Breaking News
  • అమరావతి: చంద్రబాబు నివాసంలో సీనియర్‌ నేతల అత్యవసర భేటీ. టీవీ9 బిగ్ డిబేట్‌లో వల్లభనేని వంశీ వ్యాఖ్యలపై చర్చ. ముఖ్య నేతలు పార్టీ వీడతారనే ప్రచారంపై పార్టీలో కలకలం. తాజా రాజకీయ పరిణామాలపై చర్చ. అనంతరం టీడీపీ ఎంపీలతో భేటీకానున్న చంద్రబాబు. పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ.
  • మహారాష్ట్రలో మారుతున్న రాజకీయ పరిణామాలు. రాష్ట్రపతి పాలనకు తెరపడే అవకాశం. శివసేన, కాంగ్రెస్‌ల మధ్య కుదిరిన సయోధ్య. శివసేనకు పూర్తికాలం సీఎం పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్‌ అంగీకారం. కాంగ్రెస్‌, ఎన్సీపీకి డిప్యూటీ సీఎంతో పాటు 50 శాతం మంత్రి పదవులు. కాసేపట్లో సోనియా, పవార్‌ కీలక భేటీ.
  • తాజా రాజకీయ పరిణామాలపై చర్చ. అనంతరం టీడీపీ ఎంపీలతో భేటీకానున్న చంద్రబాబు. పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ.
  • అమరావతి: మంగళగిరిలోని చిల్లపల్లి కల్యాణమండపం చేరుకున్న పవన్‌. డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు ప్రారంభించిన పవన్‌ కల్యాణ్‌. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు. భవన నిర్మాణ కార్మికుల ఆకలి ప్రభుత్వానికి తెలిపేందుకే ఈ కార్యక్రమం. తక్షణమే భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలి-పవన్‌ కల్యాణ్‌.
  • గుంటూరు: రొంపిచెర్ల (మం) రామిరెడ్డిపాలెం సర్పంచ్‌ ఆత్మహత్యాయత్నం. ఓ కేసులో ఊరు విడిచి వెళ్లిన సర్పంచ్‌ కోటిరెడ్డి. పోలీసులు అరెస్ట్‌ చేయడంతో పీఎస్‌లో ఆత్మహత్యాయత్నం. నర్సరావుపేట ఆస్పత్రికి తరలింపు.
  • తిరుపతి: చంద్రగిరి లక్ష్మీపురం చెరువు దగ్గర టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు. 45 ఎర్రచందనం దుంగలు స్వాధీనం. తమిళనాడుకు చెందిన ఇద్దరు స్మగ్లర్ల అరెస్ట్‌.
  • సంగారెడ్డి జిల్లాలో నేడు మంత్రి హరీష్‌రావు పర్యటన. ఆందోల్‌ నియోజకవర్గంలో పలు అభివృద్ధికార్యక్రమాలు. సింగూరులో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను ప్రారంభించనున్న హరీష్‌రావు. మంత్రి హరీష్‌రావుతో పాటు పాల్గొననున్న ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌.

బాబు ఇంటి చుట్టూ వరద రాజకీయం

Big Story: Rising Krishna Floods Former CM Chandrababu house, Tension In Political Circle

అమరావతిలో కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది. ముంపు ప్రాంతాల వాసులు భయంతో వణికిపోతున్నారు. వరద ఉధృతి పెరగడంతో.. ముప్పును ఎదర్కొక తప్పదనే భయంతో కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి ఇప్పటికే నీళ్లను వదులుతున్నారు. దీంతో దివిసీమాలో గంటగంటకు వరద ఉదృతి పెరుగుతోంది. పులిగడ్డ అక్విడేట్‌ వద్ద ఇప్పటికే వరద నీరు 18 అడుగులకు చేరుకుంది. పరిస్థతి ప్రమాదకరంగా మారడంతో అక్విడెక్ట్‌ పై రాకపోకలను అధికారులు నిలిపేశారు. ఇప్పటికే అధికారులు లోతట్టు ప్రాంతాల వారిని అలెర్ట్‌ చేశారు. కృష్ణా నదిలో మరింత వరద పెరగుతోంది. పదేళ్ల తర్వాత కృష్ణా నదిలో వరద ఉధృతి కనిపిస్తుండటంతో నీళ్లను చూడటానికి జనం భారీ ఎత్తున తరలి వస్తున్నారు.

ఇదిలా వుంటే.. కరకట్టను కృషానీరు తాకింది. కరకట్ట సమీపంలోని ఇళ్లు, పంటపొలాలు, అరటి తోటల్లోకి వరద నీరు చేరింది. దీంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. కరకట్ట వద్ద చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్‌ ఇంటి మెట్ల దగ్గరకు వరద నీరు చేసింది. గుంటూరు కలెక్టర్‌ చంద్రబాబు గెస్ట్ హౌస్‌ను పరిశీలించారు. వరద ఉధృతిని రెవెన్యూ అధికారులతో కలిసి అంచనా వేశారు. మరోవైపు వరద ఉధృతి కారణంగా అమరావతి, క్రోసూరు, అచ్చంపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

మరోవైపు కృష్ణావరదపై మాజీ మంత్రి దేవినేని ఉమ సంచలన కామెంట్లు చేశారు. ఇది ప్రభుత్వం కావాలని సృష్టించిన వరద అని.. ఒక ప్రణాళిక లేకుండా నీటి విడుదల చేయడం వలనే వరద ఉధృతి ఈ స్థాయిలో పెరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నివాసం, రాజధాని రైతుల భూములను ముంచాలనే ప్రభుత్వం ఈ ఆలోచన చేస్తోందని ఆయన ఆరోపించారు. రాజధాని కడపకు తరలించుకుపోవాలని సీఎం జగన్ కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. గతంలో 11 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినప్పుడే ఎలాంటి నష్టం జరగలేదని.. ఇప్పుడు 7 లక్షల క్యూసెక్కులకే విజయవాడ పరిసర ప్రాంతాలను ముంచేసిందని దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి కృష్ణానది వరద ప్రభావం రాజకీయ నేతలపై పడింది.