ఏపీ పాలిటిక్స్ లోకి తమన్నా..

Political Mirchi: Bigg Boss-3 Contestant Tamanna Simhadri Entry in AP Politics?, ఏపీ పాలిటిక్స్ లోకి తమన్నా..

తమన్నా రాజకీయాల్లో వస్తున్నారనే ప్రచారం ఏపీ పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే తమన్నా అంటే హీరోయిన్ తమన్నా కాదు…తమన్నా సింహాద్రి…అయితే తమన్నా సింహాద్రికి రాజకీయాలు కొత్తేమి కాదు. ఏకంగా ఏపీ మాజీ సీఎం కొడుకు మీదే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అందరి ద్రుష్టిని ఆకర్షించింది.

ఇప్పడు బిగ్ బిస్ 3లో వైల్డ్ కార్డు ఎంట్రీతో మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చారు తమన్నా సింహాద్రి. అంతేకాదు ఈ సందర్భంగా చేసిన కామెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. పిక్చర్ ఔర్ బాకీ హై దోస్త్. ఈ డైలాగ్ కేవలం బిగ్ బాస్ 3కే పరిమితం కాదని దీని వెనక పొలిటికల్ యాంగిల్ ఉందనే టాక్ ఆనోటా ఈ నోటా వినపడుతోంది.

మొన్నటి ఎన్నికల నుంచే కాదు గతంలో విజయవాడలో వంగవీటి రాధా విగ్రహం విషయంలోనూ ఎంట్రీ ఇచ్చి పొలిటికల్ గా ప్రచారంలోకి వచ్చారు. ఇలాగే రాజకీయ అంశాల్లో తమన్నా ప్రస్తావన వస్తూనే ఉంది. ఇక మాజీ మంత్రి సింహాద్రి సత్యనారాయణకు దగ్గరి బంధువు కూడా. పాలిటిక్స్ మీద చాలా ఇంట్రెస్ట్ గా ఉన్న తమన్నా సింహాద్రి.. బిగ్ బాస్ షో తర్వాత ఓ రాజకీయ పార్టీలో చేరి ఫుల్ టైం పొలిటీషియన్ గా మారతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *