Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 82 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 182143. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 89995. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 86984. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 5164. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • ఆదిలాబాద్: తెలంగాణ పై మిడతల ప్రభావం లేదు. రైతులు అందోళన చెందాల్సిన అవసరం లేదు. మిడుతలు దిశను‌ మార్చుకున్నాయి. తెలంగాణలో మిడతల వచ్చాయనే ప్రచారం అబద్ధం. మిడుతల వల్ల తెలంగాణ కు ముప్పు లేదు. మిడతలు దాడి చేస్తే ఎదుర్కోవడానికి సర్వసన్నద్దంగా ఉన్నాం. రైతులు భయబ్రాంతులు గురయ్యేలా, నష్టపోయేల అసత్య వార్తలు రాయవద్దని కోరుతున్నాం. మహారాష్ట్ర లో ఉ‌న్న మిడతలు తెలంగాణ లో ఉన్నట్లుగా చూపుతున్నారు ఇది అబద్దం.. రైతులు నమ్మవద్దని కోరుతున్నాం. - రెహ్మన్, సునిత శాస్త్రవేత్తలు మిడుతల పై సర్కార్ నియమించిన హైపవర్ కమీటి సభ్యులు
  • చిత్తూరు జిల్లా : ఆంధ్ర తమిళనాడు సరిహద్దుల్లో మిడతల దండు. అయితే ఇవి మహారాష్ట్రనుంచి వచ్చిన మిడతల దండు కాదంటున్న అధికారులు. కుప్పం సరిహద్దులోని తమిళనాడు వేపనపల్లి లో ప్రత్యక్షమైన మిడతల దండు. రాత్రికి రాత్రే పంటలు నాశనం చేస్తున్న మిడతలు. పచ్చగా కనిపించిన ప్రతి చెట్టుని తినేస్తున్న మిడతలు. అరటి చెట్లను వదలని మిడతలు. రంగంలోకి దిగిన అధికారులు..మిడతల పై ఫెర్టిలైజర్స్ చల్లి తరిమి కొట్టే ప్రయత్నం.
  • విశాఖ: మావొయిస్ట్ ఈస్ట్ డివిజన్ కార్యదర్శి అరుణ పేరుతో లేఖ విడుదల. మావోయిస్టులపై పోలీసులు దుశ్ప్రచారం అపాలి. మన్యంలో మావోయిస్టులు కరోనా వ్యాపిస్తున్నారని పోలీసులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కూంబింగ్ పేరుతో గిరిజన గూడేల్లో భయాందోళనలకు గురిచేస్తున్నారు. మన్యంలో ఈపీడీసీఎల్ అధికారులు అవినీతికి పాల్ఫడుతున్నారు. పెదబయలు ఏఈ సోమరాజు, పాడేరు ఏడీఈ భాస్కరరావు అవినీతిపై విచారణ జరపాలి. ఉద్యోగాలు పేరుతో తీసుకున్న లంచాలను తిరిగి వసూళ్ళు చేయాలి. లేఖలో పేర్కొన్న మావోయిస్టులు.
  • రుతుపవనాలు ఇంకా కేరళ తీరానికి తాకలేదు. దీని పై మేము క్రమం తప్పకుండా మానిటరింగ్ చేస్తున్నాం. జూన్ 1 నుండి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని అనుకుంటున్నాం. ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్ సమీపంలో ఈ రోజు అల్ప పీడనం ఏర్పడింది. జూన్ 2 కి తుఫానుగా మారుతుందని మేము అనుకుంటున్నాం. జూన్ 3 సాయంత్రం నాటికి గుజరాత్ ,ఉత్తర మహారాష్ట్ర తీరం వైపుకు చేరుకుంటుంది. మృత్యుంజయ్ మోహపాత్రా, ఢిల్లీ IMD.
  • జమ్మూ కాశ్మీర్‌లో సీనియర్ ఐఎఎస్ అధికారి కి కరోనా పాజిటివ్‌. ఆయనతో పాటు సమావేశానికి హాజరైన పలువురు అధికారులు,వైద్యులను హోమ్ క్వారంటైన్ లో వెళ్లాలని సూచన.
  • మొబైల్ సేవల కోసం 11 అంకెల నంబరింగ్ ప్లాన్‌ను ట్రాయ్ సిఫారసు చేసినట్లు కొన్ని మీడియా సంస్థల లో వార్తలు వచ్చాయి. TRAI సిఫారసు ప్రకారం,దేశం లో 10-అంకెల నెంబర్ కొనసాగుతుంది. మేము 11-అంకెల నంబరింగ్ ప్లాన్‌కు మార్చడాన్ని ఖండిస్తున్నాం. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా.

‘మహా’లో కమల వికాసం.. ‘అందనిద్రాక్ష’గా హర్యానా !

Analysis on election results 2019, ‘మహా’లో కమల వికాసం.. ‘అందనిద్రాక్ష’గా హర్యానా !

ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యాయి. టైమ్స్ నౌ, ఎన్డీటీవీ, ఇండియా టుడే-యాక్సిస్-మై ఇండియా, న్యూస్-18, ఏబీపీ న్యూస్ సీ ఓటర్ వంటి మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ గురువారం నాటి ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కనిపించాయి. కాకపోతే సహజంగానే కొన్ని చోట్ల కాస్త ‘ తడబడినట్టు ‘ కనిపిస్తుంది. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో బీజేపీ హవా స్పష్టంగా కనిపించింది. దాదాపు కంప్లీట్ స్వీప్ అన్నా ఆశ్చర్యం లేదు. ఈ రాష్ట్రంలో 288 సీట్లకు గాను బీజేపీ-శివసేన కూటమిదే పైచేయి అవుతుందని, ఈ కూటమికి 230 సీట్లు, కాంగ్రెస్-ఎన్సీపీ కూటమికి 48 స్థానాలు లభిస్తాయని టైమ్స్ నౌ ‘ ప్రిడిక్ట్ చేసింది. న్యూస్-18 ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. బీజేపీ-శివసేన అలయెన్స్ 243 సీట్లను, , కాంగ్రెస్-ఎన్సీపీ 41 స్థానాలు దక్కించుకుంటాయని ‘ అంచనా. అలాగే.. కాషాయ కూటమికి 166 నుంచి 194 వరకు, కాంగ్రెస్-ఎన్సీపీ కూటమికి 72 నుంచి 90 స్థానాలు లభిస్తాయని ఇండియా-టుడే-యాక్సిస్ మై జోస్యం చెప్పింది. హర్యానాలో 90 సీట్లకు గాను బీజేపీ 69, కాంగ్రెస్ కేవలం 11 స్థానాలను గెలుచుకుంటాయని ని ఇదే మీడియా అంచనా వేసింది.

అయితే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరీ దిగజారిపోతుందని ఏబీపీ న్యూస్ సీ ఓటర్ సర్వే పేర్కొంది. మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వానికి ఢోకా లేదని, ఈ రాష్ట్రంలో బీజేపీ 72 సీట్లను కైవసం చేసుకుంటే.. కాంగ్రెస్ పార్టీ మరీ ఘోరంగా 8 సీట్లను మాత్రమే గెలుచుకుంటుందని ఈ సర్వే వెల్లడించింది. కాగా-ముఖ్యంగా పెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రలో బీజేపీ-శివసేన పొత్తు ఈ కూటమికి లాభించింది. ఒకప్పుడు బీజేపీతో జట్టు కట్టేందుకు శివసేన వెనుకాడినా.. కమలం పార్టీ అధ్యక్షుడు, హోమ్ మంత్రి అమిత్ షా.. పలుమార్లు ముంబై వఛ్చి ఈ పార్టీ అధినాయకత్వంతో సంప్రదింపులు జరిపారు. రెండు పార్టీల మధ్య పొత్తు రాజకీయంగా ఇరు పార్టీలకూ ‘ భారీ ప్రయోజనమే ‘ అవుతుందని నమ్మబలికారు.
ఆయన జోస్యమే నిజమైంది. శివసేన అధినేత ఆదిత్య థాక్రే కూడా అమిత్ షా వ్యూహాన్ని సమర్థించారు. రెండు పార్టీల మేనిఫెస్టోలూ వేర్వేరుగా ఉన్నప్పటికీ.. దాదాపు ఒకే విధమైన అభిప్రాయాలను ప్రతిబింబించాయి . ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీలంతా మోదీ ప్రభుత్వానికి ‘ జై ‘ కొట్టారు. ఇటీవలే ముంబైలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మోదీతో.. వారంతా సెల్ఫీలు దిగిన వైనమే ఇందుకు సాక్ష్యం. నటీనటులే కాదు..దర్శక నిర్మాతలూ వీరిలో ఉన్నారు.

దేశానికి మోదీ నాయకత్వం ఎంతో అవసరమని వారంతా ముక్తకంఠంతో ‘ నినదించారు ‘. ప్రధాని మోడీ పూణే వంటి నగరాల్లో జరిపిన ప్రచారాల్లో.. కాంగ్రెస్ ‘ బలహీనతను ‘ బాగా ఎండగట్టారు. ఈ దేశ ప్రయోజనాలను బీజేపీ మాత్రమే పరిరక్షించగలదన్నారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన 370 అధికరణాన్ని రద్దు చేసినందువల్ల కలిగే ప్రయోజనాలను ఆయన వివరించారు.కాగా- ఈ రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో అసలు కాంగ్రెస్ ప్రభావమే కనిపించలేదు. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి కాంగ్రెస్-ఎన్సీపీ తమ ఓట్లశాతాన్ని పెంచుకోగలిగాయి. బీజేపీ సీట్లు కొన్నింటిలో ఈ కూటమి అభ్యర్థుల జోరు కనిపించింది. కమలం పార్టీకి పట్టు ఉందని భావించిన స్థానాల్లో వీరి హవా కాస్త కనబడడమే ఇందుకు కారణం. హర్యానా విషయానికే వస్తే… ఈ రాష్ట్రంలో ఖట్టర్ ప్రభుత్వం మైనారిటీల ఓట్లనూ కొల్లగొట్టగలిగింది.

రాష్ట్ర అభివృధ్దిలో మీరూ భాగస్వాములేనని, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలంటే మీరు కూడా ‘ కమల వికాసానికి ‘ దోహదపడాలని మనోహర్ లాల్ ఖట్టర్ పదేపదే చెబుతూ వచ్చారు. ఇక ప్రధాని మోదీ సైతం ఈ రాష్ట్రానికి, పంజాబ్ కు మధ్య నదీజలాల వివాద పరిష్కారానికి తమవంతు కృషి చేస్తామని ఇఛ్చిన హామీ కూడా తన ప్రభావం చూపింది. సట్లెజ్ నదీ జలాల విషయంలో ఈ రాష్ట్రాల మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతూ వస్తోంది. స్థానిక సమస్యల పరిష్కారంలో బీజేపీ ఎప్పుడూ ముందంజలో ఉంటుందన్న వాగ్దానం కూడా హర్యానాలో ఈ పార్టీకి కలిసొచ్చింది.

హంగ్ దిశగా హర్యానా..
తాజా ఫలితాల ప్రకారం.. హర్యానాలో హంగ్ ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. 90 సీట్లకు గాను బీజేపీ 38 చోట్ల, కాంగ్రెస్ 32 స్థానాల్లో, ఐ ఎన్ ఎల్ డీ +2, జేజేపీ 10 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. స్వతంత్ర అభ్యర్థులు కీలక పాత్ర వహించే అవకాశాలు కనబడుతున్నాయి. నిజానికి ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం.. ఈ రాష్ట్రంలో బీజేపీ గెలిచేందుకు స్ఫష్టమైన ఛాన్స్ ఉంది. కానీ.. తీరు చూస్తే ఈ అంచనాలు తారుమారు కావడం కొసమెరుపు.

Related Tags