టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇస్తున్న బీజేపీ, కాంగ్రెస్

తెలంగాణలో 16 చోట్ల తమదే విజయమన్న టీఆరెస్‌కు ఊహించని ఫలితాలు ఎదురుకానున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించని జాతీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్‌ లోక్‌సభ ఎన్నికల్లో పుంజుకోవడం విశేషం. తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో ఈ రెండు పార్టీలు కలిపి 8 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలుండగా.. 8 చోట్ల టీఆరెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. 4 స్థానాల్లో కాంగ్రెస్‌, 4 స్థానాల్లో బీజేపీ, ఏఐఎంఐఎం ఒక చోట […]

టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇస్తున్న బీజేపీ, కాంగ్రెస్
Follow us

|

Updated on: May 23, 2019 | 1:19 PM

తెలంగాణలో 16 చోట్ల తమదే విజయమన్న టీఆరెస్‌కు ఊహించని ఫలితాలు ఎదురుకానున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించని జాతీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్‌ లోక్‌సభ ఎన్నికల్లో పుంజుకోవడం విశేషం. తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో ఈ రెండు పార్టీలు కలిపి 8 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలుండగా.. 8 చోట్ల టీఆరెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. 4 స్థానాల్లో కాంగ్రెస్‌, 4 స్థానాల్లో బీజేపీ, ఏఐఎంఐఎం ఒక చోట ఆధిక్యంలో ఉన్నాయి.