బిగ్ బాస్: టఫ్ ఎలిమినేషన్ వార్‌.. మంచోడికే ఎగ్జిట్ డోర్?

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో 9 మంది సభ్యులు మిగిలారు. ఆదివారం హిమజ ఎలిమినేట్ కావడం..  ఫేక్ ఎలిమినేషన్ ద్వారా ఎగ్జిట్ అయిన రాహుల్ మళ్ళీ తిరిగి ఇంట్లోకి రావడం జరిగింది. ఇక ఈ తొమ్మిది మంది మధ్య సోమవారం ఎలిమినేషన్ ప్రక్రియ రసవత్తరంగా సాగింది. 10వ వారం నామినేషన్స్‌లో భాగంగా కెప్టెన్ మహేష్ విట్టా మినహా మిగిలిన ఇంటి సభ్యులు జంటలుగా విభజించారు. శివజ్యోతి-శ్రీముఖి – రవి-వితికా – వరుణ్-రాహుల్ – బాబా భాస్కర్-పునర్నవిలని జంటలుగా […]

బిగ్ బాస్: టఫ్ ఎలిమినేషన్ వార్‌.. మంచోడికే ఎగ్జిట్ డోర్?
Follow us

|

Updated on: Sep 24, 2019 | 1:01 PM

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో 9 మంది సభ్యులు మిగిలారు. ఆదివారం హిమజ ఎలిమినేట్ కావడం..  ఫేక్ ఎలిమినేషన్ ద్వారా ఎగ్జిట్ అయిన రాహుల్ మళ్ళీ తిరిగి ఇంట్లోకి రావడం జరిగింది. ఇక ఈ తొమ్మిది మంది మధ్య సోమవారం ఎలిమినేషన్ ప్రక్రియ రసవత్తరంగా సాగింది. 10వ వారం నామినేషన్స్‌లో భాగంగా కెప్టెన్ మహేష్ విట్టా మినహా మిగిలిన ఇంటి సభ్యులు జంటలుగా విభజించారు. శివజ్యోతి-శ్రీముఖి – రవి-వితికా – వరుణ్-రాహుల్ – బాబా భాస్కర్-పునర్నవిలని జంటలుగా పెట్టి…వారిలో ఎవరికి ఇంట్లో ఉండటానికి అర్హతలు ఉన్నాయో – గేమ్ ఎవరు బాగా ఆడుతున్నారో వాదించుకోవాలని బిగ్ బాస్ ఫిట్టింగ్ పెట్టాడు.

దీనితో జంటలు ఒక్కొక్కరిగా రంగంలోకి దిగి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నారు. మొదటగా శివజ్యోతి-శ్రీముఖిలు మొదలుపెట్టగా.. ఇంట్లో ఉన్న మిగతా సభ్యుల ఓట్లు ఎక్కువగా జ్యోతికి రావడంతో.. శ్రీముఖి ఎలిమినేషన్‌ లోకి వెళ్ళింది. అనంతరం వితికా-రవిలా మధ్య నామినేషన్స్ వార్ జరగ్గా.. హౌస్‌మేట్స్ ఓట్లు ఎక్కువ శాతం వితికాను వరించగా ఆమె సేవ్ అయ్యి.. రవికృష్ణ ఎలిమినేషన్‌లోకి వెళ్ళాడు.

ఇక మూడో జోడిగా వచ్చిన రాహుల్-వరుణ్‌లు ఎక్కువగా వాగ్వాదానికి దిగలేదు. కూల్‌గా ఇద్దరూ చర్చించుకున్నారు. అయితే చివరికి రాహుల్‌కి ఎక్కువ ఓటింగ్ నమోదు కావడంతో.. వరుణ్ నామినేషన్‌కు వెళ్ళాడు. చివరిగా వచ్చిన పునర్నవి- బాబా భాస్కర్‌‌‌‌ల జోడి మధ్య మాత్రం చర్చ వాడీవేడిగా జరిగింది. బాబా గేమ్ ఆడటం లేదని.. కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రం చేస్తున్నారని పునర్నవి కామెంట్స్ చేయగా.. బాబా భాస్కర్ మాత్రం కూల్‌గా పున్నుకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. అయితే ఆ తర్వాత ఓటింగ్‌లో పునర్నవికి నాలుగు ఓట్లు.. బాబాకు మూడు ఓట్లు రావడంతో.. బాబా భాస్కర్ ఎలిమినేషన్ జోన్‌కు వెళ్లారు.

చివరికి పదో వారం ఎలిమినేషన్ జోన్‌లో దాదాపు అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఉండటం గమనార్హం. శ్రీముఖి – రవి – వరుణ్ – బాబా భాస్కర్‌లు నామినేట్ అవ్వగా.. వీరందరికి బయట ఫాలోయింగ్ విపరీతంగా ఉందని చెప్పవచ్చు. అందువల్ల ఈ వారం ఎలిమినేషన్ ఓటింగ్ టఫ్‌గా జరిగే అవకాశం ఉంది. ఇకపోతే ప్రస్తుతం ఓటింగ్ బట్టి చూస్తుంటే మంచోడు రవికృష్ణకు అందరి కంటే తక్కువ ఓటింగ్ శాతం నమోదైనట్లు తెలుస్తోంది. అయితే ఇంకా ఒక్క రోజు మాత్రమే గడవడంతో.. వీకెండ్ వచ్చేసరికి ఏ పరిణామమైన జరగొచ్చని ప్రేక్షకులు భావిస్తున్నారు.

CSKకు భారీ ఎదురు దెబ్బ.. సీజన్ మొత్తానికి దూరమైన స్టార్ ప్లేయర్
CSKకు భారీ ఎదురు దెబ్బ.. సీజన్ మొత్తానికి దూరమైన స్టార్ ప్లేయర్
'14ఏళ్లు సీఎంగా చంద్రబాబు బందరుకు ఏం చేశారు'.. పేర్ని నాని
'14ఏళ్లు సీఎంగా చంద్రబాబు బందరుకు ఏం చేశారు'.. పేర్ని నాని
వేసవి ఉపశమనం కోసం వంటించి చిట్కాలు.. ఈ సూపర్ డ్రింక్స్ మీ కోసం..
వేసవి ఉపశమనం కోసం వంటించి చిట్కాలు.. ఈ సూపర్ డ్రింక్స్ మీ కోసం..
నిన్ను నా సినిమాలోకి తీసుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నా..
నిన్ను నా సినిమాలోకి తీసుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నా..
ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం ఈ పండు.. ఉదయాన్నే తింటే ఇక నో టెన్షన్..
ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం ఈ పండు.. ఉదయాన్నే తింటే ఇక నో టెన్షన్..
భారత పర్యటనకు ముందు ఎలాన్ మస్క్‌కు బిగ్ షాక్..
భారత పర్యటనకు ముందు ఎలాన్ మస్క్‌కు బిగ్ షాక్..
తన ఇంట్లో చొరబడ్డ దొంగలకు డబ్బు సాయం చేసిన టాలీవుడ్ యాక్టర్
తన ఇంట్లో చొరబడ్డ దొంగలకు డబ్బు సాయం చేసిన టాలీవుడ్ యాక్టర్
మాట నిలబెట్టుకున్నలారెన్స్.. దివ్యాంగులకు ఇళ్లు, బైక్స్ .. వీడియో
మాట నిలబెట్టుకున్నలారెన్స్.. దివ్యాంగులకు ఇళ్లు, బైక్స్ .. వీడియో
ప్రభాస్‏ను కాపీ కొట్టిన హీరోయిన్.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే...
ప్రభాస్‏ను కాపీ కొట్టిన హీరోయిన్.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే...
సక్సెస్‌కు చిరునామా ఈ అంధుడే.. ప్రపంచాన్ని శాసిస్తున్న శ్రీకాంత్
సక్సెస్‌కు చిరునామా ఈ అంధుడే.. ప్రపంచాన్ని శాసిస్తున్న శ్రీకాంత్