మందుబాబులకు బిగ్ షాక్.. షాపులు బంద్

ఏపీలో మందుబాబులకు, లిక్కర్ ప్రియులకు పెద్ద షాకిచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. రాష్ట్రంలోని మద్యం షాపులను మూసి వేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చిందే తడవుగా రాష్ట్ర ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖ అధికారులు మద్యం షాపులను మూసి వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

మందుబాబులకు బిగ్ షాక్.. షాపులు బంద్
Follow us

|

Updated on: May 09, 2020 | 4:00 PM

ఏపీలో మందుబాబులకు, లిక్కర్ ప్రియులకు పెద్ద షాకిచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. రాష్ట్రంలోని మద్యం షాపులను మూసి వేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చిందే తడవుగా రాష్ట్ర ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖ అధికారులు మద్యం షాపులను మూసి వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో ఏపీలో మద్యం షాపులు మూతపడనున్నాయి.

ఏపీలో మరో 13 శాతం మద్యం షాపులు తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో తొలగించిన 20 శాతంతో కలిపి మొత్తం 33 శాతం మద్యం దుకాణాలు తొలగింపునకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 4380 షాపులకుగాను ప్రస్తుతం అందుబాటులో 3469 షాపులున్నాయి. ఈ సంఖ్యను 2934 కు తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మే నెల ఆఖరు నాటికి ఈ 13 శాతం మద్యం షాపులు తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ నుండి మార్చి నాటికి రాష్ట్రంలో లిక్కర్ సేల్స్ 24 శాతం, బీరు అమ్మకాలు 55 శాతం తగ్గినట్టు ప్రభుత్వం అంఛనా వేస్తోంది. తాజా నిర్ణయంతో రాష్ట్రంలో మద్యం విక్రయాలు మరింతగా తగ్గుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కరోనా వైరస్ ప్రబలిన తరుణంలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు అనుమతించడంపై విమర్శలు చెలరేగుతున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకోవడం ద్వారా విమర్శలకు చెక్ పెట్టిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

మీరు క్రెడిట్ కార్డుల ద్వారా అటువంటి చెల్లింపులు చేయలేరు..
మీరు క్రెడిట్ కార్డుల ద్వారా అటువంటి చెల్లింపులు చేయలేరు..
యూపీఎస్సీకి ప్రయత్నించి ఉంటే కచ్చితంగా సాధించేదాన్ని.. సప్తమి గౌడ
యూపీఎస్సీకి ప్రయత్నించి ఉంటే కచ్చితంగా సాధించేదాన్ని.. సప్తమి గౌడ
DC vs GT Preview: గుజరాత్‌పై ఢిల్లీ హ్యాట్రిక్ విక్టరీ కొట్టేనా..
DC vs GT Preview: గుజరాత్‌పై ఢిల్లీ హ్యాట్రిక్ విక్టరీ కొట్టేనా..
నేటితో మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగింపు..!
నేటితో మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగింపు..!
నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో బడులకు వేసవి సెలవులు
నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో బడులకు వేసవి సెలవులు
విజయ్, ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ.. అసలు మ్యాటర్ ఇదే..
విజయ్, ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ.. అసలు మ్యాటర్ ఇదే..
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి