Breaking News
  • సచివాలయంలోని పశుసంవర్ధక శాఖ లో పనిచేస్తున్న సెక్షన్ అఫిసర్ కు కరోనా పాజిటివ్ గుర్తింపు.. ఇటీవల ఢిల్లీ వెళ్లాడని తెలిసి కరోనా టెస్టులు... టెస్టు చేసిన అనంతరం పాజిటివ్ గా వచ్చినట్లు గుర్తింపు.. గాంధీ ఆస్పత్రి కి తరలించిన అధికారులు.. బిఆర్కే భవనం మొత్తం షానిటైజేషన్ చేస్తున్న అధికారులు.
  • మర్కజ్ ఘటనపై వివరాలు సేకరించిన కేంద్ర హోంశాఖ. దేశంలోని వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి తబ్లీజ్ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇండోనేషియా, మలేషియా, థాయ్ లాండ్, నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, కజకిస్తాన్ నుంచి ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
  • దేశవ్యాప్తంగా మొత్తం 1418 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు. ఈ రోజే 167 పాజిటివ్ కేసులు నమోదు. దేశ వ్యాప్తంగా కరోనా తో 45 మంది మృతి. ఈ ఒక్క రోజే 13 మంది కరోనా తో మృతి చెందినట్లు వెల్లడి. కరోనా నుంచి 123 మంది డిశ్చార్జి. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిత్వ శాఖ.
  • ఉక్రెయిన్​లో చిక్కుకున్న 300 మంది తెలుగు విద్యార్థులు. తిండి లేక ఆకలితోనే గడుపుతున్న విద్యార్థులు. చేతిలో చిల్లి గవ్వ లేక ఎన్నో ఇబ్బందులు. కరోనా రక్కసి మింగేస్తుందేమోననే భయంతో బిక్కుబిక్కుమంటున్న విద్యార్థులు.
  • తెలంగాణ లో ఇప్పటి వరకు 97 కేసులు నమోదు. ప్రస్తుతం 77 మంది వివిధ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితులు. ఈ ఒక్క రోజు 15 పాజిటివ్ కేసులు నమోదు. 14 మంది డిశ్చార్జ్,6 మృతి...

Bigg Boss : రిజల్ట్‌పై గరంగరం.. బిగ్ బాస్-14కు సల్మాన్ గుడ్ బై..!

Bigg Boss 14 : Unhappy With Results Salman Khan Decides To Step Down From Bigg Boss, Bigg Boss : రిజల్ట్‌పై గరంగరం.. బిగ్ బాస్-14కు సల్మాన్ గుడ్ బై..!

Bigg Boss 14 :  సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన రియాలిటీ షో బిగ్ బాస్ 13 ముగిసింది. అనుకున్నట్లుగానే సిద్ధార్థ్ శుక్లా విజేతగా నిలిచారు. అయితే అతడికి అనుకూలంగా కొన్నాళ్లుగా ఛానెల్‌ యాజమాన్యం పక్షపాతంతో వ్యవహరించిందని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై సల్మాన్ కూడా అసహనం వ్యక్తం చేసినట్టు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా వీకెండ్ కా వార్ ఎపిసోడ్ల సమయంలో శుక్లా పక్షాన ఛానెల్ వకాల్తా పుచ్చుకుందా అని సల్మాన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. తాజాగా అందుతోన్న రిపోర్ట్స్ ప్రకారం ఈ సీజన్ విజేతను ప్రకటించే సమయంలో..ఛానెల్ సిద్దార్థ్ శుక్లాను రిఫర్ చేయడంతో..సల్లూ భాయ్ కోపంతో ఊగిపోయారట. అందుకే విజేత ప్రకటన ఆలస్యమయి..అర్థరాత్రి అనౌన్స్ చేయాల్సి వచ్చిందని బాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇకపై షోకు హోస్టుగా పనిచేయనని తేల్చి చెప్పాడట. ఈ వార్తలు కొత్త కాకపోయినప్పటికి..ఈ సీజన్‌ సల్మాన్‌పై కాస్తంత ప్రతికూలత చూపిందన్న మాట మాత్రం వాస్తవం. కానీ ఈ ఏడాది షో 5 వారాలు పొడిగింపబడింది అంటేనే అర్థం చేసుకోవచ్చు.. ఏ రేంజ్‌లో హిట్ అయ్యిందో. 

బిగ్ బాస్-13 లో సిద్దార్థ్ శుక్లా విజేతగా నిలవగా, అసిమ్ రెండవ స్థానంతో సరిపెట్టుకున్నాడు. షెహ్నాజ్ గిల్ మూడవ స్థానంలో ఉండగా… రాషమి దేశాయ్, ఆర్తి సింగ్ నాల్గవ స్థానంలో నిలిచారు. పరాస్ ఛబ్రా 10 లక్షల మనీ బ్యాగ్‌తో షో నుండి బయటకు వెళ్లి ఆరో స్థానంలో నిలిచాడు. బిగ్ బాస్ 13 అక్టోబర్ 2019 లో ప్రారంభమై.. ఫిబ్రవరి మధ్యలో ముగిసింది.  షోను మరో రెండు వారాల పాటు పొడిగించాలనుకున్నప్పటికి, సల్మాన్ డేట్స్  అందుబాటులో లేకపోవడంతో మేనేజ్‌మెంట్ ఆ నిర్ణయాన్ని విరమించుకుంది. 

Related Tags