Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. 2 లక్షల 46 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 246628 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 120406 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 119293 దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 6929 కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • విజ్ఞన్ భవన్ లో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించే యోచన లో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. సామాజిక దూరంతో జూలైలో పార్లమెంటు సమావేశాలను నిర్వహించడానికి ఒక ఇది ఛాయిస్. కరోనావైరస్ కారణంగా ఎంపీలు ఢిల్లీ కి వెళ్లడానికి భయపడుతున్నట్లు సమాచారం. వర్చువల్ పార్లమెంట్ సమావేశాలు నిర్వహించే యోచన లో కేంద్రం.
  • ఢిల్లీ లో లిక్కర పై ఉన్న స్పెషల్ కరోనా ఫీజు'ను ఉపసంహరించుకోనున్నట్లు కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయం. మద్యంపై గరిష్ట రిటైల్ ధరలో 70% విధించిన స్పెషల్ కరోనా ఫీజు'ను ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకున్న ఢిల్లీ ప్రభుత్వం 2020 జూన్ 10 నుంచి అమల్లోకి రానుంది.
  • విశాఖ: లో రౌడీషీటర్ బర్త్ డే సెలబ్రేషన్స్. బౌన్సర్ లతో హల్చల్ చేసిన చిట్టిమాము గ్యాంగ్. పక్కా సమాచారంతో పార్టీ పై రైడ్ చేసిన సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు. రౌడీషీటర్ చిట్టిమాముతో పాటు పలువురు అరెస్ట్. భారీగా లిక్కర్,గంజాయి,లక్ష50వేలు నగదు స్వాధీనం. దువ్వాడ పోలీసులకు అప్పగించిన సిటీఎఫ్.
  • విజయవాడ: గ్యాంగ్ వార్ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు. డీసీపీ హర్షవర్ధన్ ఆధ్వర్యంలో విచారణ.. సందీప్ గ్యాంగ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు.. 13 మంది నిందితులను విచారిస్తున్న పోలీసులు.. ల్యాండ్ సెటిల్మెంట్ వివాదమే కారణమని గుర్తింపు.. ధనేకుల శ్రీధర్, ప్రతాప్ రెడ్డి డి నాగబాబులను విచారిస్తున్న పోలీసులు.. మంగళగిరి కి చెందిన ఇద్దరు రౌడిసీటర్ల ఉన్నట్టు గుర్తింపు.. టెక్నాలజీ సహాయంతో కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. నిందితుల పండు తల్లిని పాత్రపై విచారిస్తున్న పోలీసులు..
  • అమరావతి: ఈనెల 16 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం. 18న బడ్జెట్ ప్రవేశపెట్టే ఛాన్స్. కోవిడ్ నేపథ్యంలో 14 రోజులు జరగాల్సిన బడ్జెట్ సమావేశాలు కుదించే అవకాశం. ఈనెల 31తో ముగియనున్న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్.

బిగ్ బాస్: ఎలిమినేషన్‌లో శ్రీముఖి.. ఏం జరుగుతోంది..?

Bigg Boss Telugu3 Latest Episode Update, బిగ్ బాస్: ఎలిమినేషన్‌లో శ్రీముఖి.. ఏం జరుగుతోంది..?

నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 3 తెలుగు.. మొదటి నుంచి కాస్త ఎమోషన్‌గా, కొంచెం కామెడీగా సాగుతోంది. టాస్క్‌లు కూడా మొదటి రెండు సీజన్ల కంటే కాస్త వెరైటీగా ఉన్నాయి. ప్రస్తుతం ఫైనల్ కోసం పోటీ పడేందుకు ఏడుగురు మాత్రమే మిగిలారు. ఆదివారం నాటి ఎపిసోడ్‌లో మహేష్ విట్టా ఎలిమినేట్ కావడంతో శ్రీముఖి, శివజ్యోతి, వితికా, వరుణ్, రాహుల్, అలీ, బాబా భాస్కర్‌లు ఈ వారం బిగ్ బాస్ ఇంట్లో కొనసాగనున్నారు. కాగా, ఈరోజు ఎపిసోడ్‌‌కి సంబంధించిన ఓ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

13వ వారం నామినేషన్‌లో భాగంగా ఈ వారం బిగ్ బాస్ టాపర్ ఆఫ్ ది హౌస్ అనే టాస్క్ ఇచ్చారు. ఎవరి పొజీషన్ ఏంటో వారే తేల్చుకునేలా సెట్ చేశారు. గార్డెన్ ఏరియాలో వరుసగా నంబర్లు ఉన్న కడ్డీలను పెట్టి ఎవరు ఏ పొజిషన్‌లో ఉన్నారో వారినే తేల్చుకోమని చెప్పారు. దీంతో మొదటి ప్లేస్‌లో బాబా బాస్కర్ నిలబడగా.. చివరి ప్లేస్‌లో శ్రీముఖి నిలబడింది. మధ్యలో రాహుల్, వరుణ్, అలీ, శివజ్యోతి, వితికా వరుసగా నెంబర్లను ఎంపిక చేసుకున్నారు. అయితే తనకంటే వితికా బెటర్ కంటెస్టెంట్ అంటూ.. తన పొజిషన్‌ను ఆమెకు ఇవ్వడంతో.. శివజ్యోతి నో చెప్పింది. అందరూ డిఫెండ్ చేస్తేనే.. బెటాలియన్ ఫైనల్ వరకు వితిక వెళ్లిందని.. తానేమి బెటర్ కంటెస్టెంట్ కాదని కాసేపు శివజ్యోతి వాదించింది. ఇక ప్రతి టాస్క్‌లో లాగే రాహుల్, శ్రీముఖిలు ఇక్కడ కూడా ఫైట్ చేసుకున్నట్లు ప్రోమోలో తెలుస్తోంది. టాస్క్‌లో చివరి పొజిషన్‌లో ఉన్న శ్రీముఖి నిజంగానే ఎలిమినేట్ కానుందా..? తెలుసుకోవాలంటే ఈ వారం చివరి వరకూ ఆగాల్సిందే..

Related Tags