ఇక మాల్స్ లోని రెస్టారెంట్లు.. వీధుల్లోకి..

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థలన్ని అతలాకుతలమయ్యాయి. అయితే ఈ వైరస్ దెబ్బకు మాల్స్ తెరిచే పరిస్థితి లేదు. దీంతో మాల్స్‌లో ఉన్న

ఇక మాల్స్ లోని రెస్టారెంట్లు.. వీధుల్లోకి..
Follow us

| Edited By:

Updated on: May 28, 2020 | 12:37 PM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థలన్ని అతలాకుతలమయ్యాయి. అయితే ఈ వైరస్ దెబ్బకు మాల్స్ తెరిచే పరిస్థితి లేదు. దీంతో మాల్స్‌లో ఉన్న రెస్టారెంట్లు వీధుల్లోకి రానున్నాయి. ఒకప్పుడు వీధుల్లో సాగే హోటల్‌ వ్యాపారాలన్నీ పెద్దపెద్ద మాల్స్‌, అద్దాల భవనాల్లో ఎంతో ఆకర్షణీయంగా, ఖర్చుపరంగా సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎదిగాయి.

కాగా.. కోవిద్-19 విజృంభణతో, ఇప్పట్లో మాల్స్‌ తెరిచే పరిస్థితి లేకపోవడంతో.. పేరుమోసిన పెద్దపెద్ద రెస్టారెంట్లన్నీ వీధుల్లో తమ స్టాళ్లను తెరిచేందుకు ప్రయతిస్తున్నాయి. 2000 సంవత్సరం మొదట్లో వీధుల్లో ఉన్న రెస్టారెంట్లు మాల్స్‌లోకి వెళ్తే.. 2020లో మాత్రం దీనికి పూర్తి భిన్నంగా అవే రెస్టారెంట్లు వీధుల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ కంపెనీ మెక్‌డొనాల్డ్స్‌, స్పెషాలిటీ రెస్టారెంట్లు, లైట్‌ బైట్‌ ఫుడ్స్‌ ఈ దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు.. కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపించేందుకు మాల్స్‌ మంచి హాట్‌ స్పాట్‌ సెంటర్లు అయ్యే ప్రమాదం ఉన్నందున మాల్స్‌ను తెరవడం లేదు. ఒక వేళ మాల్స్‌ను ఓపెన్‌ చేసినప్పటికీ వ్యాపారాలు నిర్వహించడానికి కొన్ని నిబంధనలు, నియంత్రణలు ఉన్నాయి. దీంతో రెస్టారెంట్లకు ఇంది పెద్ద ఇబ్బంది కలిగించే అంశమే. మరోపక్క మాల్స్‌లో ఏర్పాటు చేసే ఫుడ్‌కోర్టులకు రెంట్‌ ఎక్కువగా ఉంటుంది. అదే వీధుల్లో అయితే తక్కువ ఖర్చుతో రెస్టారెంట్లను నడపవచ్చు.