బిగ్ బాస్: రేటింగ్స్ పెంచుకోవడానికి ఎలిమినేషన్స్ తప్పవా.?

Bigg Boss 3: Are eliminations important for ratings?, బిగ్ బాస్: రేటింగ్స్ పెంచుకోవడానికి ఎలిమినేషన్స్ తప్పవా.?

మొదటి రెండు సీజన్ల మాదిరిగానే తెలుగు బిగ్ బాస్ మూడో సీజన్ కూడా సోసోగా రన్ అవుతోందని చెప్పవచ్చు. షో ఓపెనింగ్‌లో హ్యయస్ట్ టీఆర్పీ సంపాదించుకున్నా.. ప్రస్తుతం షో మునపటిలా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతోంది. ఇక ఎలిమినేషన్స్ విషయానికి వస్తే.. ఒక్కరోజు ముందుగానే సోషల్ మీడియాలో లీకవుతుండటంతో జనాల్లో షో పట్ల ఆసక్తి తగ్గుతోంది. సోమవారం ఎలిమినేషన్ ప్రాసెస్‌కు నామినేషన్స్ జరుగుతాయి. ఇక అక్కడ నుంచీ ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే దానిపై నెట్టింట్లో అదే హాట్ టాపిక్.

ఈ సీజన్ విషయానికి వస్తే.. షో స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఎక్కువ శాతం మొదటిసారి నామినేట్ అయినవారే ఎలిమినేట్ అవుతున్నారు. మొదటివారంలో హేమ నామినేట్ అవ్వగానే ఎలిమినేట్ అయింది. ఆ తర్వాత తమన్నా సింహాద్రి, రోహిణి, అషురెడ్డి, అలీ రెజా ఇలా అందరూ కూడా మొదటిసారే ఎలిమినేట్ అయ్యారు. అలాగే ఈ వారం కూడా వైల్డ్ కార్డు ఎంట్రీగా వచ్చిన శిల్పా చక్రవర్తి తన మొదటి ఎలిమినేషన్ నామినేషన్స్‌లోనే వెళ్లి పోయింది.

వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన మొదటివారం ఎవరూ ఆమెను నామినేట్ చెయ్యరు. ఇక రెండోవారం హౌస్‌లోని ఎక్కువమంది ఆమెను నామినేట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే శిల్పా ఎలిమినేషన్స్‌లోకి వచ్చిందో అప్పుడే ఆమె ఎగ్జిట్ కన్ఫర్మ్ అని చాలామంది భావించారు. అనుకున్నట్లుగానే ఆ సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తూ నాగార్జున నిన్నటి ఎపిసోడ్‌లో శిల్పా చక్రవర్తి ఎలిమినేటెడ్ అని ప్రకటించాడు.

గత రెండు సీజన్లను కూడా ఒకసారి పరిశీలిస్తే.. ఎవరైతే ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తారో వాళ్ళను హౌస్‌లో ఉంచి.. మిగిలిన వారిని ఎలిమినేట్ చేస్తున్నారని చెప్పవచ్చు. ఈ షో పూర్తి స్క్రిప్ట్‌డ్గా ప్రసారమవుతోంది ఇప్పటికీ సోషల్ మీడియాలో ఇదే టాక్ వినిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *