Breaking News
  • భద్రాద్రి: పాల్వంచ, బూర్గంపాడు మండలాల్లో భూప్రకంపనలు. టీచర్స్‌కాలనీ, బొడ్డుగూడెం, గట్టాయిగూడెం కాలనీల్లో భూప్రకంపనలు. అంజనాపురం, లక్ష్మీపురం, టేకులచెరువులో భూప్రకంపనలు. భయాందోళనలో స్థానికులు.
  • హైదరాబాద్‌: నగరంలో మంత్రి తలసాని పర్యటన. నిర్విరామంగా విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు.. పోలీసులు, వైద్య సిబ్బందికి గులాబీ పూలు ఇచ్చి అభినందించిన తలసాని. ఎనర్జీ డ్రింక్‌, మంచినీళ్లు, శానిటైజర్లు అందజేసిన మంత్రి తలసాని. రోడ్లపైనే విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని కలుసుకుంటూ.. హైదరాబాద్‌లో పర్యటిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.
  • కరోనా వైరస్‌ను ఏపీ ప్రభుత్వం లైట్‌గా తీసుకుంటుంది. విపత్తు సాయం, నిత్యావసర సరుకుల పంపిణీని.. రాజకీయ ప్రచారం కోసం వాడుకుంటున్నారు-విష్ణువర్ధన్‌రెడ్డి. వైసీపీ నేతలకు సహకరిస్తున్న అధికారులను తొలగించాలి. ఏపీలో కరోనా కేసులు పెరగడానికి కారణం అంజాద్‌బాషా, ముస్తాఫానే. తక్షణమే అంజాద్‌బాషా తన పదవికి రాజీనామా చేయాలి -ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి.c
  • కరోనాపై మనమంతా కలిసికట్టుగా పోరాటాన్ని కొనసాగిద్దాం. రా.9 గంటలకు దీపాలు వెలిగించి కరోనా చీకట్లను పారద్రోలడంతో పాటు.. భారతీయులమంతా ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేస్తున్నామని చాటిచెబుదాం. ఈ ప్రయత్నం ద్వారా కరోనాపై పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్న.. వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బందికి సంఘీభావాన్ని తెలుపుదాం. వ్యక్తిగత శుభ్రత, సామాజిక దూరాన్ని పాటిస్తూ.. కరోనాపై పోరాటాన్ని ఇదే స్ఫూర్తితో కొనసాగిద్దాం -ట్విట్టర్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • రైతు చెంతకే వెళ్లి ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం-కన్నబాబు. గ్రామ సచివాలయ వాలంటీర్లకు సమాచారం ఇస్తే.. ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేస్తాం-మంత్రి కన్నబాబు. టమోటా, అరటిని మార్కెటింగ్‌ ద్వారా కొనుగోలు చేస్తున్నాం. ధర పడిపోయిన చోట్ల ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. మామిడి ధరలు పడిపోకుండా చూడాలని అధికారులను ఆదేశించాం. పంట దిగుబడుల క్యాలెండర్‌ను రూపొందిస్తున్నాం-మంత్రి కన్నబాబు. టీడీపీ నేతలు కరోనాను కూడా రాజయకీయంగా వాడుకుంటున్నారు. ఇప్పటికైనా చౌకబారు విమర్శలు మానుకోండి-మంత్రి కన్నబాబు.

బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్.. ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిచాడంటే.?

Bigg Boss 3 Telugu Winner Rahul Sipligunj, బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్.. ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిచాడంటే.?

బుల్లితెర సెన్సేషనల్ షో బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్‌ను రాహుల్ సిప్లిగంజ్ గెలుచుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా రూ.50 లక్షల నగదు బహుమతి, ట్రోఫీని అందుకున్నాడు. 105 రోజుల పాటు సాగిన ఈ బిగ్ బాస్ ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంది. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలవగా.. యాంకర్ శ్రీముఖి రన్నరప్‌గా నిలిచింది.

మొదటి నుంచి అంచనాలు లేకుండా షోలోకి అడుగుపెట్టిన రాహుల్.. మెల్లిగా ప్రేక్షకులకు దగ్గరవుతూ ఫైనల్ వరకు చేరాడు. జూలై 21న ప్రారంభమైన ఈ షోలో రాహుల్‌ సిప్లిగంజ్‌, శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్‌, అలీ రెజా, శివజ్యోతి, వితిక, మహేశ్‌ విట్టా, పునర్నవి భూపాలం, రవి కృష్ణ, హిమజ, శిల్పా చక్రవర్తి, అషురెడ్డి, రోహిణి, తమన్నా సింహాద్రి, జాఫర్‌, హేమలు కంటెస్టెంట్లుగా హౌస్ ‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వీళ్ళలో రాహుల్‌, శ్రీముఖి, బాబా భాస్కర్‌, వరుణ్‌ సందేశ్‌, అలీ రెజాలు ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. కాగా, చివరికి అత్యధిక ఓట్ల మెజార్టీతో రాహుల్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. రాహుల్‌కి అత్యధికంగా 35 శాతం ఓటింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. శ్రీముఖికి 28 శాతం, బాబా భాస్కర్‌కు 20%, వరుణ్ సందేశ్‌కు 10%, అలీ రెజాకు 7% ఓటింగ్ వచ్చినట్లుగా సమాచారం.

Related Tags