర్ణ స్టూడియోలోనే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

Related Tags