బిగ్ బాస్‌లో రొమాన్స్ పర్వం… బెడ్ రూమ్ నుంచి పూల్ దాకా…

సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న హిందీ బిగ్ బాస్ సీజన్ 13 రసవత్తరంగా సాగుతోంది. కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం, గొడవలతో ఈ వారం హాట్‌హాట్‌గా జరుగుతోంది. ఇక ఈ గొడవలన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టాలని చెబుతూ సల్లూభాయ్ హౌస్‌మేట్స్ అందరికి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే ఈ వారం ఎలిమినేషన్స్‌లో భాగంగా శేఫాలి, హిందుస్తానీ బహు, విశాల్‌‌లు నామినేట్ అయ్యారు. ఈ క్రమంలోనే మరోసారి కంటెస్టెంట్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక అంతలోనే బిగ్ […]

బిగ్ బాస్‌లో రొమాన్స్ పర్వం... బెడ్ రూమ్ నుంచి పూల్ దాకా...
Follow us

|

Updated on: Nov 27, 2019 | 5:00 PM

సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న హిందీ బిగ్ బాస్ సీజన్ 13 రసవత్తరంగా సాగుతోంది. కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం, గొడవలతో ఈ వారం హాట్‌హాట్‌గా జరుగుతోంది. ఇక ఈ గొడవలన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టాలని చెబుతూ సల్లూభాయ్ హౌస్‌మేట్స్ అందరికి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే ఈ వారం ఎలిమినేషన్స్‌లో భాగంగా శేఫాలి, హిందుస్తానీ బహు, విశాల్‌‌లు నామినేట్ అయ్యారు. ఈ క్రమంలోనే మరోసారి కంటెస్టెంట్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక అంతలోనే బిగ్ బాస్.. హౌస్ వాతావరణాన్ని కూల్ చేస్తూ.. హౌస్‌మేట్స్‌కు ఇంటరెస్టింగ్ టాస్క్ ఇచ్చాడు.

కంటెస్టెంట్ల నుంచి నలుగురిని రెండు జంటలుగా ఎంపిక చేసిన బిగ్ బాస్.. వారిని డైరెక్ట్ చేయడానికి ఇద్దరు దర్శకులను కూడా నియమించాడు. సిద్ధార్థ్ శుక్లా, రష్మీ దేశాయ్‌లు ఒక జంట కాగా.. మహీరా శర్మ, విశాల్‌‌లు మరో జంటగా ఎంపికయ్యారు. కాగా, ఈ రెండు జంటలకు షెహనాజ్ గిల్, పరాస్ చాబ్రాలు డైరెక్టర్లు.

‘దిల్ సే దిల్ తక్’ అనే సీరియల్‌లో ఉన్న రొమాంటిక్ సీన్స్‌ను రీ-క్రియేట్ చేయాలంటూ ఈ రెండు జంటలకు బిగ్ బాస్ సూచనలు ఇచ్చాడు. ఇంకేముంది బెడ్ రూమ్ నుంచి.. స్విమ్మింగ్ పూల్ వరకు ఆ జంటలు తమ రొమాన్స్‌తో ఫ్యాన్స్ గుండెల్లో గుబులు పుట్టించారని చెప్పాలి. ఏది ఏమైనా ఇన్నాళ్ళకు బిగ్ బాస్ హౌస్ లో ఒక రొమాంటిక్ వాతావరణం కనిపించడం గొప్ప విశేషమనే చెప్పాలి.